
శివలింగం ఉత్తమ సేవలకు గుర్తింపు.
శివలింగం ఉత్తమ సేవలకు గుర్తింపు. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివలింగం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం వారం రోజుల్లోనే రూ.3 కోట్ల విలువ గల ఆస్తి సంబంధిత నేరాన్ని ఛేదించి, కేసుల పరిష్కారంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆయన బుధవారం డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.