భూపాలపల్లిలో ఘనంగా పాపన్న వర్ధంతి వేడుకలు..

భూపాలపల్లిలో ఘనంగా పాపన్న వర్ధంతి వేడుకలు..

సీఐ నరేష్ కుమార్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో పయనించాలని సీఐ నరేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ లు మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, అయన గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. పీడిత జనుల కోసం, బహుజుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన పాపన్న గౌడ్ చేసిన సేవలు మనందరికి గర్వకారణమన్నారు. ప్రతి మండలకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు కూనూరి సురేష్ గౌడ్, బుర్ర సునిత గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర కుమారస్వామి గౌడ్, జగన్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, గైని ఎల్లా గౌడ్, నాగపూరి సమ్మయ్య గౌడ్, ఏరుకొండ గణపతి గౌడ్, విజేందర్ గౌడ్, ప్రకాష్ గౌడ్, చుక్క బాలరాజు గౌడ్, కోల తిరుపతి గౌడ్, కోల శ్రీనివాస్ గౌడ్, గడ్డం శేఖర్ గౌడ్, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు..

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను మంగళవారం తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొంది, ఇటీవలె చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం నేతలు వారికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు పదవులు దక్కడం అభినందనీయమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూనే, గౌడ సంఘం సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. భూపాలపల్లిలో గౌడ సంఘం కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం తో పాటు, గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, తడుక సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, నాగపురి సమ్మయ్య గౌడ్, గైని ఎల్లగౌడ్, సదానందం గౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గండి చిరంజీవి గౌడ్, కె.వి అశోక్ గౌడ్, చిర్రా అశోక్ గౌడ్, గట్టు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

గీత కార్మికుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

గీత కార్మికుడి కుటుంబానికి లక్ష రూ. ఆర్థిక సాయం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రానికి చెందిన గుర్రపు గట్టయ్య గత మూడు సంవత్సరాల క్రితం తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో అయినా* వెన్నుపూస బొక్క విరగడంతో మంచానికే* పరిమితమయ్యాడు రెక్క ఆడుతూనే డొక్కాడని పరిస్థితి గీత కార్మికులది*
దిక్కుతోచని స్థితిలో కుటుంబ ఉండగా ఆ కుటుంబానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో1,00,000 లక్ష రూపాయలు ప్రకటించి బుధవారం రోజున చిట్యాల గౌడ సొసైటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వరంలో లక్ష* రూపాయలు గీతా కార్మికుడు గుర్రపు గట్టాయకు డైరెక్టర్లతో కలిసి లక్ష రూపాయలు నగదు అందజేశారు,ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం ఈ ప్రభుత్వంలోని గీత కార్మికులకు సేఫ్టీమోకులు అందించడంజరుగుతుందన్నారు గట్టయ్య స్థితిగతులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకు* *ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు*ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పెరుమండ్ల రాజు. డైరెక్టర్లు రాజు. బుర్ర రాజు. నరేష్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version