డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై కమీషనర్ కు పిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T150608.575.wav?_=1

 

*డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు*

◆:- తుంకుంట – మోహన్

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

పంచాయతీలే పట్టుకొమ్మలు అనీ అందరు అనుకొంటారు. కానీ అవేవి ఈ అధికారులకు పట్టనట్టు వ్య వహరిస్తున్న తీరు పట్ల జిల్లా పంచాయతీ అధికారి మరియు జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు చేయడం జరిగింది.ఇటీవల పెన్ గన్ మరియు అనేక ప్రత్రికలలో వారిపైన వచ్చిన కథనాలను జోడిస్తూ పిర్యాదు చేయడం జరిగింది. అంతేకాక జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి పైన జిల్లా కలెక్టర్ కు వారిపై పిర్యాదు చేయడం జరిగింది.. అంతేకాక రాష్ట్ర ఎస్సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తమ్ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

Complaint to the Commissioner

 

జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు సైతం ఈ అధికారుల తీరు మార్చుకోవాలని ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల సస్పెండ్ అయినా ఒక బిసి కుల పంచాయతీ కార్యదర్శి కి తిరిగి కొన్ని రోజులకే పోస్టింగ్ ఇచ్చి దళిత జాతికి చెందిన పంచాయతీ కార్యదర్శి లు సస్పెండ్ అయి సంవత్సరమ్ గడిచిన నేటికీ వారికీ పోస్టింగ్ ఇవ్వడం లేదంటే ఈ అధికారులు ఎంత వివక్ష చూపితున్నారో అందరికి అర్ధం అవుతుంది.ఏ కారణం చేత అయినా సస్పెండ్ అయితే ఆరు నెలలకే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అనీ ఆదేశాల ఉన్నప్పటికీ ఈ అధికారులు పాటించకపోవడము అందరికి విస్మయానికి గురిచేస్తుంది.అంతేకాక దళిత పంచాయతీ కార్యదర్శులపైన ఎవరైనా పిర్యాదు చేస్తే ఈ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అనీ రిపోర్ట్ లు పంపుతున్నారు. అదే బీసి, ఇతర పంచాయతీ కార్యదర్శులపైన పిర్యాదు చేస్తే మాత్రం పట్టింపు చేయకుండా ఉంటున్నారు అనీ కమీషనర్ పిర్యాదు లో పేర్కొనడం జరిగిందనీ తెలిపారు.ఇటీవల తుంకుంట గ్రామంలో జరిగిన ఒక ఫారెస్ట్ భూమీ పంచాయతీ లో కూడా డివిజనల్ పంచాయతీ అధికారి అయినా అమృత దళితులపైన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనీ పిటిషనర్ లేఖ లో పేర్కొనడం జరిగింది.

Complaint to the Commissioner

 

దళితులకు రావాల్సిన భూమినీ రాకుండా తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చిన డి ఎల్ పీ ఓ మరియు డి పి ఓ పైన చర్యలు చేసుకొని మా తుంకుంట దళితులకు న్యాయం జరిగే వరుకు పోరాడుతనాని తెల్పడము జరిగింది.అంతేకాక జిల్లాలో దళితులపైన జరుగుతున్న వివక్షత పైన రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ కు కూడా పిర్యాదు చేస్తానాని దళితుల అభ్యునతి కొరకు పాటుపడుతనాని తెల్పడం జరిగింది.జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం లేక సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారానీ తెలిపారు. వెంటనే డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపైన ద్రుష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటట్లు చేయాలనీ పంచాయతీ రాజ్ కమీషనర్ కు తెల్పడం జరిగిందనీ తెలిపారు. ఇప్పటికైనా ఈ అధికారుల తీరు మారకుంటే ముఖ్యమంత్రి కి పిర్యాదు చేస్తానని తెల్పడం జరిగింది.

కమిషనర్ ను కలిసిన డిప్యూటీ కమిషనర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T145800.291-1.wav?_=2

కమిషనర్ ను కలిసిన డిప్యూటీ కమిషనర్…

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సమ్మయ్య.

నేటిధాత్రి, వరంగల్.

 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా నియమితులైన సమ్మయ్య శుక్రవారం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ను ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ డిప్యూటీ కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎవ్వరికీ నష్టం కలగకుండా అందరికీ న్యాయం.!

ఎవ్వరికీ నష్టం కలగకుండా అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం..

*కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి :

నగరంలోని గాంధీ రోడ్డులో గల హథీరాంజీ మఠంలో దుకాణాలు నిర్వహిస్తున్న ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. పురాతనమైన హథీరాంజీ భవనం కూల్చడం పై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, దుకాణ దారులతో కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. పలువురు దుకాణదారులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ మరమ్మత్తులు చేయించాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ హథీరాంజీ మతం ను ఐఐటి తిరుపతి కి చెందిన నిపుణులు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారుఈ భవనాన్ని 10 జోన్లుగా విభజించడం జరిగిందని అన్నారు. ఇందులో జోన్ 10 మరమ్మతులు చేయాలని, గాంధీ రోడ్డు వైపు,నార్త్ వెస్ట్ కార్నర్లు పడగొట్టి పునర్నిమాణం చేయాలని తెలిపారని అన్నారు.ఈ ప్రజాప్రతినిధులు, షాప్ యజమానులతో సమావేశం నిర్వహించామని అన్నారు. రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపడతాని అన్నారు. కూల్చివేసిన ప్రాంతంలో ఎవరి షాపులు వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధులు, దుకాణదారులు అభిప్రాయాలను, ఐ ఐ టి నిపుణుల నివేదిక కలెక్టర్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వూకా విజయకుమార్,డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహ ఆచారి, నరేంద్ర మఠం ఏ.డి.బాపిరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్, తహసీల్దార్ సురేంద్ర బాబు, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, సర్వేయర్లు కోటేశ్వర రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కోహీర్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ రావు..

కోహీర్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130329.595.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ పురపాలక సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఆరోగ్య కారణాలతో సుదీర్ఘ సేవలపై విరమించారు. ఈ నేపథ్యంలో జహీరాబాద్ కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ శనివారం ఉదయం కోహీర్ పురపాలక సంఘం కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను ఆకస్మికంగా తనిఖీ చేసిన. శ్రీ ఎస్ వి ప్రసాద్. జయింట్ రిజిస్టర్.ఆఫ్. కో-ఆపరేటివ్ సొసైటీ/.G.m.Haca. హైదరాబాద్ గారు. మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా సొసైటీ అధికారి. రామకృష్ణ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా. నేరెళ్ల. పాక్స్. చైర్మన్ కోడూరి. భాస్కర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన ఆఫీసర్లు. నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి రైతులకు అన్నివేళలా ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు సంఘాల ద్వారా. సేవలు అందించాలని ఆదేశించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో. అసిస్టెంట్ రిజిస్టర్. బి రమాదేవి. సంఘం కార్యదర్శి సిబ్బంది అంజయ్య రాజయ్య సాయి తదితరులు పాల్గొన్నారు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కమిషనర్ రాజలింగు.

Mandamarri Municipal Commissioner Rajalingu

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – కమిషనర్ రాజలింగు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-29.wav?_=4

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు అన్నారు. శుక్రవారం రోజు మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్ లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించడం, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న ఈ కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలి,” అని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వినూత్న శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

నూతన కమిషనర్ ను కాదిర్ పాషా మర్యాదపూర్వకంగా కలిసిన.

సిరిసిల్ల పట్టణ నూతన కమిషనర్ ను కాదిర్ పాషా మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల సంఘం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

ఈ రోజు సిరిసిల్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా రాజన్న సిరిసిల్ల జిల్లా మానవ హక్కుల సంఘం మరియు యాంటీ కరెప్షన్ జిల్లా ఛైర్మెన్ గజ్జె శివరాం మరియు గౌరవ సభ్యులు అందరూ మర్యాద పూర్వకంగా కలిసి,బొకే ఇచ్చి శాలువ తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మీ అసోసియేషన్ తరుపున మీరు చేసే కార్యక్రమాలలో తగిన సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మున్సిపల్ ను భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఛైర్మెన్ గుజ్జె శివరాం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వడం లో జాప్యం జరుగుతుంది కాబట్టి తక్షణంగా స్పందించి జాప్యం కాకుండా లబ్ధి దారులకు ఇసుక ను అందించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి పంజా బాలరాజు,ప్రధాన కార్యదర్శి రాచకొండ మహేశ్,గొల్లపెల్లి మహిపాల్,కొడం బాలకిషన్,సజ్జనం శ్యామ్ సుందర్,కడార్ల మురళీ,మిద్దె ప్రకాశ్,జింక శరత్, నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ అభినందనలు

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ అభినందనలు

◆ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ నియమితులైనందుకు స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అలీ అలీమ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ముహమ్మద్ కాలనీ ముహమ్మద్ సలీమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనను అభినందించారు మరియు జహీరాబాద్ కమిషనర్‌గా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మునిసిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ముహమ్మద్ సలీం సద్దాం హుస్సేన్ షేక్ ఖలీద్ పాషా అబూ యూసఫ్ రిజ్వాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సుభాష్ రావు దేశముఖ్.

బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సుభాష్ రావు దేశముఖ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ రావు దేశ్ముఖ్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపి ఆహ్వానించారు. అదేవి ధంగా వివిధ రాజకీయ, పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెల పడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, జహీరాబాద్ కు మళ్ళి కమిషనర్ గా రావడం ఎంతో శుభసూచకంగా ఉం దని, తమ వద్దకు మున్సిపల్ పట్టణ పరిధిలోని ఉన్నటువంటి ఆయా బస్తీల, వార్డులల్లో ఉన్నటువంటి ఆయా సమస్యలు తమ వద్దకు వచ్చినచో వాటిని పరిష్కారమయ్యేలా చూసే విధంగా అడుగులు వేస్తామని, అంతేకాకుండా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రబలకుండా చూస్తామని వారు తెలిపారు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన CITU నాయకులు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన సిఐటియు నాయకులు

శంకరపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

చేవెళ్ల నూతన మున్సిపల్ కమిషనర్ ని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నూతన కమిషనర్ ని కోరడం జరిగింది. కార్మికులకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తామని నూతన కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, సిఐటియు చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ముంజ గళ్ళ ప్రభుదాస్, చేవెళ్ల మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ జనార్ధన్ దస్తగిరి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్*

25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన…..

వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్…

వరంగల్, నేటిధాత్రి : 

 

shine junior college

శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కమిషనర్ తనఖి చేశారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్ లు సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం విధులకు హాజరై, వెళ్లేటప్పుడు నమోదు చేయాలని , అటెండెన్స్ నమోదులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుండి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కలియతిరిగిన కమిషనర్ స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్షిత చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ఇందుకు సంబంధించిన స్టిక్కర్ ను గృహాలకు అతికించి నిర్వహించిన స్వచ్చ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డి ఆర్ సి సి సెంటర్ తో పాటు నర్సరీనీ పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించిన కమిషనర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సి పి లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్ వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్ రావు ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఏ సి పి ఖలీల్ సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ ఏ ఈ లు మొజామిల్ హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం.

పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం.

మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు.

మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు.

ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో కొంత ఇస్తే కానీ వదిలి పెట్టరు.

కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాలకు “మేయర్ ప్రత్యేక అనుమతి” ఉంటేనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనులు?

కమీషనర్ లు వస్తున్నారు, పోతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలో బాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కరీంనగర్ నుండి బదిలీపై వచ్చి, శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ చాహాత్ బాజ్ పేయి. నూతన కమిషనర్ కి బల్దియాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. కమీషనర్ లు మారుతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

పెరుగుతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు

నగర ప్రజలు వారి సమస్యల పట్ల గ్రీవెన్స్ లో దరఖాస్తులు ఇస్తున్నారు, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు అలసత్వం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు నగర ప్రజలు.

“మున్సిపాలిటీ ముద్దులాట” లకు నోటీసులు?

ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న ఇద్దరు ఉద్యోగులకు “సిడిఎంఏ” నుండి నోటీసులు అందినట్లు సమాచారం. వారిపై వారం రోజులు గడిచిన ఎలాంటి చర్యలు లేవని, ఇద్దరిని వేర్వేరు కార్యాలయాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. తాము చేసిన తప్పుకు కొంచెం కూడా పశ్చాతాప్తం లేని “సదరు ఉద్యోగులు”? పైగా తాము చేసింది తప్పు కాదు అంటూ, తప్పును కప్పి పెడుతూ, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని రాజకీయ నాయకుల లాగా ఆరోపణలు చేయడం. మున్సిపల్ కార్యాలయంలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడానికి అదేం పార్క్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు. పబ్లిక్ కార్యాలయం అనేది గుర్తు పెట్టుకోవాలి సదరు ఉద్యోగులు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంది వీళ్ళ ప్రవర్తన. కొన్ని రోజులుగా వీళ్లు కార్యాలయంలో చేసే పనులు చూసి, విసిగి వేసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మారని తీరు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా లాగా మున్సిపల్ ఆఫీసులో “అన్నాచెల్లెళ్ల” బంధానికి కొత్త అర్థం చెబుతున్న కొందరు ఉద్యోగులు. గత శని, ఆదివారాలు సెలవు రోజులు లేకుంటే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రేమ జంటలపై ప్రత్యేక డిబేట్లు కూడా ఉండేవేమో. మీకేమి కాదు మేమున్నాం అంటూ ఓ అధికారి, కొందరు రిపోర్టర్లు అభయ హస్తం ఇచ్చినట్లు వినికిడి? నూతన కమిషనర్ ఈ అంశంపై చర్యలు తీసుకుంటారా లేదా అని కొందరు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేది తోటి ఉద్యోగుల వాదన.

థంబ్ ఎప్పుడైనా వేస్తాం మా ఇష్టం

 

 

New Municipal Commissioner.

 

 

 

 

మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 8 గంటల తరువాత స్టైల్ గా నిక్కర్ టీ షర్ట్ వేసుకుని రావడం మున్సిపల్ కార్యాలయంలో థంబ్ వేసి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అసలు ఎవరు వీళ్లు ఎక్కడ పని చేస్తున్నారు రాత్రి వేళ వచ్చి థంబ్ వేయడం ఏంటి.
మరి కొందరు మహిళా ఉద్యోగులు ఏకంగా కారులో వచ్చి, దర్జాగా సాయంత్రం 7 తరువాత థంబ్ వేయడం.
వీళ్లు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసే నాథుడే లేడు. పట్టించుకునే అధికారి పర్వాలేదు అంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి వృతి రీత్యా ఉదయాన్నే ప్రధాన కార్యాలయంకు వచ్చి హాజరు వేసి, కొందరు బయటకు వెళ్లి నగరంలో పనిచేస్తూ, సాయంత్రం ఆరు గంటల లోపు ఆఫీసుకు వచ్చి హాజరు వేసి ఇంటికి వెళ్ళడం మనం సామాన్యంగా చూస్తాం.. కానీ ఇక్కడ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం సహజం. సాయంత్రం వేళ థంబ్ వేయడానికి రాత్రి పది గంటలకు మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వేయడం జరుగుతుంది అదేందో మరి అర్థం కావడం లేదు అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుకున్న కానీ వీరు మాత్రం పని చేస్తున్నారో లేదో తెలియదు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపాలిటీ ఉద్యోగులు థంబ్ వేయడంపై దృష్టి సారించాలని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి కబ్జా?

మున్సిపల్ ప్రధాన కార్యాలయం గేటు ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించుకొని పనులు చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాన్ని ఎవరు లీజుకు ఇచ్చారు ఎన్ని యేండ్ల పాటు ఇచ్చారు? అనేది అధికారులకే తెలియాలి. ప్రధాన కార్యాలయం గేట్ ముందు వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన వాటిని గేట్ ముందే పెట్టడం, రోడ్డు మీద పనులు చేస్తూ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆగం ఆగం చేస్తున్న పట్టించుకొని అధికారులు.

బల్దియాలో సమస్యలు అనేకం. వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ. నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

 

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. చాహాత్ బాజ్ పేయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన కమీషనర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కు కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం నర్సయ్య

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

ఈరోజు ఇటీవల తెలంగాణ నూతన సమాచార కమీషనర్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు పి.వి. శ్రీనివాస్ ని హైదరాబాద్ లోని వారి కార్యాలయములో టీ.పి.సి.సి మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన.!

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఏనుమాముల, నేటిధాత్రి
https://youtu.be/GCpLX43wfVs?si=qoAdJYysMaLnnAWn
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ మంగళవారం మామూనూర్ డివిజన్‌ పరిధిలోని ఏనుమాముల  పోలీస్‌ స్టేషన్ను సందర్శించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా  బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాఘవేందర్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. 
Commissioner
స్టేషన్‌ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారిగా ఎస్‌.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్‌ ఎస్‌.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు  స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్‌ అధికారి తప్పనిసరిగా రౌడీ  షీటర్ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్‌ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్‌ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని.
Commissioner
ట్రైసిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని. నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు సూచించారు.
పోలీస్‌ కమిషనర్‌ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసిపి తిరుపతి ఇన్స్‌స్పెక్టర్ రాఘవేందర్,  స్టేషన్‌ ఎస్‌.ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం.

