మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని Post) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. అయితే, ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. ఈ క్రమంలో తలారి గౌతమికి టీడీపీ హై కమాండ్ శుభాకాంక్షలు తెలిపింది.
