వరంగల్ 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిభను కనబరిచిన విద్యార్థిని…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T113444.650.wav?_=1

 

వరంగల్ 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిభను కనబరిచిన విద్యార్థిని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం బర్దీపూర్ విద్యార్థిని వరంగల్ లో జరిగిన 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిబాను కనబర్చింది. బర్దీపూర్ గ్రామం తండ్రి నర్సిములు (ఉల్లాష్ పెంటర్) కూతురు ఉదయ కుమారి రంజోలే వసతిగృహం చదువుతుంది. ఉదయకుమారికి కబడ్డీ లో ప్రతిభను కనపరచడంతో కళాశాల ప్రిన్సిపాల్ ,సిబ్బంది,గ్రామస్తులు అభినదించారు.

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T123946.116.wav?_=2

 

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన పాలకుర్తి కాశయ్య రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు సందీప్ నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి సందీప్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందించారు. తన సోదరుడు పాలకుర్తి సందీప్ బాబాయ్ కాశయ్య స్ఫూర్తితో వ్యవసాయక అధికారిగా పనిచే స్తూనే గ్రూపు 1 పరీక్ష రాసి గ్రూపు వన్ లో 80 శాతం మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం ఎంతో గర్వంగా ఉందని పాలకుర్తి తిరుపతి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించినందుకు చెప్పలేనంత సంతోషం గా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సందీప్ మరింత ఉన్నత సాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T135810.401.wav?_=3

 

 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ,వాహన పూజలు

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో ఈరోజు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈపూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లుమధుకర్, యాదగిరి, సి.ఐ లు కృష్ణ,నాగేశ్వరావు,మధుకర్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

జహీరాబాద్ యువతికి గ్రూప్-1 లో ఘనవిజయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T114449.424.wav?_=4

 

 

జహీరాబాద్ యువతికి గ్రూప్-1 లో ఘనవిజయం

డిప్యూటీ కలెక్టర్ హోదా సాధించిన క్రిస్టినా ఇవాంజిలీన్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన డీ.ఏ. క్రిస్టినా ఇవాంజిలీన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్రూప్-1 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదాకు ఎంపికయ్యారు. క్రిస్టినా డీ. ఆనంద్, సుగుణ దంపతుల కుమార్తె. ఆమె ఎలూరి కిరణ్ కుమార్ సతీమణి. ప్రస్తుతం వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
“ఈ విజయాన్ని నా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. వారి తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఈ స్థాయికి చేరుకోలేను. ప్రతి ఒక్కరిలోను గ్రూప్-1 సాధించగల సామర్థ్యం ఉంది. క్రమశిక్షణ, దృఢనిశ్చయం, పట్టుదల ఉంటే ఏ విజయం సాధ్యం అవుతుంది.” అని పేర్కొన్నారు.
ఆమె విజయం కుటుంబ సభ్యులతో పాటు జహీరాబాద్ ప్రజలకు గర్వకారణంగా మారింది. యువతకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తోంది.

చివరి శ్రావణ సోమవారం అన్నదానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-5.wav?_=5

చివరి శ్రావణ సోమవారం అన్నదానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించారు. శివాలయం సేవకులు మలేష్ యాదవ్, కృష్ణా రెడ్డి, రమేష్, నాగేష్తో పాటు వారి బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం…

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం

జిల్లాలో 97 మంది బాల,బాలికల సంరక్షణ

సిడబ్ల్యూసి ముందు హాజరుపర్చి బాల,బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగినది.

18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఈసంవత్సరం జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ ,వివిధ శాఖల అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 97 మంది బాలబాలికలను గుర్తించి CWC ముందు హాజరుపర్చగా వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అప్పగించడం జరిగిందని,18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.వీధి బాలలను చూసినప్పుడు స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు.ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు,సిబ్బందినిజిల్లా
ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఎన్నార్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేద్దాం..

ఎన్నార్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేద్దాం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

సామాజిక ఉద్యమకారులు, ప్రముఖ వాగ్గేయకారులు, గొప్ప ప్రజాస్వామికవాది ఎన్నార్ జహీరాబాద్ ప్రాంతానికి చేసిన అనేక రకాల సేవలకు గుర్తింపుగా ఆగష్టు 3న నిర్వహించతలపెట్టిన ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని జహీరాబాద్ ప్రాంతంలో గల సామాజికవేత్తలు,సంఘ సంస్కర్తలు,వివిధ విభాగాల నాయకులు మరియు ఎన్నార్ అభిమానులు నిర్ణయించడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి జహీరాబాద్ పట్టణంలో గల “ఎన్ కన్వెన్షన్ హాల్ ” నందు సన్నాహక సభను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి సన్మాన సభకు ప్రముఖ వక్తలు, ప్రముఖ గాయకులు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని జహీరాబాద్ ప్రాంతవాసులంతా,వివిధ సంఘనాయకులు, సామాజికవేత్తలు,వివిధ విభాగ పార్టీల నాయకులు అలాగే ఎన్నార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విడుదలే పెద్ద విజయం..

