బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి లో బిసి సంఘాల బందుకి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ పెద్దకోమటిపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బందు చేయించడం జరిగింది , అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి నిమ్మతి రాజేందర్ మంద దశరథం గడ్డం శ్రీనివాస్ మంద లక్ష్మయ్య ఆదిమూల సత్యనారాయణ మంద నవీన్ మెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 లో భాగంగా నేటి నుండి డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతను లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలియచేసారు.ఈ రోజు ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. అలాగే పొగాకు వినియోగంపై అవగాహన కార్యక్రమము, అలాగే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అయినటువంటి గుట్కా, కైని, జర్ధ ,సిగరెట్, చుట్ట,బీడీ, పాన్ మసాలాలు వినియోగించడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు నోరు, గొంతు, ప్రేగు, ఊపిరితిత్తులు, గుండె మొదలగు వాటికి మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అంతేకాకుండా ఆడ మగ వ్యత్యాసం లేకుండా మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నారు అలాగే ప్రజలు పొగాకు మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండి మీ విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరడం జరిగింది. అలాగే 60 రోజులు జరిగే ఈ ప్రోగ్రాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో, పాఠశాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో వంద గజాల దూరంలో పొగాకు సంబంధించిన షాప్స్ ఉండకుండా చూడాలని, బహిరంగ ప్రదేశంలో ఎవరు ఈ ఉత్పత్తులను వినియోగించకూడదని సూచించారు.రాలీ అనంతరం ఎన్జీవోస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సోషల్ వర్కర్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశాలు స్థానిక యువకులు పాల్గొన్నారు.
కేజీవిబి జూనియర్ కళాశాల భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంబోత్సవం, మండలంలోని వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన విద్యాబోధనకు డీఎస్సీ నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను ఆంగ్లమాద్యమంలో చదివానని, నాలాగే విద్యార్థులు ఇంగ్లీష్ లో చదవాలని, బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు. గ్రామంలో ఒక్కరు చదువుకున్నా … వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు. 10 వతరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏ.ఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈ.జి.ఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాపు, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, డీఈఓ రాజేందర్, ఈ ఈలు, కెజిబివి ఎస్ ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజులు బకాయిలను విడుదల చేయాలని మంచిర్యాల కలెక్టర్ కి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి అరకొర నిధులు విడుదల చేయడంతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల నుండి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలల నిర్వాహకులు కూడా బడ్జెట్ రాక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసే పరిస్థితి నెలకొంటుంది.అంతేకాకుండా బడ్జెట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కే.కార్తీక్ పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల సమీక్షా సమావేశం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పి మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల పై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో ఎక్కడా కూడా టోబాకో, మధ్యం విగ్రహాలు జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా పోలీసు, ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష కిట్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు మూసి వేయాలని, దీనికి సంబంధించిన ఆదేశాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడ మద్యం విక్రయాలు జర్గవద్దని అన్నారు.
జిల్లాల ఎక్కడ కూడా గంజాయి సాగు జర్గకుండా పక్కా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంజాయి కేసులలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కడా కూడా పిల్లలకు సిగరెట్ లిక్కర్ అమ్మకుండా చూడాలని, దీనిపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయాలని అన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మహేష్ బి గీతే మాట్లాడుతూ,.జిల్లాకు గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులు సమయంతో పని చేయాలని అన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పై నిఘా పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డిఓలు వెంకటేశ్వర్లు రాధాబాయి వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం డిఇఓ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు ఎక్సైజ్ ఇరిగేషన్ లేబర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాను ఎగరవేసినారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకం ఎగరవేసారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ , తను పనిచేసే పాఠశాల లో తన సొంత డబ్బులతో (సుమారు 2000 రూపాయలు విలువచేసే) నవోదయ మెటీరియల్ ను విద్యార్థుల కు అందజేశారు, ఈ పుస్తకాల ను చిల్లంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ చేతుల మీద విద్యార్థులకు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా నవోదయ సీటు సాధించేలా కృషి చేయాలని సూచించడం జరిగింది. నవోదయ సీటు సాధించిన విద్యార్థులకు నవోదయలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు, విద్యార్థులు కష్టపడి నవోదయ సీటు సాధించి మీ తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య ,రాజేశ్వరి గణేష్, క్రాంతి , తదితరులు పాల్గొన్నారు
200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి.
