వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ సోమవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ మాధవి రమేష్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రాం మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత మార్కెట్ యార్డులో ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఖాళీ స్థలం ఉన్నదని స్థలంలో నిర్మాణం చేయుటకు ప్రభుత్వంచే నిధులు ఇప్పించుటకు కృషి చేయాలని నూతన చైర్మన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ధైర్యంగా ఏ ఎన్నికలు వచ్చినా పోటీలోఉండాలని పిలుపునిచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనందుకు మాధవి రమేష్ ని అభినందించారు . వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్యు మహిళ మాధవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజు అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి మారం బాలేశ్వర శెట్టి సంబు వెంకటేశ్వర్లు ఏపూరి శ్రీనివాసులు కోట్రరామకృష్ణ చవ్వపండరయ్య తాడిపర్తి శేషయ్య కటకం సుధాకర్ నరహరి నరేష్ శ్రీరాములు కె బి శ్రీనివాసులు పూరి పాండు కండే జ్యోతిబాబు మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్…

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్

,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో ​చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు…

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

, సీప్-2024 సర్వే ఆధారంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు వార్డులలో రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నారు . రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి జాబితా ప్రతులను కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version