విడుదలే పెద్ద విజయం

నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాఽథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా ‘చైనా పీస్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో…

నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాఽథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా ‘చైనా పీస్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ఈ చిత్రం టీజర్‌ని లాంచ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఒక సినిమాను నిర్మించి రిలీజ్‌ చేయడమే పెద్ద సక్సెస్‌, ప్రేక్షకులకు సినిమా నచ్చితే బోన్‌సగా భావించాలి. ఇది ఒక స్పై ఫిల్మే కాదు..స్పై కామెడీ కథ కూడా. టీజర్‌ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్‌’ అనే పేరు పెట్టడం సాహసమే. అన్ని విభాగాల్లోనూ జాగ్రత్తలు తీసుకొని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని చెప్పారు. కార్యక్రమంలో హీరోలు నిహాల్‌, సూర్య శ్రీనివాస్‌, నటులు కమల్‌ కామరాజు, హర్షిత తదితరులు పాల్గొన్నారు.

మహా గర్జన సదస్సును విజయవంతం చేయాలి..

మహా గర్జన సదస్సును విజయవంతం చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న అట్టడుగు వర్గాలైన వికలాంగులకు అనేక రకాల పింఛన్దారులకు మేనిఫెస్టో ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రకారం వికలాంగులకు పెన్షన్ 6000 లకు ఇతర ఆసరా పెన్షన్లు 4000 రూపాయలకు తీరువ వైకల్యం వికలాంగులకు 15000 వెంటనే తీర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతుందని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్దేశంతో జూలై, ఈ నెల,28 సంగారెడ్డి లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ, మందకృష్ణ మాదిగ,అధ్యర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సన్నహాక సభ లో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల సంఘం సీనియర్ నాయకులుహైమద్, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయి కోటి నర్సిములు పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం..

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లిబిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T151132.047.wav?_=6

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 27న జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు హాజరవుతారని ఈ సమావేశానికి మొగుళ్ళపల్లిమండల మండలంలోని ఇస్సి పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే కొడాలి కొమురయ్య గారి విగ్రహావిష్కరణ అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మండలపరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొగుళ్ళపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగూరితిరుపతిరావు తెలిపారు

నేటి విద్యాసంస్థల బందు విజయవంతం.

నేటి విద్యాసంస్థల బందు విజయవంతం

హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు
జమ్మికుంట (నేటిధాత్రి)

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
జమ్మికుంట పట్టణ కేంద్రంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్ధునూరి విష్ణు మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న పిలుపునిచ్చిన విద్యాసంస్థల బందు విజయవంతం అయిందని అన్నారు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బకాయి ఉన్న 8 వేలకోట్ల విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి కావున హాస్టల్ విద్యార్థులకు మేస్చార్జులు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, ఆర్టీసీ లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు MD అజీమ్,ఆర్ అవినాష్, జె శేసి, ఇ గణేష్, పి వికాస్ తదితరులు పాల్గొన్నారు

వికలాంగుల మహా గర్జన సభను విజయవంతం చేయాలి..

వికలాంగుల మహా గర్జన సభను విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట శంకర్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ శాఖ అధ్యక్షులుగా అడిచర్ల తిరుపతి ఉప అధ్యక్షులుగా రేణికుంట్ట్ల మొగిలి ప్రధాన కార్యదర్శిగా భోగి రవి నీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామచంద్ర వారు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ రూపాయలు 6000 పెంచాలని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత కార్మికుల పెన్షన్ 4000 కు పెంచాలని అలాగే పూర్తిస్థాయి కండ నరాల బలహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయడానికి ఈనెల 25న భూపాలపల్లి లో నిర్వహించబోయే ఈ సభకు వృద్ధులు వికలాంగులు ఇదంతులు హాజరై గీత బీడీ గౌడ అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

* పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్.*

హైదారాబాద్/వికారాబాద్,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.ఈ సందర్భంగా పిడిఎస్యు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు.ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని కోరారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలన్నారు.సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలని అలాగే ప్రతి మండలంలో గురుకులాలు,మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని,నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 23న వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యు వికారాబాద్ ఇంచార్జ్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్,ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్,సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

మండల ఉపాధ్యక్షులు చెట్టుపల్లి చందు

మంగపేట: – నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ తరపున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కళాశాలలు విజయవంతం చేయండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శెట్టిపల్లి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు న్యాయం చేయలేదని విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారినా గాని రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ప్రాముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని విద్యార్థులకు బస్సు సౌకర్యాలు బస్సు చార్జింగ్ తగ్గించాలని పూర్తిస్థాయిలో విద్యార్థులకు హాస్టల్లో స్కూల్లలో మౌలిక సదుపాయాలు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఎస్ఎఫ్ఐగా వారు హెచ్చరించారు అదేవిధంగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్ట్లు ఎంఈఓ డీఈవోలు పోస్టింగులు అమలు చేయాలని అదేవిధంగా ప్రవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మరియు ప్రైవేటు యూనివర్సిటీలపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు బాధ్యత ప్రభుత్వ వహించాలని ఇప్పటికే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విడుదల కాక ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది హాస్టల్లో టైం టేబుల్ ప్రకారంగా విద్యార్థులకు మెస్ పాటించాలని అన్నారు రాష్ట్రంలో మాటల్లో తెలియజేశారు గాని చేతుల్లో లేదని ప్రజా పాలన చేస్తామని ప్రజలకు ఎటువంటి న్యాయం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనిపై ప్రభుత్వం చెయ్యాలని అన్నారు లేని ఎడల గత ప్రభుత్వం లెక్కే ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులను ఏకమై సమాధానం చెప్తామని సూచన తెలియజేశారు
లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులం వారి తల్లిదండ్రులతో పాటు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

 

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి,పీడీఎస్యు, జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని,గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్,పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు రవి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్,నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి.

జూలై 23న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి-వామపక్ష విద్యార్థి సంఘాలు

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో బంద్ జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డిఈవో పోస్టులను భర్తీ చెయ్యాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలి. ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతానికి విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈసమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, ఎఐఎఫ్డిఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, పిడిఎస్యూ జిల్లా నాయకులు ముల్కాల మారుతి, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేశబోయిన రాము యాదవ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అసంపెల్లి వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష సంఘాల పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు. ప్రవీణ్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ ఈ నెల జులై 23వ తేదీనా రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు.విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్ ని
ప్రభుత్వ, ప్రెవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు తల్లిదండ్రులు బందులో పాల్గొని మద్దతు తెలియజేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పొంగంటి రాజేష్ వికాస్ అతుకూరి తిరుపతి ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.a

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి..

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి

మందల రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల నాయకులు.

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-42.wav?_=7

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క కు ఉద్యమకారులందరూ తరలిరావాలని ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు మందల రవీందర్ రెడ్డి పిలుపినిచ్చారు. ఈ
సందర్భంగా మందల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి.
ప్రతి ఉద్యమకారునికి 250. గజాల స్థలం ఇవ్వాలి.
జార్ఖండ్ రాష్ట్రంలో తరహాలో ప్రతి ఉద్యమకారునికి ప్రతి నెల 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు. ఉచిత బస్సు రైల్వే సౌకర్యాలు కల్పించాలి.
పదివేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు నే ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు

మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి

మండల అధ్యక్షులు,వైస్.ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-5-2.wav?_=8

పరకాల నేటిధాత్రి
18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు జయప్రదం చేయాలి.

*అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలి*

నర్సంపేట,నేటిధాత్రి:

ఈనెల 19 న ఇల్లందులో జరుగు అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు ఇట్టబోయిన రవి, గుర్రం అజయ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పట్టణంలోని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సదస్సు కరపత్రాల ఆవిష్కణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజా సంపాదన దోచిపెడుతూ ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకచ్చి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అడవి ప్రాంతంలో పోలీసు మిలిటరీ బలగాలతో అడవిలో నివసిస్తున్న ఆదివాసులను హింసించి చంపుతున్నారని ప్రశ్నించే మేధావులను జైల్లో నిర్బంధిస్తున్నారని, కళాకారులుగా వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగంలోనే హక్కుల కోసం నిర్వహించే ఉద్యమానికి ప్రజలంతా ఆసరాగా నిలవాలని జులై 19 న ఇల్లందులో జరుగు రాష్ట్రస్థాయి అరుణోదయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రవితేజ,ఉషాకిరణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version