జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం…

జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ చైర్మన్ గా మహ్మద్ యూనూస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికకు సంబంధించి నిర్ణీత సమ యానికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్తో సహా 20 మంది కాంగ్రెస్ సభ్యులు మున్సిపల్ కార్యా లయానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సహా 19మంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేరుకున్నారు. కోరం సభ్యు లందరూ హాజరైన అనంతరం ప్రత్యే కాఅధికారి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. చైర్మన్ గా యునస్, వైస్ చైర్మన్ గా శిరీషారెడ్డి ఎన్నికవగా వారికి అభి నందనలు తెలిపారు.

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

#ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎల్పుల మల్లికార్జున్ (మల్లి), గోపగోని సాయి గౌడ్, వై శ్రీనివాస్, పుల్యాల వంశీ, కుందూరు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, సర్వర్, తరుణ్, రాకేష్, భాను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగుర్ల కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

నాగుర్ల కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడి గా ఇటివలె నూతనంగా ఏకగ్రీవం గా ఎన్నికైన నాగుర్ల వెంకటేశ్వర్ల కు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన నడికూడ ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకటి నాగేష్,వాంకె రాజు, నారగాని రాజేష్ తదితరులు ఉన్నారు.

పార్థివ దేహానికి నివాళులర్పించిన వై. నరోత్తం

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత ఆర్.బక్కయ్య గుప్త గారి సతీమణి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఆర్. బస్వరాజ్,విజయ్ కుమార్, గోపిరాజ్,వీరేశలింగం,మజిద్,చెంగల్ జైపాల్,తదితరులు ఉన్నారు,

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్..

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.

హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్‌ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.

సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి

ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.

ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక

అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక

ముత్తారం :- నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుదిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన శాఖ అధ్యక్షుడిగా దేశిని రాజేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజీదు పాషా, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఉపేందర్, ఉప సర్పంచ్ అనవేనా హరిత తిరుపతి, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన అధ్యక్షుడు దేశిని రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని, గ్రామంలో కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేయాలని సూచించారు.

ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్..

ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి పేరుతో కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేయాలని బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్
నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి:-

 

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ శ్రీ తల్లోజు ఆచారి సంచలన ప్రకటన ,కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేసి, ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రేషన్, RDO, STO, RTO కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటికి దూరం ,తల్లోజు ఆచారి ప్రకటనతో కల్వకుర్తి – ఆమనగల్ రాజకీయాల్లో ఉత్కంఠ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉంటుందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ, రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి జిల్లా అంశంపై స్పష్టత ఇస్తుందా? ఆమనగల్లులో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటుందా? ప్రభుత్వ చర్చ ,గత మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, ఆమనగల్లు మున్సిపాలిటీలో బీజేపీ పాలకవర్గం , స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా రేపు మాడుగులలో కార్యక్రమం జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ,కల్వకుర్తి నియోజకవర్గ అఖిలపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలని,ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి, రేపటి సీఎం భేటీపై సర్వత్రా ప్రజల్లో ఆసక్తి, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ*

బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం ధనాసిరి గ్రామ బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న వారిని ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజి చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రతాప్ కులకర్ణి,కుప్పన్న పాటిల్, సర్పంచ్ మాణిక్ యస్. గోపాల్,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,బి.దిలీప్,సిద్దన్న, తదితరులు ఉన్నారు

వీబీజీఆర్‌జీ చట్టం రద్దు చేయాలి – ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన దుర్గం చిన్నయ్య

బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్,మంచిర్యాల: నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షాద్ బాబా సతీమణి అకాల మరణం చెందారని,విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం వారి నివాసానికి వచ్చి కుటుంబానికి మనో ధైర్యాన్ని చేకూర్చి ప్రగడ సానుభూతి తెలిపారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై నాయిని తీవ్ర విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యే నాయిని

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

హనుమకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు,శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టంగా వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయని, అలాంటి పథకాలను అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతుందన్నారు.
పథకాల పేర్లు మార్చాలనే నెపంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందని విమర్శించారు. అసలు సమస్య పరిష్కారం కాకుండా పేర్ల రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లో పనులు నిలిచిపోవడంతో కూలీలు, పేద కుటుంబాలు తీరని అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, ఇప్పుడు కూడా దేశ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడమే వారి విధానంగా మారిందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను తుంగలో తొక్కుతూ, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌టీఏ యాక్ట్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసని, అలాంటి చట్టాలను కూడా బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పట్ల చేసిన ద్రోహాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు కర్తవ్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపాలని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాల్సి ఉందని, ఆ హామీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు గడిచినా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన ఐనవోలు గౌడ సంఘం కమిటీ..

ఎమ్మెల్యేను కలిసిన ఐనవోలు గౌడ సంఘం కమిటీ
గౌడ సంఘానికి కమ్యూనిటీ హాల్, ప్రహరీ మంజూరు చేయాలి
ఎమ్మెల్యేను కలిసి విన్నవించిన మాజీ ఎంపిటిసి బొల్లెపెల్లి మధు
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు

నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐనవోలు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన గౌడ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘానికి స్వంత భవనం నిర్మాణంతో పాటు దాని చుట్టూ కాంపౌండ్ గోడ అవసరాన్ని ఐనవోలు కాంటెస్ట్ సర్పంచ్ బొల్లెపెల్లి మధు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.గౌడ సంఘం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై మధు చొరవ తీసుకుని సమస్యను ఎమ్మెల్యే ముందు ఉంచడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌడ సంఘ భవనం మరియు దాని చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. అలాగే సంఘ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఐనవోలు కాంటెస్ట్ సర్పంచ్ బొల్లెపెల్లి మధు, ఋగ్వేద్ రెడ్డిని ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

గౌడ సంఘ అభివృద్ధికి మధు చూపిన చొరవ పట్ల సంఘ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా తమ సమస్యలపై ఇదే విధంగా పోరాటం చేయాలని ఆకాంక్షించారు.

బీజేపీ గెలిచిన సర్పంచ్‌లకు ఘన సన్మానం

బిజెపి పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ లకు సన్మానం

బిజెపి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై
అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది
అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ప్రజలు బీజేపీపై పెట్టిన నమ్మకమే ఈ విజయానికి నిదర్శనమని, ఇది పార్టీ కార్యకర్తల కష్టానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి, పారదర్శకంగా అమలు చేయడంలో మీరు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆరంభమే తప్ప అంతిమం కాదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కీర్తి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ వివిధ మోర్చ అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శిగా అంబాల అశ్వద్ధామ..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శిగా అంబాల అశ్వద్ధామ

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం సిపిఐ ఎం ఎల్ పార్టీ మండల కార్యదర్శిగా అంబాల అశ్వద్ధామను నియమించినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతంచేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండ కడుతూ ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటాల నిర్వహించాలని అన్నారు

ఝరాసంగం సర్పంచ్ వినోద బాలరాజ్ ఘన విజయం..

ఝరాసంగం సర్పంచ్ వినోద బాలరాజ్ ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద బాలరాజ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను సాధించిన వినోద బాలరాజ్ కు గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. ఫలితాలు వెలువడగానే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వినోద బాలరాజ్ మాట్లాడుతూ “గ్రామ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను ఆదరించి గెలిపించిన ప్రతి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ బిడ్డగా మీకు అండగా ఉంటాను” అని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version