మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..

 మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

 

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని Post) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. అయితే, ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు ‌ వినియోగించుకున్నారు ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. ఈ క్రమంలో తలారి గౌతమికి టీడీపీ హై కమాండ్ శుభాకాంక్షలు తెలిపింది.

కాగా, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ(గురువారం) జరిగింది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా… వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది.మరోవైపు.. రామగిరి ఎంపీపీ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది రామగిరి ఎంపీపీ ఎన్నిక. నాలుగోసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక ఈరోజు (గురువారం) జరగనుంది. ఇప్పటికే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మూడుసార్లు కోరం లేక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది . గురువారం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరగనుండటంతో హాట్‌టాపిక్‌గా మారింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version