కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం…

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం పట్టణ ప్రజల అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రమాణస్వీకారం అనంతరం నూతన పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలిశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ (జావేద్) , కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్ కలిసి కేటీఆర్ ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంట పట్టణంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ నాయకత్వం మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version