ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా
– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు
