గణపురం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామికి ఉత్తమ ఎమ్మార్వో అవార్డు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ కారే,జడ్పీ సీఈవో విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురం ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామి ఉత్తమ అవార్డు అందుకున్నారు.
Best EMRO and MPDO Awards in Ganapuram
అదేవిధంగా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఎల్ భాస్కర్ ఉత్తమ ఎంపీడీవో అవార్డును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే జెడ్పిసిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురంలోవిధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఉత్తమ అవార్డు అందుకున్నారు.
నాపాక ఆలయం లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.
చిట్యాల,నేటిధాత్రి .
చిట్యాల మండలం నైన్ పాక గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ వేషాధారణలతో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రామ కృష్ణ పరమ హంస మందిరం నుండి బస్టాండ్ వద్ద శ్రీ కృష్ణ విగ్రహం దగ్గరికి ఊరేగింపు నిర్వహించి డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుపుకొని శ్రీ శ్రీ శ్రీ నాపాక లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి శ్రీ కృష్ణునికి పళాభి షేకం చేసి చిన్నారుల చేతుల మీదుగా ఉట్టి కొట్టి ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ జన్మదిన సంధర్బంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసారుఅనంతరం ఉట్టి కొట్టిన చిన్నారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు నాపక ఆలయ ప్రాంగణంలో నైన్ పాక గ్రామ పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ యాదవ సంఘం నాయకులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు
`సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానాలలో 90 శాతం బిసిలకే
`మహిళా రిజర్వేషన్లీ బిసి మహిళలకే
`పార్టీ ప్రకటన జరిగిన వెంటనే కవిత పాదయాత్ర
`రెండు సంవత్సరాల పాటు సాగనున్న పాదయాత్ర
`పాదయాత్రలోనే పార్టీ కమిటీల ప్రకటన
`పెద్ద ఎత్తున యువత సహకారంతో కవిత పార్టీకి ఉత్తేజం
`అన్ని వర్గాల యువతకు పార్టీలో ప్రాధాన్యం
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ కెరటం దూసుకువస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కొత్త పార్టీ త్వరలో పెట్టబోతున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ అంతా చకచకా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే కవిత పార్టీ వచ్చేస్తోంది. తెలంగాణ జన జాగృతి కోసం ఆమె కంకణం కట్టుకున్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. కవిత తెలంగాణలో బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలవాలనుకుంటున్నారు. ఇందిరాగాంధీ లాగా తన పేరు చిరస్ధాయిగా నిలిచిపోయేలా తన రాజకీయ జీవితం వుండాలని, తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి జరగే వరకు విశ్రమించేది లేదని నిర్ణయించుకున్నారు. అందుకే వచ్చే దసరా పండున వేడుకను పార్టీ పండుగ చేయాలని చూస్తున్నారు. బలమైన ముహూర్తం దొరికింది. పార్టీ ఏర్పాటుకు రంగమంతా సిద్దమైంది. జెండా, ఎజెండాలు కూడా రూపకల్పనలు జరిగాయి. పార్టీ ప్రకటనే తరువాయి. పార్టీకి చెందినటు వంటి అన్ని కమిటీలు కూడా చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ముందుగా జిల్లా స్ధాయి నియామాకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. పాత, కొత్త తరం కలయితో, నూతన తరం, యువతరంతో కలిసి పార్టీ నిర్మాణం జరగనున్నది. ముఖ్యంగా బిసిలతోనే పార్టీ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు. అన్ని స్ధాయిలలో బిసిలకే పెద్ద పీట వేస్తూ కమిటీల ప్రకటనలు చేస్తున్నారు. వాటిని నిశితంగా చూస్తే మెజార్టీ కమిటీలో మెజార్టీ పదవులు బిసిలకే కేటాయిస్తున్నారు. సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంలో భాగంగానే కమిటీ నిర్మాణం జోరుగా సాగుతోంది. తాజాగా ఆమె కొన్ని రోజులు అమెరికా పర్యటన చేస్తున్నారు. తన చిన్న కొడుకును అమెరికాలో ఉన్నత చదువులకు కోసం తీసుకెళ్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరింత స్పీడ్‌గా పార్టీ నిర్మాణపనులు చూసుకోనున్నారు. పిల్లలు అమెరికాలో వెళ్లడంతో ఇక ఆమె పూర్తి స్ధాయి సమయం పార్టీ కోసమే కేటాయించాలన్న ఆలోచనతో వున్నారు. బిసిలకు రాజ్యాధికారం అనేది సాదించి చూపించాలని అనుకుంటున్నారు. కట్టెల మోపు ఎంత పెద్దదైనా సరే వాటికి తాడు లేకుండా మోపు కట్టలేము. ఇక్కడ అదే ఫార్ములాను ఆమె అనుసరిస్తున్నారు. బిసిలను ఏకం చేయడం బిసిల వల్ల సాద్యం కావడం లేదు. అదే జరిగేదివుంటే ఎప్పుడో బిసిలకు రాజ్యాధికారం వచ్చేది. ముందు బిసిల ఐక్యతను సాధించే పని కవిత చేస్తున్నారు. గ్రామస్ధాయి నుంచి బిసిల నాయకత్వం బలపడాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ వ్యూహం ఎవరూ చేపట్టలేదు. రాజకీయంగా ముందుకు వెళ్లలేదు. అందుకే కవిత కొత్త తరహా రాజకీయం పరిచయం చేయనున్నది. అటు సామాజిక తెలంగాణ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కవిత పార్టీ పెట్టనున్నది. మొత్తంగా బిసిలకు రాజ్యాదికారం అనే ఆలోచనలను నిజం చేయాలనుకుంటున్నది. కేసిఆర్ తెలంగాణ కల నెరవేర్చారు. కవిత సామాజిక తెలంగాణ నిజరూప ఆవిష్కరణ చేయనున్నారు. గ్రామ స్ధాయి నుంచి బడుగుల నాయకత్వం బపడితేనే రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్దాయికి చేరుకుంటుందని కవిత బలంగా నమ్ముతున్నారు. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలావుంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టేలా వుంటుంది. సామాజిక తెలంగాణస్ధాపన జరిగేలా వుంటుంది. బిసిలకు మొత్తం జనరల్ కేటగిరీ సీట్లలో 90శాతం అమలు చేసేలా ప్రణాళికులు రూపొందిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లలో కూడా బిసిలకు పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. కవిత పార్టీ ప్రకటన తర్వాత రెండు సంవత్సరాల పాటు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపటనున్నారు. అటు పాదయాత్ర, ఇటు కమిటీల ప్రకటనలతో తెలంగాణలో రాజకీయ భూకంపం తెస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా బిఆర్‌ఎస్‌తో అనవసరమైన పేచీ వద్దనకుంటున్నారు. తానే ఓ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు బిఆర్‌ఎస్ రాజకీయాల్లో రాద్దాంతం సృష్టించడం వల్ల , లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముందని అర్దం చేసుకున్నట్లున్నారు. ఇంకా ఆలస్యం చేయడం వల్ల అనేక రకాల రాజకీయ విమర్శలు ఎదుర్కొనే అవకాశం వుంటుంది. తన దారి తాను చూసుకొని, తన సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కవిత సంకల్పించింది. బిఆర్‌ఎస్‌లో వుంటూ సామాజిక తెలంగాణ నినాదం చేయడం వల్ల ఆ పార్టీకి కూడా కొంత నష్టం జరగొచ్చు. ప్రజలు కూడా నమ్మకపోవచ్చు. ఇప్పటికే పదేళ్లు కవిత ఏం చేసినట్లు అనే ప్రశ్నలు కూడా రాజకీయ పార్టీలు,సామాజిక సంస్ధల నుంచి వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు పుల్‌స్టాప్ పెట్టాలంటే సొంత పార్టీ ఏర్పాటే సమాధానమౌతుంది. బిఆర్‌ఎస్‌లో నా మాట చెల్లుబాటు కావాలని ఏమీ లేదు. ఎందుకంటే అందులో అన్ని రకాల వాదనలు, వర్గాలు వున్నాయి. కాని కవిత పెట్టే పార్టీలో ఏకైక ఎజెండాగా సామాజిక తెలంగాణ నిర్మాణం అనేది వుంటుంది. అప్పుడు కవిత విమర్శలకు దూరమౌతుంది. తానే ఇతర పార్టీలను ప్రశ్నించే అవకాశం దొరుకుతుంది. అందుకే విజయదశమి నాడు పార్టీ ప్రకటన చేయాలని చూస్తున్నారు. విజయదశమి చెడు మీద విజయానికి చిహ్నం. పైగా రాక్షసుడైన మహిషాసురుడిని అంతం చేసిన సందర్భం. దుర్గగా ప్రజలను కాపాడిన దేవతగా విజయ దశమి జరుపుకునే సందర్భం. ఆ సమయంలో రాక్షస రాజకీయాలను అంతం చేయాలనే లక్ష్యంతో