అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version