రాయికల్, జూలై 30, నేటి ధాత్రి:
సర్దుబాటు, డిఫ్యూటేషన్, నియామకాల్లో, సర్దుబాటు, డిప్యూటేషన్స్ లలో 200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు, హిందీ, అన్ని సబ్జెక్టులకు పోస్టులు మంజూరు చేయాలని భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో జరిగిన రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం విరామ సమయంలో హిందీ ఉపాధ్యాయులందరు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులుకు ప్రాతినిధ్యం చేసారు. కాంప్లెక్స్ సమావేశం ను సందర్శించిన మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి పలు సమస్యలు దృష్టికి తీసుకపోయారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీ నీ ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, వసంతరావు, సయీద్ పాషా, జోంగోని రాజేశం, శంకరయ్య, నీలిమ, జంగిలి రాజేశం, కూరగాయల సురేష్, సుజాత, ధనలక్ష్మి, నారాయణ, రమేష్, గంగాధర్, మారుతి, నరహరి కాంప్లెక్స్ హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల విషయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. కాంపౌండ్ వాల్, మౌలిక సదుపాయాలపై అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.
Education Minister
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలనీ,ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ, మరియు లెక్చరర్స్,ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలనీ,అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల, హస్టల్స్ భవనాలుకు స్వంత భవనాలు నిర్మించాలి.గురుకులాల సమయాన్ని శాస్ర్తీయంగా మార్చాలనీ,NEP -2020 రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ,బడ్జెట్, చిన్న ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.ఆర్ధిక సహాకారం అందించాలనీ విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలనీ అన్నారు.జిల్లాలో నిర్వహించిన బంద్ లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.
సంగారెడ్డి: జహీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి టిఎల్ రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆయన పాఠశాలల్లో సర్వే చేశారు. బుధవారం గుర్తించిన సమస్యలను స్థానిక ఆర్డీవో రామ్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు
రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అమలు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల గీతానగర్ బడిలో మొదలు
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జెడ్పి.హెచ్.ఎస్ లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులకు కట్టెల పొయ్యి పై ఆహార పదార్థాలు సిద్ధం చేయవద్దని సూచించారు. దీంతో వాతావరణ కాలుష్యం, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిల్లాలోని 458 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ పై సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధముగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ లపై సిద్దం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా సిరిసిల్ల లోని గీతా నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభించారు.
ప్రవైట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయిలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లల కోసం ఉచితంగా కేటాయించాలని ఇది 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించా లని అన్నారు.
విద్యా హక్కు చట్టం (RTE) 2009
, ప్రైవేట్ పాఠశాలలు
RTE చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయి తరగతుల్లో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని అన్నారు.ఈ సీట్లలో పిల్లలకు ఉచితంగా విద్యను అందించి, పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలను కూడా అందించాలని, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ఎలాంటి ప్రవేశ రుసుములు లేదా వార్షిక రుసుములు వసూలు చేయకూడదని అన్నారు.
చట్టం పొరుగు పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తుంది. ప్రతి పిల్లవాడు తమ ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాల కోసం పిల్లలను స్క్రీనింగ్ చేయడం లేదా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు నిధులు సమకూర్చాలి, తద్వారా వారు ఉచిత విద్యను అందించగలరని,ప్రభుత్వాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కోరుతున్నాయి, తద్వారా వారు తమ పిల్లల విద్య కోసం ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చుని RTE చట్టం ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను వివక్షత లేకుండా చేర్చుకోవడానికి, వారి విద్యకు హామీ ఇవ్వడానికి ఉద్దేశించబడిందని,ఈ చట్టం అమలులో ప్రభుత్వాలు,ప్రైవేట్ పాఠశాలలు రెండు బాధ్యత వహించాలని అన్నారు.ప్రభుత్వాలు నిధులు అందించడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు సహాయం చేయాలని, తద్వారా విద్యార్థుల హక్కులను కాపాడడానికి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవచ్చని అన్నారు.
విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.
అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు: సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు
విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడంతోపాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబరు 18004258599లో సంప్రదించాలని సూచించారు. రెండో విడత లాటరీలో 8,583 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారికి ఉచిత ప్రవేశాలు కల్పించాలని, సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక
మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )
స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.