ఆమె దసరా పండుగ నాడు పార్టీని ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె బిఆర్‌ఎస్ ఎంత నాదని చెప్పుకుంటున్నా, ఆమెది కాదని తేటతెల్లమౌతూనే వుంది. పైగా బిఆర్‌ఎస్ నాయకులను ఆమె టార్గెట్ చేస్తున్న విధానంలోనే అర్ధమౌతుంది. ఇటీవల కొందరు సీనియర్ నాయకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు బిఆర్‌ఎస్‌కు ఆమెను చాలా దూరం చేసినట్లే లెక్క. కవిత అమెరికా వెళ్లడం, ఆ సమయంలో ఆమె రాసిన లేఖ లీక్ కావడమే కవితను దూరం చేయడానికి బీజం పడిరదని చెప్పుకోవచ్చు. బిఆర్‌ఎస్ రజతోత్సవాలలో ఆమెకు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. అంటే పార్టీ పెద్దలే ఆమెను దూరం పెడుతున్నట్లు సంకేతాలు పంపినట్లైంది. ఈ విషయం కవితకు తెలియంది కాదు. అయినా సర్ధుకుపోవాలనే ఆమె చూసింది. కాని అడుగడుగునా ఆమెను రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీలకన్నా,సొంత పార్టీనేతలే వ్యవహించడం జరుగుతోంది. ఇలా తాను, తన అనుచరులు ఇబ్బందులు ఎదుర్కొవడం కన్నా, దూరం కావడమే మేలని అర్దం చేసుకున్నారు. పార్టీని నడిపే శక్తి యుక్తులు ఆమెకు పుష్కలంగా వున్నాయి. ఎందుకంటే ఒక దశంలో బిఆర్‌ఎస్‌కు సమాంతరంగా జాగృతిని నడిపిన అనుభవం ఆమెకు వుంది. ఇప్పుడు పార్టీ పెట్టినా నడిపించే శక్తి ఆమెకు వుంది. అందుకే ఒక మహిళలా తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక స్ధానం వుండాలని, ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం సొంత పార్టీ వల్లనే దక్కుతుందని తెలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనుకు తాను ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే తప్ప నిలబడలేనని కవిత గుర్తించినట్లున్నారు. పార్టీ కోసం త్యాగం చేసుకుంటూ పోతే రాజకీయంగా వెనుకబడిపోయే ప్రమాదాన్ని ఆమె గమనించారు. తనకు తన సొంతపార్టీలో అడుగుడునా ఎదురౌతున్న అవమానాలు దిగమింగుకుంటూ వుండడం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇష్టం లేదు. అందుకే ఆమె దూకుడు పెంచింది. నిజం చెప్పాలంటే ఆమె 2014కు ముందు బిఆర్‌ఎస్ నాయకురాలు కాదు. కార్యకర్త అసలే కాదు. అలా తన సొంత బలాన్ని, బలగాన్ని నమ్ముకొని ఆది నుంచి తనకంటూ ఒక ఇమేజ్‌ను బిల్డప్ చేసుకన్న నాయకురాలు కవిత. తండ్రి చాటున బిడ్డే అయినా కేసిఆర్ రాజకీయంలో ఓనమాలు నేర్చుకోలేదు. కొన్ని లక్షల మంది తెలంగాణ వాదులలో ఆమె ఒకరుగా నిలబడ్డారు. చెట్టు పేరు చెప్పుకొని ఆయన ఎప్పుడూ రాజకీయం చేయలేదు. తనను కేసిఆర్ కూతురుగా గుర్తింపు కన్నా, జాగృతి కవితగానే గుర్తించాలని కోరుకున్నారు. తెలంగాణ బతుకమ్మ అంటే కవిత అనేంతగా ఆమె తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారు. కేసిఆర్ నీడలో ఆమె రాజకీయాలు చేయాలనుకోలేదు. తెలంగాణ ఉద్యమానికి ఆమె చేసిన సేవను గుర్తించి, 2014లో బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది ఇతర పార్టీల నుంచి చేరారు. కాని కవిత తెలంగాణ వచ్చే వరకు ఆమె ఏ పార్టీకి చెందిన నాయకురాలు కాదు. స్వతంత్ర బావాలున్న నాయకురాలు. అందుకే కేసిఆర్ కూతురైనా సరే ఆమె పార్టీ పేరు ఏనాడు చెప్పుకోలేదు. ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్ కండువా ఎక్కడా కప్పుకోలేదు. కేసిఆర్ జేఏసి ఏర్పాటు చేసిన తర్వాత ఆమె జేఏసి కండువాతో ఉద్యమం చేశారే గాని, బిఆర్‌ఎస్ కండువాతో రాజకీయం చేయలేదు. తెలంగాణలోని బడుగుల రాజ్యాధికారం కోసం మరోసారి రాజకీయ, సామాజిక బాద్యతను ఎత్తుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం రోజున అఖిల భారత యాదవ సంఘం మరియు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును కొందరు భక్తులు కృష్ణాష్టమి అని మరికొందరు గోకులాష్టమని, అష్టమి అని పిలుస్తారు, కృష్ణాష్టమి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను వివిధ ఆచారాలతో సంప్రదాయాలతో జరుపుకుంటారు, మండల కేంద్రం లోనీ గుల్లలో భక్తులు ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించి భవద్గీత సారాంశాన్ని భక్తులకు, ప్రజలకు పురోహితులు తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం నాయకులు వీధులలో ఉట్లు కొట్టడం, పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు కృష్ణుడు, గోపిక వేషధారణలు వేసి నృత్యాలను చేపించారు. కార్యక్రమంలోసందన వేన మహేందర్ నాథ్ యాదవ్ చల్ల ఓదెలు కన్నెబోయిన ఐలయ్య పరిషబోయిన నగేష్ యాదవ్ కాట్రేవుల నవీన్ పిడుగు బాపు సిద్ధిశంకర్ మరియు కుల సంఘాల నాయకులు పెద్దలు హాజరు కావడం జరిగింది
ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పాలన కొనసాగించడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ఎంసిపిఐ(యు) ఖిలా వరంగల్ ఏరియా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్లెల రాజేందర్ అధ్యక్షతన తూర్పుకోటలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగంకలిగించే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ పాలకులకు వంతపాడిన ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను పొగడటం మోడీ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం ఎద్దేవా చేశారు.ట్రంపు విధానాలకు అండగా నిలబడుతూ దేశ ప్రజలపై 50 శాతం సుంకాలు విధించిన కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో రోజురోజుకు ఆకలి నిరుద్యోగం, దారిద్రం ఆత్మహత్యలు పెరుగుతున్న అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం, కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనైనా అమలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రం ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై 65 లక్షల మంది ఓటర్లను తొలగించి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నిందని ప్రతిపక్షాల పోరాటాలతో సుప్రీంకోర్టు సైతం మొట్టికాయ వేయడం మోడీ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వరంగల్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించి గత ప్రభుత్వ దారిలోనే పయనిస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రజా ఉద్యమాలే ఏకైక ప్రత్యామ్నాయమని ఆ దిశలో పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఎంసిపిఐ(యు)లో చేరిన రచయిత దర్శకుడు చిర్ర రాజేష్ ఖన్నా
వరంగల్ నగరంలోని 35వ డివిజన్ కు చెందిన రచయిత దర్శకుడు చిర్ర రాజేష్ ఖన్నా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ సమక్షంలో ఎంసిపిఐ(యు) చేరారని పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ తెలిపారు. అలాగే ఖిలా వరంగల్ ఏరియా కార్యదర్శిగా చుంచు జగదీశ్వర్ సహాయ కార్యదర్శి రాజేష్ ఖన్నా, ఏరియా కమిటీ సభ్యులుగా నల్లెల రాజేందర్, రాయినేని ఐలయ్య, నలివెల రవి ,ఇట్టినేని మధు, కొమ్ము లావణ్య ఎన్నికైనట్లు తెలిపారు. ఈ ఏరియా పరిధిలోని 34, 35 ,36,37, 38 డివిజన్లోని సమస్యలపై సర్వే నిర్వహించి పోరాటాల నిర్వహించాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు యగ్గేని మల్లికార్జున్, ఐతం నాగేష్,నగర నాయకులు బాబు రామస్వామి, నరహరి, బంగారి రామ స్వామి తదితరులు పాల్గొన్నారు.
`పదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ బిఆర్‌ఎస్ అమలు చేయలేదు.
`వందరోజుల్లో అన్నీ పూర్తి అని చెప్పిన కాంగ్రెస్‌ది అదే దారి!
`ఒక్క ఛాన్స్ మాకు అని బిజేపి అడిగినా లాభం లేకపోవచ్చు!
`కేంద్రం నుంచి నిధుల గురించి జనానికి తెలియదనుకోకండి.
`ప్రజలు ఎంతో విజ్ఞులు…ప్రతిసారి మోసపోరు?
`భరోసా బలంగా ఏ పార్టీలోనూ లేదు?
`వచ్చే ఎన్నికలలో ధీమా ఇప్పటికీ లేదు!
`అనుమానంతోనే అన్ని విషయాలు చెబుతున్నారు.
`మేమే వస్తామన్న నమ్మకం కనబడటం లేదు!
`ఎన్నికల ముందు ఎంత చెప్పినా బాగా ఆలోచిస్తారు.
`జనాన్ని బలంగా నమ్మించే ప్రయత్నం చేస్తే కాని విశ్వసించరు.
`మరింత మెరుగైన పాలన కోసం ఎదురుచూస్తారు.
`ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి.
`నమ్మిన ప్రజలను నట్టెట ముంచకండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయమంటే అధికారమొక్కటే కాదు. పాలించడమే కాదు. రాజకీయం అనేది ఒక సమూహం. అంతే కాని ఆ సమూహమంతా పాలించేందుకు మాత్రమే వుండాల్సిన పని కాదు. రాజకీయం అంటే ప్రశ్నించడం. ఎదిరించడం. నిలదీయం. నిర్భయంగా మాట్లాడడం. ప్రజా సమస్యలపై గళమెత్తడం. ఉద్యమాలు చేయడం. పోరాటాలు చేయడం. దర్నాలు చేయడం. నిరసలు చేపట్టడం . దీక్షలు చేయడం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం. ఇదీ రాజకీయమంటే..అంతే కాదు రాజకీయమంటే దేశ ప్రగతి దారులు వెతకడం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం. సమసమాజ స్ధాపన కోసం ప్రయత్నం చేయడం. ఆ దిశగా చట్టాలు చేయడం. వాటిని అమలు చేయడం. జీవించే హక్కులాంటివి అందరికీ సమానంగా అమలు జరిగేలా చూడడం. సమాజాన్ని మేలుకొల్పడం. అసమానతలు తొలగించడం. ప్రజలను చైతన్యం చేయడం. దేశాభివృద్ది, ప్రజాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగడం. దేశాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించడం. వెట్టి చారిరినీ నివారించడం. ప్రజలకు ఉపాధి కల్పనగావించడం. పేదరికం లేని సమాజాన్ని నిర్మానం చేయడం. ఆకలి లేని రాజ్యాన్ని సృష్టించడం. ఇదీ రాజకీయమంటే..ఇదీ నాయకులు చేయాల్సిన పని అంటే..అంతే కాని నిత్యం ఒకరి మీద ఒకరు మైకుల మందు చెప్పుకునే మాటలు కాదు. ప్రతి సమస్యను ప్రజా కోణంలో కాకుండా, పార్టీల స్వార్ధాల కోసం పనిచేయడం రాజకీయం అసలే కాదు. ఇప్పుడు సాగుతున్న రాకీయాలకు సిద్దాంతాలు లేవు. రాద్దాంతాలు మాత్రం మితిమీరుతున్నాయి. రాజకీయాన్ని, ప్రభుత్వానికి ముడిపెట్టి ఆధిపత్య రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రజా సమస్యలు గంగలో కలిపేస్తున్నారు. ఏ పార్టీ చూసినా ఇదే అనుసరిస్తున్నాయి. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నించినట్లు నటించడం. ఒక వేళ పాలకులను ప్రశ్నిస్తే ఇతర పార్టీలను దేహ ద్రోహులని ముద్రలు వేయడం. పాలక పక్షాలను ఎదురించిన వారిని కేసుల్లో ఇరికించడం. ప్రజా గొంతును నొక్కేయడం. ఇదే రాజకీయం అనే స్ధాయికి చేరుకున్నది. ఆధిపత్య రాజకీయాల్లో, కక్షపూరిత రాజకీయాలు చేరుకున్నాయి. అధికారంలో వున్న పార్టీలు ప్రతిపక్షాలను బెదిరించడం, వేధించడం అలవాటు చేసుకుంటున్నాయి. ప్రశ్నించే గొంతులు లేకుండా చూడాలనుకుంటున్నాయి. దాంతో ప్రజలు కోసం తాము వున్నామన్న విసయాన్నే నాయకులు మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వాళ్లు, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలను కీర్తించేవారికి పదవులు. ప్రభువుల భక్తి ప్రదర్శించేవారే అసలైన నాయకులు అనే పరిసి ్ధతికి తెచ్చారు. లేకపోతే ఒక పార్టీలో గెలిచిన నాయకులు, తెల్లారేసిరికి ఏ పార్టీలో వుంటారో తెలియని అయోమయ పరిస్ధితులు. ఇంతే..రాజకీయం గురించి చెప్పుకోవాంటేనే అసహ్యం వేసేలా వాతావరణం మారింది. ఒకప్పుడు నాయకులు ప్రతిపక్షంలో వున్నందుకు గర్వంగా వుందని చెప్పుకునేవారు. పాలకపక్షంలో వున్న నాయకులు చేయలేని పనిని తాము చేస్తున్నామని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వుంటే ఏముంటుంది? కేసులు, వేదింపులు తప్ప ఐదేళ్లు ఏం అందుతుందన్న భావనకు నాయకులు కూడా వచ్చారు. దాంతో ప్రతిపక్షం అంటే పాలకపక్షం ముందు గజగజ వణికిపోవాల్సిన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ పదేళ్లపాటు పాలన సాగించింది..తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఫరిఢమిల్లుతుందని అందరూ అనుకున్నారు. కాని రాజ్యం అనేది ఎప్పుడూ తన పెత్తనాన్ని వదులుకోవడానికి ఇష్టపడదని కేసిఆర్ కూడా నిరూపించారు. ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలు వినడానికి కూడా చాలా సందర్భాలలో ఇష్టపడలేదు. ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ ఇచ్చిన హమీలు ఎన్ని? అమలు జరిగినవి? ఎన్ని అని చూస్తే, ఇచ్చిన హమీలకు, అమలుకు సామీప్యమే లేదు. అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు ఇస్తామన్నారు. కాని నిండు అసెంబ్లీలో తెలంగాణలో వున్న కుటుంబాలకంటే, రేషన్‌కార్డులు ఎక్కువ వున్నాయని, కోత కోసేశారు. రేషన్‌కార్డులు ఏరి వేశారు. డిల్లీలో జరిగిన సమావేశంలో కుటుంబాల కన్నా, రేషన్‌కార్డులు ఎక్కువ వున్నాయని తెలిసి తన తల తీసేసినంత పనైందన్నట్లు మాట్లాడారు. అంటే ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అనే దానిని నిజం చేశారు. రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితులను అర్దం చేసుకొని, పార్టీ ఆగమైపోయేలా వుందని గ్రహించి, మళ్లీ కొన్ని రేషన్‌కార్డులు జారీ చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి రెండు పడకల గదుల ఇండ్లు ఇస్తామన్నాడు. కాని పదేళ్ల కాలంలో తెలంగాణ పల్లెల్లో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. నిర్మాణం చేసింది లేదు. కాని లక్షల లెక్క చూపించి, జనాన్ని బురిడీ కొట్టించాలని కేసిఆర్ చూశాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణలో అర్హులైన దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామన్నాడు. భూమితో పాటు భూమిని సాగుకు యోగ్యం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నాడు. బోరు వేయిస్తామన్నాడు. ప్రభుత్వమే మోటారు బిగిస్తుందన్నాడు. ఉచిత కరంటు 24గంటలు సరఫరా చేస్తాన్నాడు. మూడేళ్లపాటు పెట్టుబడి సాయం మొత్తం అందిస్తానన్నాడు. ఏమైంది. రెండు సంవత్సరాలు వెలుసుబాటు పేరుతో కాలయాపన చేశాడు. మూడో ఏడు ప్రభుత్వంతో మూడెకరాల భూమి ఇవ్వడం సాద్యం కాదన్నాడు. అసల తెలంగాణలో ప్రభుత్వ భూమే లేదని చేతులెత్తేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. కేజీటు పిజీ ఉచిత విద్య అన్నాడు. దాన్ని మరిపించేందుకు గురుకులాలు అన్నాడు. ఆఖరుకు కేజీటు పీజీకి మంగళం పాడారు. అంటే ఇచ్చిన హమీలను ఎలా అమలు చేయకుండా వుంటారో అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని చెప్పడానికి సందేహం లేదు. మొహమాట పడాల్సినదేమీ లేదు. అదికారంలోకి రావాలంటే అబద్దాలు చెప్పాలి. ప్రజలను నమ్మించాలి. అనేది మాత్రం రాజకీయ పార్టీలు నేర్చుకున్నాయి. నిజం చెప్పడం మర్చిపోయాయి. నిజం చెబితే జనం నమ్మడం లేదని రాజకీయ పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీలను ప్రకటించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. కాని ఎన్ని అమలు చేసింది? ప్రజలకు తెలియదా? అయిన తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ఛానల్‌లో చెప్పిన మాటలు నిజమా? అనే సందేహపడాల్సిన పరిసి ్ధతి వస్తోంది. ఆరు గ్యారెంటీలలో ఒకటో, రెండో అమలు చేశారు. కాని ఒకటో, అరో అమలు కాకుండా మిగిలిపోయిందని చెప్పుకుంటున్నారు. కళ్లముందు ప్రజలకు పథకాల అమలు కనిపించడం లేదా? పధకాలు అమలౌతే ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు చెప్పుకోవాలా? సంక్షేమం అందిన తర్వాత ప్రజలు మర్చిపోతారా? అయినా ప్రజలను మాయం చేయడం రాజకీయ పార్టీలు, పాలకులు ఊరుకోరు. పొరుగున వున్న ఆంద్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలో వున్న అన్ని రాష్ట్రాలు ఇవే చేస్తున్నాయి. కేంద్రంలోవున్న బిజేపి అదే చేస్తోంది. ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించడం. ప్రచారం చేయడం తర్వాత చేతులెత్తేయడం అలవాటు చేసుకుంటున్నాయి. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప, అభివృద్ది సంక్షేమం సంగతి విషయంలో ఆ ఒక్కటి అడక్కు అనే పరిస్దితి వచ్చేసింది. అప్పులు చేయడంలో పాలకపక్షాలు పోటీ పడుతున్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పులు 50లక్షల కోట్లు గా వుంటే, పదేళ్లలో బిజేపి కేంద్రంలో చేసిన అప్పు 1.50లక్షల కోట్లు అని అంటున్నారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలు నిజమా కాదా? అనేది కూడా చెప్పడానికి పాలకపక్షాలు ఇష్టపడడం లేదు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 8లక్షల కోట్లు అప్పు చేసి, కేసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ప్రచారం చేసింది. కాని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లుకూడా కాలేదు. అప్పుడు 2.2ంలక్షల కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.. కేసిఆర్ పదేళ్లలో చేసిన అప్పు కేవలం. 2.80లక్షల కోట్లు అని తేల్చింది. దాంతో కాళేశ్వరం, మిషన్ భగీరధ, వంటి పధకాలు అమలు చేశారు. మరి కాంగ్రెస్ ఈ అప్పులు తెచ్చి ఏం చేశారనే ప్రశ్నకుసమాదానం వుండదు. ఇలా ఎన్నికల ముందు ఏదైనా చెప్పడం. అలవి కాని హమీలు ఇవ్వడం. తర్వాత చేతులెల్తేయడం అన్ని పార్టీలు చేస్తున్నదే. రాజకీయాలంటే అబద్దాల సామ్రాజ్యాలని ప్రతిసారి నిరూపిస్తున్నవే. అన్నీ ఆ తాను ముక్కలే. అందరూ అందరూ అందరే!! 79ఏళ్ల స్వాతంత్య్రంలో మన దేశానికి మిగిలినవి అప్పులే!!!
శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్సికోత్సవ వేడుకలు.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మంజూరు నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలను టిటిడి వేద పండితులు శ్రీ భావనారాయణ చార్యుల బృందం చేత ఘనంగా ప్రారంబించడం జరిగింది. మూలవిరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో సి ఈ ప్రకాష్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీప అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 24 నుండి 36 గంటల భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్,ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని,ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని,ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా,వాగు,నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే బిచ్చగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు,నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను,వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు,రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో
డాక్టర్ పట్ట పొందిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి నేటిదాత్రి .
గ్లోబల్ అక్రిడే షన్ యునైటెడ్ నేషన్..నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పాండిచ్చేరిలో డాక్టర్ రేట్ పట్ట పొందారు25 సంవత్సరాలుగా వనపర్తి జిల్లా ప్రజల సమాజ సేవకు, ప్రజా సమస్యలపై 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని సతీష్ తెలిపారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కౌన్సిలర్,గా సేవలు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడం హరితహారం లో ఒకేసారి మూడు వేల చెట్లు నాటడం ప్లాస్టిక్ వ్యతిరేకంగా బట్ట సంచులు ఉచితంగా ప్రజలకు పంచడం.కరోనా సమయంలో పోలీసు శాఖకు , మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేయడం కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడం ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ప్రజా సమస్యలపై పోరాడడం అనేక సేవ లకు గురించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పారు. శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పట్టా అందజేశారు డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శ్రీ కృష్ణాష్టమి రోజున పట్ట అందుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పంచిక మహేష్ యాదవ్ ఒక యాదవ కుటుంబానికి చెందిన బిసిబిడ్డనని కావాల్సి కొని కల్వపల్లి గ్రామంలో ఉన్నటువంటి పులి అంజిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ బిడ్డ ఈ గ్రామంలో ఎదగడం ఏమిటని అక్కసు తోనే గత మూడు సంవత్సరాలుగా నా పైన నా కుటుంబం పైన నన్ను మానసికంగా వేధిస్తూ ఇక్కడ అవకాశం దొరికిన కావల్సుకొని నాపైన దాడులకు ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే గత రెండు సంవత్సరాల క్రితం నా కు సంబంధించిన భూమిలో నాకు సమాచారం లేకుండా ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం రోడ్డు వేయడం ఇదేమిటని ప్రశ్నిస్తే నాపైన తన అనుచరులతో దాడి చేయించడం నాకు సమాచారం తెలియకుండా నా భూమి ముందు కావాలనే కక్షపూరితంగా గుడి నిర్మాణం పేరుతో నా భూమి ముందు రోడ్డు కబ్జా చేసి నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి పులి అంజిరెడ్డి నాకు ఎటువంటి సమాచారం తెలియకుండా నా భూమి ముందు గుడి ఎందుకు కడుతున్నారో మాట్లాదానికి వెళ్తే నా కుటుంబం మరియు పిల్లల పైన మహిళలను చూడకుండా పులి అంజిరెడ్డి తన అనుచరులతో నాపై పిడు గుద్దులు గుద్దుతూదాడి చేసి చంపుతామని భయభ్రాంతులకు గురిచే స్తూ ఉండగా నేను నా కుటుంబం భయంతో పారిపోయి రావడం జరిగింది నా కారు అద్దాలు పగలగొట్టి నన్ను భయ బ్రాంతులకు గురి చేసినటువంటి పులి అంజిరెడ్డి పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. అని అన్నారు అలాగే ఈ దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు అతని వెంట బిజెపి కార్యకర్తలు ఉన్నారు
సీఎం రిలీఫ్ ఫండ్ చక్కులను అందజేసిన ఎంఐఎం పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ఏఐఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఒవైసీ, కౌసర్ మొహియుద్దీన్, ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఇమ్రాన్ మొహియుద్దీన్ ఈ సందర్భంగా దిగ్వాల్ అధ్యక్షులు మహ్మద్ వాజీద్, కృష్ణాపూర్ అధ్యక్షులు మహ్మద్ యూనస్ రజా, సంపత్ సుధాకర్, సాజిద్ మునవర్ జమీల్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు..
అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన
భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యార్థి కి హోప్ ఫౌండేషన్ ప్రోత్సాహాం ….. హోప్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-
సేవే లక్ష్యంగా 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు కాబడ్డ హోప్ ఫౌండేషన్ సేవలు నిరంతరం కొనసాగడం పట్ల భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్ పేర్కోన్నారు . శనివారం చందానగర్ హోప్ ఫౌండేషన్ కార్యాలయం లో 7 వ తరగతికి చెందిన కార్తీక్ చదువులో రాణించడంతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉంటునందుకు హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 20 వేల రూపాయలు నగదును చైర్మెన్ కొండ విజయ్ కుమార్ బ్యాంక్ అధికారుల చేతుల మీదుగా అందజేశారు . హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం వేలాది మంది కీ భోజనాలు తో పాటు.క్రీడరంగంలో , వీద్యాలో రాణిస్తున్నా విద్యార్థులకు సహాయం అందచేయడంతో పాటు వైద్య ఖర్చుల విషయంలో సహాయం చేయడం తదితర సేవలను బ్యాంక్ అధికారులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు అశోక్ , అన్నె సందీప్ తదిఅన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న 2000 మంది….. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద భోజన కార్యక్రమం 145 పూర్తి చేసుకుంది. 145 వ శనివారం అన్మదాన కార్యక్రమంలో సుమారు 2000 వేల మంది పాల్గొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం చేపడుతున్న అన్నదానం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం పనులు చేసుకుంటూ జీవనం గడిపే తమకు ప్రతి వారం ఉచిత భోజనం అందజేయడం పట్ల హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు . తరులు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి స్కూల్లో వేడుకలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి ఆధ్వర్యంలో చిన్నారులకు కృష్ణుని, గోపికల వేషాధారణతో అలంకరించి అలనాటి కృష్ణ గోపికల మధ్య జరిగిన మధురమైన ఆట పాటలను ఆనంద కేరింతల మధ్య చిన్నారులతో నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టగా విద్యార్థులతో పాటు పలువురు ఆసక్తిగా తిలకించారు. అనంతరం కృష్ణాష్టమి కార్యక్రమంలో అత్యంత సన్నివేశం ఉట్టి కొట్టే సందర్భాన్ని కృష్ణుని వేషాధారణలో ఉన్న చిన్ని కృష్ణులతో ఉట్టిని పగలగొట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను ఎల్లవేళలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రియా స్వయసేవక్ సంఘ ప్రతినిధులు మార్త మార్కండేయ, సుదగాని ప్రమోద్ గౌడ్, మురికి మనోహర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం…. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత దుగ్యాల శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తొరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని స్థానిక దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్తూరి మల్లేశం, మిట్ట కోల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలకోట్ల రూపాయలు తెచ్చి తొరూర్ మరియు పాత చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తొర్రూర్ మండలంలో కోర్టు మరియు డిగ్రీ కాలేజ్ సెంట్రల్ లైటింగ్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రైతుల కోసం సబ్ స్టేషన్ల నిర్మాణానికి కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమాండ్ల.నరేందర్ రెడ్డి , మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, దేవరకొండ శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు…
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామంలో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం అని జిల్లాపరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ అన్నారు,తాను పనిచేస్తున్న పాఠశాల కోసం వారి యొక్క నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు , ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిత్రులు మరియు ఇంకా కొంతమంది దగ్గరి మిత్రుల నుండి సేకరించిన 9000/- రూలతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను తీసుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుండి మొదలుకొని ఇప్పటివరకు పిల్లల అవసరాలు తీర్చడానికి, పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు గతం లో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్ లు,నవోదయ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ప్రార్థన సమయంలో, మరియు వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడే సౌండ్ సిస్టం ను తీసుకురావడం ఎంతో ఉపయోగం అన్నారు వెంకన్న గౌడ్ ను తోటి ఉపాద్యాయులు,పిల్లల తల్లిదండ్రులు అభినందించారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, కిన్నెర శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాను ఎగరవేసినారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకం ఎగరవేసారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.