జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట,( నేటి ధాత్రి )

బుధవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ , వైస్ చైర్మన్ జావీద్, లు 3వ మరియు 4వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి, రోడ్లు మరియు మురుగు కాలువల (మోరీ)ల సమస్యలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను బుధవారం నాడు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అజయ్, 3వ వార్డు కౌన్సిలర్ రాజు, 20వ వార్డు పరశురాంలతోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటునని మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు

జమ్మికుంట ప్రతినిధి( నేటి ధాత్రి)

 

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు కూడా అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల అభివృద్ధికి పునాది వంటివని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు చైర్మన్ ఈ పర్యటనను అభినందిస్తూ చిన్నారుల సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు…

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం…

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం పట్టణ ప్రజల అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రమాణస్వీకారం అనంతరం నూతన పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలిశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ (జావేద్) , కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్ కలిసి కేటీఆర్ ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంట పట్టణంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ నాయకత్వం మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు

7వ వార్డులో యేబూషి ఆర్యన్ కౌషిక్‌కు పెరుగుతున్న మద్దతు

జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యేబూషి ఆర్యన్ కౌషిక్:-

జమ్మికుంట, నేటిధాత్రి:-

జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ కు ప్రజలు గణనీయంగా మద్దతు తెలుపుతున్నారు.
ఇంతకు ముందు తన తండ్రి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ప్రజల మద్య ఉండి ప్రజలకు సేవ చెయ్యాలనే తపనను గుర్తించి తన తండ్రి మాజీ ఎంపీపీ కీ.శ. యేబూషి రామస్వామి ఆశయాలను కొనసాగించాలని తండ్రి బాటలో నే నడుస్తూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

గత కొంతకాలంగా వార్డులోని సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేస్తున్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధత, యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన స్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శుభ్రత వంటి సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

వార్డు అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి న్యాయం చేకూరాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఈ యువ నాయకుడికి ప్రజలంతా తమ అమూల్యమైన మద్దతు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మార్పు కావాలంటే, సేవాభావం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వరద కలలువలు నిర్మించాలని బిజెపి పార్టీ

వరద కలలువలు నిర్మించాలని
బిజెపి పార్టీ అభ్యర్థులు జమ్మికుంట మున్సిపాలిటీ ముట్టడి

జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ రామన్న పల్లె కృష్ణ కాలనీలలో వర్షాకాలం వచ్చిందంటే వరద వరద నీరు గతంలో ఇళ్లల్లో కూడా వచ్చినవి ఇట్టి సమస్యను పరిష్కరించాలని జమ్మికుంట కమిషనర్ కు వినతి పత్రం కూడా అందజేసిన కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు కాలువ నిర్మాణాలు కూడా జరగలేదు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలిచి అటువంటి సమయంలో నేను గెలిచిన తర్వాత ఈ కాలువ నిర్మాణాలు ఈ వరద నీరు రాకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా చేస్తానని వాగ్దానం చేశాడు కానీ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు అలాగే కమిషనర్ ఇంటి పన్నుల వసూలులో ప్రశంస పత్రం అందుకున్నప్పుడు మూడు కోట్ల నిధులు మున్సిపాలిటీ వచ్చినయ్ అట్టి నిధుల నుండి ఇట్టి నిర్మాణం చేస్తామని కూడా తెలిపారు కానీ ఎలాంటి అనుమతులు నిర్మాణానికి ఎవరికి ఇవ్వలేదు కనుక బిజెపి పార్టీ జమ్మికుంట మండల పట్టణ అధ్యక్షులు రాజు విమర్శించారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో వరద బాధితులు అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు నాయకులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేశం,రమారెడ్డి,కోరే రవి,అప్ప మధు,బస్సు శివకుమార్,మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version