నాపాక ఆలయం లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.
చిట్యాల,నేటిధాత్రి .
చిట్యాల మండలం నైన్ పాక గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ వేషాధారణలతో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రామ కృష్ణ పరమ హంస మందిరం నుండి బస్టాండ్ వద్ద శ్రీ కృష్ణ విగ్రహం దగ్గరికి ఊరేగింపు నిర్వహించి డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుపుకొని శ్రీ శ్రీ శ్రీ నాపాక లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి శ్రీ కృష్ణునికి పళాభి షేకం చేసి చిన్నారుల చేతుల మీదుగా ఉట్టి కొట్టి ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ జన్మదిన సంధర్బంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసారుఅనంతరం ఉట్టి కొట్టిన చిన్నారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు నాపక ఆలయ ప్రాంగణంలో నైన్ పాక గ్రామ పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ యాదవ సంఘం నాయకులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు