విలీన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం*
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలో విలీనమైన నాగుర్లపల్లి, పర్శునాయక్ తండా 16వ వార్డును మున్సిపల్ యంత్రాంగంతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్‌తో కలిసి గ్రామంలోని డంపింగ్ యార్డ్, బతుకమ్మ ఆడుట స్థలం, పల్లె దవాఖాన, మట్టి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు.విలీన గ్రామ ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్యంపై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.పార్టీలకతీతంగా ఎలాంటి బేషజాలం లేకుండా 16వ వార్డు అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంజూరు చేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్యులు మేఘ్య నాయక్, శంకర్ నాయక్, క్రాంతి కుమార్, కొర్ర రాహుల్, కొర్ర రాజన్న తదితరులు పాల్గొన్నారు.
