29వ డివిజన్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు…

29వ డివిజన్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని 29వ డివిజన్‌లో ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ వేముల సంధ్య,మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తూ పరస్పరం స్నేహభావాన్ని పంచుకుంటున్నామన్నారు. హిందూ-ముస్లిం సోదరభావంతో కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక భావజాలానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సామరస్యానికి కట్టుబడి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మౌలానా షాహిద్ రజా, ఎండి మసూద్, ఎండి జలీల్, ఎండి అఖిల్ పాషా, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి నిజాం పాషా, పట్టణ ఉపాధ్యక్షుడు నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాంగ్రెస్ నాయకులు దండెం రతన్ కుమార్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఎండి రియాజ్, ఎండి గౌస్ భాష, ఎండి అన్ను, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
​ శివాజీ మహారాజ్ పరాక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం: పల్లపు సురేందర్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ఆధ్వర్యంలో స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షకుడిగా, అపార ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ దేశభక్తి మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత శివాజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన సమాజం కోసమే శివాజీ నిరంతరం శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంక్రాంతి ముగ్గుల పోటీల ప్రారంబించిన దోసకాయల…

సంక్రాంతి ముగ్గుల పోటీల ప్రారంబించిన దోసకాయల

మేడ్చల్, నేటిధాత్రి :

 

 

 

సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ముగ్గుల పోటీల ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. ముడుచింతల పల్లి పరిధిలోని పొన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఏఎంసి చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి మెంబర్ గోగుల సరిత లతో కలసి దోసకాయల వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంప్రదాయ పండుగలుగా సంక్రాతి పండగా సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు వేదికగా నిలుస్తాయని అభినందించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి మెడబోయిన జ్యోతి రూ. 10000, రెండవ బహుమతి జజల పూర్ణిమ రూ. 6000, మూడవ బహుమతి మర్యాల బాల లక్ష్మీ రూ 3000, నాల్గవ బహుమతి రూ.2500 జి. శ్రీవాణి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లతరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు..

వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్ గారి అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108 వ జయంతి. కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయురాలు చిత్ర పటానికి దండ వేసి పూలు చల్లి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మాజీ ప్రధాని ఇందిర గాంధీ 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో , 20 సూత్రాల పథకంప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుం టి కుమార స్వామి సీనియర్ నాయకులు గుజ్జ రవీందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నంబర్ ఎండి అన్వర్,రాజా రాజేశ్వర టెంపుల్ చైర్మన్ మైదం బుచ్చి మల్లు,గడ్డం సమ్మయ్య గౌడ్, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ మనోహర్ రెడ్డి,ల్యాబర్తి,అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు ,లింగం రజిత రెడ్డి,,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్, సంకినేని దేవేందర్ రావు,రావుల గంగయ్య,గంగరాజు, ,,చిటూరి రాజు, ,ఒగ్గుల మాధవి,బెజ్జం పాపారావు, కట్రియా ల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, చిర బోయిన రాజు,మెరుగు రమేష్,తుమ్మల కుమారస్వామి, రాకేశ్ ముదిరాజ్ బండారి యాకయ్య,సంతోష్ ,యాకయ్య,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version