వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్..

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్
​వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్
వైస్ చైర్మన్ మధు గౌడ్ కౌన్సిలర్ B.రమాదేవి ని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడిదొడ్డి మాధవి రమేష్ కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు ఈమేరకు మాధవి రమేష్ ను గెలిపించి నందుకు 33 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు
​వనపర్తి పట్టణంలోని పలు ప్రజా సమస్యల గురించి చైర్మన్ తో చర్చించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
​ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష. మాట్లాడుతూ
వనపర్తి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం కృషి చేయాలి మిగిలి న రోడ్ల విస్తరణ. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన సమితి సహకారాన్ని అందిస్తుందిఅని ఆయన పేర్కొన్నారు.
​ స్పందించిన చైర్మన్ మిడి దొడ్డి మాధవి రమేష్ , పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న, మెూచి సంఘం జిల్లా ప్రెసిడెంట్ అయింధ్యాల శంకర్ బాబు రతన్ నాయక్ బాలకృష్ణ ఆర్యవైశ్య డు బండల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version