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మునిసిపాలిటీలో కమిషనర్ గా పదోన్నతి పొందిన నాగరాజు,పట్టణ సీఐ రఘుపతి రెడ్డిలకు బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానం చేశారు. నర్సంపేట మున్సిపాలిటిలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మున్సిపాలిటీ కమీషనర్ గా ఇటీవల పదోన్నతి పొందడంతో తన కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లో చేరిన టౌన్ సీఐ రఘపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఘనంగా సన్మానించారు.

CI Raghupathi Reddy.

 

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మోకుదెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్,బీసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం, పట్టణ అధ్యక్షులు గండు రవి గౌడ్, ఉపాధ్యక్షులు చీర వెంకట్ నారాయణ, యువజన నాయకులు బైరి నాగరాజు,రామగోని శ్రీనివాస్ గౌడ్,జామళాపురం అశోక్,పుల్లూరి కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం. 

దమ్మాయిగూడ నేటి ధాత్రి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే చేర్యా తీసుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగారం మాజీ చైర్మెన్ కౌకుట్ల చెంద్రారెడ్డి,( బి ఎం ఎస్ ) నాయకులు రాము, మోర నాగమల్లా రెడ్డి, సామల భరత్ రెడ్డి , డొంకెన రవీందర్ గౌడ్, రామిడి బాపి రెడ్డి, మహిళా మోర్చా మునిసిపల్ అధ్యక్షురాలు రోత్తమ్ ప్రశాంతి, దాసరి సరెండర్ రెడ్డి, దసారం సతీష్ కుమార్, కే కుమార్, జరిపిటి ఆంజనేయులు, తడుక కృష్ణ, సాయికృష్ణ చారీ, చక్రపాణి, ర్ సురేష్, మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్.

జమ్మికుంట మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్ ఎండి ఆయాజ్
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రాపర్టీ టాక్స్ 100% వసూల్ చేశారని రాష్ట్రస్థాయిలో 139 మున్సిపాలిటీల కంటే ముందంజలో జమ్మికుంట మున్సిపాలిటీ ఉందని కమిషనర్ ఎండి ఆజాద్ కూ ప్రశంస పత్రాన్ని అందజేశారు ఇట్టి ప్రశంసా పత్రం నాకు రావడానికిఇట్టి నా తోటి ఉద్యోగస్తులే కారణమని ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా సిద్దూరి సంపత్ రావు,కడెం ఉపేందర్, మొగిలి అలియాస్ (గోవిందా) ప్రవీణ్ రెడ్డి ఈ నలుగురు నాలుగు పిల్లర్లు లాగా నిలబడి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి సపోర్ట్ గా నిలబడి ఈ వసూల్ కార్యక్రమంలో వారి వంతు వారు కృషి చేశారని ప్రశంసించి అందులో భాగంగా సిద్దూరి సంపత్ రావును బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద ప్రశంస పత్రాన్ని అందజేస్తూ శాలువాతో సన్మానించారు తోటి ఉద్యోగస్తులు అందరికీ కూడా అభినందనలు  తెలిపారు

స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20:

నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు.

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 05:

తిరుపతి లోని అక్కరంపల్లి ప్రజా సమస్య లపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య స్పందించారు. బుధవారం ఉదయం అక్కరంపల్లిని స్వయంగా సందర్శించిన కమిషనర్ కు ప్రజలు గోకులం అపార్ట్ మెంట్ పక్కన మురికి నీటి నిల్వను, మట్టి రోడ్ల దుస్థితిని, విపరీతమైన దోమల బాధను, దుర్వాసనను, మురికి నీటి కాల్వల దుస్థితిని వివరించారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంటనే స్పందించి మురికి నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన కమిషనర్ కు అకారంపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం

పరకాల నేటిధాత్రి
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనేక నిర్మాణాలు అనుమతులు లేకుండానే పట్టణ పరిధిలో కొనసాగుతున్నాయన్నారు.నూతన భవన నిర్మాణాల పట్ల తక్షణమే విచారణ జరిపించి భవిష్యత్ కాలంలో ఇబ్బందులకు దారి కాకుండా వెంటనే విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హేమంత్,ఈశ్వర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version