నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్

పరకాల,నేటిధాత్రి

పట్టణ 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ సోదరి దుప్పటి కోమల రాజయ్య దంపతుల కూతురు స్రవంతి సాయితేజ వివాహ వేడుక పరకాల పట్టణంలోని మహాదేవ్ కన్వెన్సన్ లో జరగగా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మండల అధ్యక్షులు పర్నెం మల్ల రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు పోరండ్ల మౌనిక, వేణు,పాలకుర్తి శ్రీనివాస్,అల్లె దశరథం,గూడెల్లి సదన్ కుమార్,బొచ్చు సుభద్ర సాల్మన్,పబ్బ శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం…

పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం

విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే

పరకాల,నేటిధాత్రి

 

పురపాలక సంఘం పరిధిలోని పాత మునిసిపల్ కార్యాలయంలో పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సమావేశమయ్యారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్,మెయిన్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లలో శుభ్రత పనులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి కార్మికుడు తనకు కేటాయించిన వార్డులో విధులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.ప్రజలు,కౌన్సిలర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు.ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళల్లో తగినంత నీరు, నిమ్మరసం తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తెలియజేయాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య,15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్,సానిటరీ ఇన్స్పెక్టర్ జి.వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్…

డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్

యాదగిరిగుట్ట నేటి దాత్రి:

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మరియు 7వ వార్డు కౌన్సిలర్ మెల్లిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ ఎరుకల హేమేందర్ సుడుగు శ్రీనివాస్ రెడ్డి బుజ్జ సాంబేష్ బ్రహ్మచారి మరియు తదితరులు పాల్గొన్నారు*

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం…

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం గౌడ్ గణేష్ చౌక్ ప్రాంత పునర్వైభవం కోసం చేస్తున్న కృషికి తొలి విజయం లభించింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, వారసంత, బస్టాండ్ పునరుద్ధరించాలని కౌన్సిలర్ గతంలోనే జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
మున్సిపల్ పాలకవర్గం, బుధవారం నాడు గణేష్ చౌక్ నుండి లక్ష్మీ నగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, సి.ఆర్. నగర్ కాలనీల వరకు ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్వయంగా ఎర్ర చెరువు ప్రాంతాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ మాట్లాడుతూ
మా వార్డులోని గణేష్ చౌక్ ప్రాంతం వెనుకబడకూడదని మొదట కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాం వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు
పాత గ్రామ పంచాయతీ స్థలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం బస్టాండ్ ఆటో నగర్ అంగన్‌వాడీ ప్రత్యేక భవనాల ఏర్పాటు చేయాలని అయినా అధికారులకు తెలిపారు

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం…

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట, నేటిధాత్రి:

 

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపల్ యంత్రాంగంతో కలిసి 24వ వార్డులో పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక వార్డు కౌన్సిలర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డులో ఎమ్మెల్యే సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుధ్యం, మెరుగైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను వారు సమీక్షించారు. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వించి మోటర్లు అమర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా వార్డులోని జీడయ్యపల్లె ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అయూబ్ ఖాన్, 24వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు,వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం..

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం

మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలో ఏఎన్ఎంఎస్సి కమిటీ సమావేశం ప్రాజెక్ట్ సిడిపిఓ మధురిమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిడిపిఓ మధురిమ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాతా శిశు సంక్షేమం కోసం పౌష్టికాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్ర అభివృద్ధి కోసం ఏఎన్ఎంఎస్సి కమిటీ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ బత్తిని రాజేందర్ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలు గాజుల జ్యోతి, జగన్నాధ దీపికలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటి నుండి పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణ, స్థానిక అంగన్వాడీ టీచర్లు దాసరి రమాదేవి, నల్లా భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు నాడెం రాజ్యలక్ష్మి, బాలుగు రజిత, ఆర్పి అనిత, జ్యోతి, దీపిక, సంధ్య, మమత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలి…

డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలి

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

పాకాల రోడ్డులో డంపింగ్ యార్డ్‌ సందర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని సంబంధిత మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నర్సంపేట పట్టణ శివారులోని మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపైకి వచ్చిన చెత్తాచెదారాన్ని జెసిబి సహాయంతో తొలగింపజేశారు.ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, దుర్వాసన మరియు అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని, పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్తను సకాలంలో తరలించి శాస్త్రీయంగా నిర్వీర్యం చేయాలని, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా డంపింగ్ యార్డ్ వద్ద సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు క్రమం తప్పకుండా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మాదాసి రవి, అయూబ్ ఖాన్, పొన్నాల మనిషా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట ప్రభాకర్, కీసర వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు…

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జహీరాబాద్ నియోజకవర్గ అల్లాడి వీరేశం బట్టల దుకాణ యజమాని.అమెరికా పర్యటన ముగించుకొని జహీరాబాద్ కు వచ్చిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నరసింహులు గారికి కలిసిన సందర్భంగా జహీరాబాద్ నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్ గారికి ఎస్ వి షాపింగ్ మాల్ లో ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్
మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని మనమందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలలో ప్రాధాన్యత భేదాలు వర్గ విభేదాలు ఎప్పటికీ ఉండరాదని ఆయన హితవుపలికారు. ఎన్నికల పోటీల్లో మాత్రమే పోటీ ఉండాలి గెలిచిన అనంతరం అందరూ ఐకమత్యంతో సమన్వయంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్…

33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్
వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ బుధవారం ఉదయం పర్యటించారు ఈ మేరక వార్డులో దివంగత మాజీ ఎమ్మెల్యే జయ రాములు ఇంటి దగ్గర న్యాయ వాది కృష్ణ మోహన్ ఇంటి ఎదురు గా ఉన్నమోరిని పరిశీలించారు మోరీ మొత్తం కావడం వల్ల పందికొక్కులు ఎలుకలు స్వరంగాలు పెట్టి ఇండ్లలోకి వస్తున్నాయని వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ డ్రైన్ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వార్డు పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు జ్ఞానేశ్వర్ యాదవ్ మహేష్ కుమార్ ఈ మేరకు 33 వ వార్డు లో పేదలకు ప్రభుత్వం చే ఇండ్ల నిర్మాణం అదేవిధంగా పురాతనమైన ట్రైన్స్ ఉన్నాయని కొత్తగా చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు ఈ మేరకు వారు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తో చర్చించి వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కాలువను దొంత నందు ఇo టి ముందర కలపాలని వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ విజ్ఞుప్తి చేశారు

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం…

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం పట్టణ ప్రజల అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రమాణస్వీకారం అనంతరం నూతన పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలిశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ (జావేద్) , కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్ కలిసి కేటీఆర్ ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంట పట్టణంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ నాయకత్వం మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు

జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం…

జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ చైర్మన్ గా మహ్మద్ యూనూస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికకు సంబంధించి నిర్ణీత సమ యానికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్తో సహా 20 మంది కాంగ్రెస్ సభ్యులు మున్సిపల్ కార్యా లయానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సహా 19మంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేరుకున్నారు. కోరం సభ్యు లందరూ హాజరైన అనంతరం ప్రత్యే కాఅధికారి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. చైర్మన్ గా యునస్, వైస్ చైర్మన్ గా శిరీషారెడ్డి ఎన్నికవగా వారికి అభి నందనలు తెలిపారు.

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు..

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను మంగళవారం తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొంది, ఇటీవలె చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం నేతలు వారికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు పదవులు దక్కడం అభినందనీయమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూనే, గౌడ సంఘం సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. భూపాలపల్లిలో గౌడ సంఘం కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం తో పాటు, గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, తడుక సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, నాగపురి సమ్మయ్య గౌడ్, గైని ఎల్లగౌడ్, సదానందం గౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గండి చిరంజీవి గౌడ్, కె.వి అశోక్ గౌడ్, చిర్రా అశోక్ గౌడ్, గట్టు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

చైర్మన్ కు కౌన్సిలర్లకు ఆర్యవైశ్యుల భారీ సన్మానం…

చైర్మన్ కు కౌన్సిలర్లకు ఆర్యవైశ్యుల భారీ సన్మానం

నేటిధాత్రి యాదగిరిగుట్ట:

 

యాదగిరిగుట్ట ఆర్యవైశ్యులు ప్రతి అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టదరు, ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికైన చైర్మన్ వాణి భరత్ గౌడ్ గారికి, మరియు పదిమంది కౌన్సిలర్లకు ఆర్యవైశ్య పెద్దలు ఘనంగా సన్మానించారు. సన్మాన అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్యులు తడ్క వెంకటేష్, తాళ్లపల్లి నాగరాజు, బెలిదే భాస్కర్, నువ్వుల రమేష్, రంగ సత్యం, లింగ సత్యం, ఎలకంటి మోహన్, నంగునూరు భాను, బాలేష్ గుప్తా, బెలీదే అశోక్, లక్ష్మీనారాయణ గుప్తా, అర్థం శీను, కొండూరి నరసింహ, బెలిగా నరసింహ, కూరెల్లి నరసింహ, ప్రొద్దుటూరు వేణుగోపాల్, నగేష్ గుప్తా, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్..

