వర్గ పోరాటమే ప్రత్యామ్నాయం: ఎంసిపిఐ(యు) కార్యదర్శి

వర్గ సామాజిక పోరాటాలే ప్రత్యామ్న్యాయం

నిర్మాణాత్మక ఉద్యమాలు చేపట్టాలి

ఎంసిపిఐ(యు) ముగింపు శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా వర్గ సామాజిక జమిలి పోరాటాలే ప్రత్యామ్నాయమని ఆ దిశలో ఉద్యమాలను నిర్మించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో
ఎంసిపిఐయు రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులకు ముగింపులో భాగంగా వర్గాలు వర్గ పోరాటాలు సామాజిక న్యాయం అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసంగిస్తూ సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని పార్టీ కార్యకర్తలు వర్గ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కూలి వర్గాలను కూడగట్టి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు.

కార్పొరేట్ శక్తులు పెట్టుబడుదారులు దోపిడిని విస్తృతం చేసి సంపదను పెంచుకుంటున్నారని వారికి అనుకూలంగా పాలకులు చట్టాలను మారుస్తున్నారని ఈ క్రమంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయి ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరలేని పరిస్థితికి దారితీస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో మార్క్సిజం చెప్పినట్లు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ నాయకత్వంలో శ్రామికులు ఐక్యం కాక తప్పదని అందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. కులం మతం ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ చెందాల్సిన సంపదను దోపిడీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్గ సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ వర్గ పోరాటాలను జయప్రదం కోరారు.

ఈ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పార్టీ కార్యక్రమం నిబంధనవళి భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు.ఈ శిక్షణ తరగతులకు వివిధ జిల్లాల నాయకత్వంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్ కుంభం సుకన్య ఎన్ రెడ్డి హంసారెడ్డి మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు గుండెబోయిన చంద్రయ్య తుడుం అనిల్ కుమార్ నర్ర ప్రతాప్ కర్ర రాజిరెడ్డి నీల రవీందర్ జబ్బర్ నాయక్ కంచ వెంకన్న కనకం సంధ్య గడ్డం నాగార్జున మాస్ సావిత్రి కర్ర దానయ్య మాలోత్ సాగర్ సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి వివిధ జిల్లాల కార్యదర్శులు డివిజన్ మండల కార్యదర్శి మహమ్మద్ రజాసాహెబ్ సింగతి మల్లికార్జున్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పాత మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీబాలాజి సెలబ్రేషన్ గృపు అద్యర్యము లో మంగళవారం రాత్రి 45 కుటుంబ సబ్యులు పాల్గొని భోగి మంటల కార్యక్రమంఘనంగా నిర్వహించామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ గ్రూపు మూడు సంవత్సరాల క్రింద 45 కుటుంబాలతో ఏర్పాటు చేసుకొని పండుగ సాంప్రదాయాలను కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో భోగి మండల కార్యక్రమం ఉగాది హోలీ వినాయక చవితి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గోకారం కృష్ణమూర్తి పోలిశెట్టి మురళి కటకం శ్రీధర్ కటకం పరమేష్ కలకొండ కిషోర్ సాయి నారాయణ గంధం రాజు నూకల వెంకటేశ్వర్లు సుధీర్ వెంకటేశ్వర్లు సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

వైభవంగా చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణ

వైభవంగా చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణ

ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో సంబరాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని కొప్పుల గ్రామంలో అంగరంగ వైభవంగా చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. విగ్రహ దాత వైనాల రాజు వారి స్నేహి తుల ఆధ్వర్యంలో మహోత్స వాలు ఘనంగా నిర్వహించారు భూమికోసం ముక్తి కోసం ఉద్య మం చేసిన వీర వనితను స్మరించుకుంటూ సేవలను గుర్తు చేసుకున్నారు.

ప్రత్యేక అతిథిగా విమలక్క మాట్లాడు తూ తెలంగాణ రైతాంగసాయు ధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో అమరనా మంగా నిలిచిన మహిళ నాయకురాలు మహి ళా శక్తిని చాటిన జన జాగృతి ధీరవనిత ఉత్పత్తి కులాలకు ఊపిరి ఊదిన పీడిత ప్రజల విముక్తికై పిడికిలి ఎత్తిన నిప్పు కనిక వీర నారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

వంగాల నారా యణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెగువను పోరాట పటిమను ప్రపంచానికి చాకలి ఐలమ్మ స్పందించు కుందాం వారు చూపిన బాటలో యువ త నడవాలి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం, చాకలి ఐలమ్మ అంద రికీ స్ఫూర్తి అని కొనియాడారు ఈ కార్యక్ర మంలో ముఖ్యఅ తిథిగా యాదగిరి తెలంగాణ విశ్వవి ద్యాలయం, ప్రత్యేక అతిధి విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి, మల్లేశం రవికుమార్ సీతారాములు వంగాల రామ- నారాయణరెడ్డి అలువాల రాజేందర్ ,శ్రీధర్, వైనాల రాజేందర్ (రాజు), పసునూటి రాజయ్య,కుల పెద్దలు అలువాలయాదగిరి, కొమురయ్య, కుమారస్వామి, శంకర్, రజక సంఘం అధ్య క్షులు మునుకుంట్ల రవి, కృష్ణమూర్తి,రజక యువసేన పైండ్ల మహేష్ కొమురాజు శ్రీకాంత్, బాసని సీతారాము లు, మామిడి అశోక్ , బగ్గి రమేష్, మంద నరేష్ ,అన్ని పార్టీల నాయ కులు, అన్ని కులాల సంఘ నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు

లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ…

లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి(11వ వార్డు)లో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద కుంట పల్లి గ్రామ వాసులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version