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్
​వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్
వైస్ చైర్మన్ మధు గౌడ్ కౌన్సిలర్ B.రమాదేవి ని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడిదొడ్డి మాధవి రమేష్ కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు ఈమేరకు మాధవి రమేష్ ను గెలిపించి నందుకు 33 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు
​వనపర్తి పట్టణంలోని పలు ప్రజా సమస్యల గురించి చైర్మన్ తో చర్చించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
​ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష. మాట్లాడుతూ
వనపర్తి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం కృషి చేయాలి మిగిలి న రోడ్ల విస్తరణ. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన సమితి సహకారాన్ని అందిస్తుందిఅని ఆయన పేర్కొన్నారు.
​ స్పందించిన చైర్మన్ మిడి దొడ్డి మాధవి రమేష్ , పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న, మెూచి సంఘం జిల్లా ప్రెసిడెంట్ అయింధ్యాల శంకర్ బాబు రతన్ నాయక్ బాలకృష్ణ ఆర్యవైశ్య డు బండల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ సోమవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ మాధవి రమేష్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రాం మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత మార్కెట్ యార్డులో ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఖాళీ స్థలం ఉన్నదని స్థలంలో నిర్మాణం చేయుటకు ప్రభుత్వంచే నిధులు ఇప్పించుటకు కృషి చేయాలని నూతన చైర్మన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ధైర్యంగా ఏ ఎన్నికలు వచ్చినా పోటీలోఉండాలని పిలుపునిచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనందుకు మాధవి రమేష్ ని అభినందించారు . వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్యు మహిళ మాధవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజు అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి మారం బాలేశ్వర శెట్టి సంబు వెంకటేశ్వర్లు ఏపూరి శ్రీనివాసులు కోట్రరామకృష్ణ చవ్వపండరయ్య తాడిపర్తి శేషయ్య కటకం సుధాకర్ నరహరి నరేష్ శ్రీరాములు కె బి శ్రీనివాసులు పూరి పాండు కండే జ్యోతిబాబు మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు

33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు…

33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 33 వ వార్డు జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ ఎల్ ఎన్ మాధవి బిజెపి తరపున బచ్చ సౌజన్య బీఆర్ఎస్ తరపున అలైఖ్య పోటీలో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీమణి మాధవి 33 వ వార్డు నుండి కౌన్సిలర్ గా విజయం సాధిస్తే మున్సిపల్ చైర్మన్ పఫవి దక్కించుకుంటారని ప్రజలు రాజాకీయా పరిశీలకులు అంటున్నారు

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి…

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముస్తాల తేజ

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ 2 వార్డ్ అభ్యర్థి ముస్తల తేజ అన్నారు ఈ సందర్భంగా తన సొంత వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రజలందరి మనసును దోచుకున్నదని చేర్యాల మున్సిపల్ మేము హస్తగతం చేసుకుంటామని

అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని మరియు ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని రెండో వార్డ్ కౌన్సిలర్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణాన్ని అగాధంలో నెట్టివేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భూమి గారి మనోహర్ ముస్తాల స్టీవెన్ కాటం సంజీవయ్య చెవిటి లింగం భూమిగారి మహేందర్ ముస్తాల కిష్టయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో…

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో హోదా లో ఒకే మున్సిపాలిటీ ని ఎంపిక చేసుకోవాలి
వనపర్తి నేటిధాత్రి .

 

 

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణీ కుముది సూచించారు సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చుకొని ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈవీ డియో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యడిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు

 మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..

 మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

 

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని Post) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. అయితే, ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు ‌ వినియోగించుకున్నారు ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. ఈ క్రమంలో తలారి గౌతమికి టీడీపీ హై కమాండ్ శుభాకాంక్షలు తెలిపింది.

కాగా, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ(గురువారం) జరిగింది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా… వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది.మరోవైపు.. రామగిరి ఎంపీపీ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది రామగిరి ఎంపీపీ ఎన్నిక. నాలుగోసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక ఈరోజు (గురువారం) జరగనుంది. ఇప్పటికే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మూడుసార్లు కోరం లేక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది . గురువారం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరగనుండటంతో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version