243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) సమీపిస్తున్న వేళ కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఓ సంచలన ప్రకటన చేశారు. ముజఫర్‌పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఈసారి బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ధీమాగా ప్రకటించారు. తేజస్వి ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు
దీంతోపాటు తేజస్వి యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఇలాంటి ఎత్తుగడలు ఇక పని చేయవని వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. కాంతిలో బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
మహిళల కోసం లక్షన్నర హామీ
ప్రభుత్వం తమ ఒత్తిడితోనే పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రకటించిందని తేజస్వి అన్నారు. మేము ముందుంటాం, ప్రభుత్వం తమను అనుసరిస్తుందని సెటైర్ వేశారు. ఆర్‌జేడీ మై బెహన్ యోజనను కాపీ చేస్తూ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అవినీతిపై ఆరోపణలుఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ 80 వేల కోట్ల రూపాయల లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎలుకలకు రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. వంతెనలు కూలుతున్నాయని, ఆసుపత్రుల్లో రోగులకు రక్షణ లేదని విమర్శించారు. ఇలాంటి సమయంలో అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.సీట్ల గందరగోళంమహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ఓటర్ల హక్కులపై ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడింది.ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలపడిందని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఈ కూటమిలో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ 243 సీట్లలోనూ పోటీ చేస్తామని చేసిన ప్రకటన కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది.
చినుకు పడితే నర(డ)క ప్రాయమే… హైడ్రా ఆర్.&బి. అధికారులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారేమో?? ఫ్లై ఓవర్ బ్రిడ్జి రోడ్డు బాగు చేయాలని బాలానగర్ వాసుల వినతి హైదరాబాద్, నేటిధాత్రి: హైదరాబాద్ లోని బాలానగర్ వార్డు పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకి ఇబ్బందులుగా మారాయి.వర్షం కురిస్తే చాలు ఇక్కడ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఈ గుంతలు చూసి స్థానికులు మన్సూర్ ఎమర్జెన్సీ బాధ్యతలు తీసుకున్న హైడ్రా సిబ్బంది కి కూడా తెలియజేస్తే వారు ఆర్ అండ్ బీ కి సంబందించిన పని కాబట్టి వాళ్ళకి ఫిర్యాదు చేయాలని తప్పించుకుంటున్నారు.
Balanagar Flyover
అటు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవిస్తే అది హైడ్రా కంట్రోల్లో ఉంది అందుకే మేము అక్కడ ఏ పని చేయలేవు అని ఆర్.&బి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకుంటున్నాయి తప్ప ప్రజల సేఫ్టీ కోసం ఏ శాఖ కూడా ఆలోచన చేయడం లేదు. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరగకముందే గుంతలు పూడ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని స్థానికులు వాపోతున్నారు.
Balanagar Flyover
ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పైన గుంతలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన మెటీరియల్ తో పూడ్చి ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..
`జాతీయ జెండా కండువా అని తొండి ముచ్చట్లు చెప్తున్రు!
`బీఆర్‌ఎస్ లోనే వున్నామని బుకాయిస్తున్రు!
`బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామంటున్రు.
`నియోజకవర్గ అభివృద్ధి కోసమే సిఎం ను కలిశినమంటున్రు!
`పూటకో మాట మారుస్తున్రు!
`ప్రజలను ఏమారుస్తున్రు!
హైదరాబాద్,నేటిధాత్రి: నిజాలు ఎలాగూ చెప్పలేరు. కనీసం అబద్దాలైలు కూడా ఆడలేనప్పుడు ధైర్యవంతులని ఎలా అంటారు. అలాంటి వారికి రాజకీయాలెందుకు? ప్రజా ప్రతినిధులు అయ్యేందెందుకు? వారికి పదవులెందుకు? ప్రజల పక్షాన నిలిచినట్లు లేదు? కనీసం తమకు తాముగా రాజకీయ నాయకుడిగా చెప్పుకోవడానికి లేదు? ఇంకా ఎందుకు ఆ పదువులు? రాజకీయం ఎప్పుడూ సూటీగా వుండదని అంటారు. కాని డొంకతిరుడుగు రాజకీయాలైనా సరే సరిగ్గా చేయలేని వారు ప్రజలకు మేలు చేయలేరు. వారి పదవుల కూడా కాపాడుకోలేరు. తెలంగాణలో పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు. రాజీపడే రాజకీయాలు చేసే శక్తిలేదు. ఏ పార్టీలో వున్నామో చెప్పడానికి నోరు కూడా రావడం లేదు. పార్టీ మారినట్లు ఒప్పుకునే ఆత్మస్ధైర్యం లేదు. ఇంతగా దిగజారి రాజకీయాలు చేసి ఆ ఎమ్మెల్యేలు చేసేదేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మూడునెలల్లో పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగారు. కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ విషయం వాళ్లే స్వయంగా మీడియా సాక్షిగా, కార్యకర్తల సమక్షంలో చెప్పారు. కాని ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. తాము పార్టీ మారలేదంటున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. ఇది అనైతిక కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా? కనీసం ఆత్మ ప్రబోధం అనేది కూడా వారిలో లేదా? ఎనుకున్న ప్రజలను వంచించడం కాదా? నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మోసం చేయడం కాదా? గెలిపించిన కార్యకర్తలను నట్టెట ముంచడం కాదా? నమ్మించి గొంతు కోసినట్లు కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్. సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంక్రట్‌రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు బిఆర్‌ఎస్ కు రాం రాం చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితోపాటు ఎంత మందిని కాంగ్రెస్‌లో చేర్చారు. సుప్రింకోర్టు తీర్పు దృష్ట్యా గడువు దగ్గరపడుతుండడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ వారికి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాదానం చెప్పాలన్నారు. అందులో 8మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్పారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మరింత సమయం కోరారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పాడు. ఆయన పార్టీ మారిన రోజు తన రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ నుంచి అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్లానని, ఆ తార్వత బి ఆర్‌ఎస్‌లో వున్నానన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చానని మీడియా ముందు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఆయన పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని పార్టీ మారినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి యువకుడు, ఇంకా మరో ముప్పై ఏళ్లు రాజకీయం చేయగలిగే శక్తి వున్న నాయకుడితో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. కాని స్పీకర్‌కు మాత్రం తాను పార్టీ మారలేదని సమాధానమిచ్చారు. సరే అదే నిజమని అనుకుందాం. కాని ఆయన ప్రభుత్వంలో భాగాస్వామిగా వున్నారు. ఓ కార్పోరేషన్‌కు చైర్మన్‌గా క్యాబినేట్ ర్యాంగ్ పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన పచ్చి అబద్దంచెప్పినట్లు కాదా? అనేక సార్లు సిఎల్‌పి సమావేశంలో పాలు పంచుకోలేదా? ఎంతో సుధీర్ఘమైన అనుభవం వున్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరమని నమ్మి కేసిఆర్ 2014 తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. 2018 తర్వాత ఏకంగా స్పీకర్ పదవిని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇలా అబద్దాలు చెప్పడం విడ్డూరం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలున్నాయి. పార్టీ మారినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఇంటి మీదకు దాడికి దిగిన సందర్భం కూడా అరికెపూడికి వుంది. అయినా పార్టీ మారలేదని చెప్పడం విడ్డూరంగా వుంది. వీరిలో డాక్టర్ సంజయ్ మీద కేసిఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. నిజానికి జగిత్యాల టికెట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఆమె ఎంపిగా వున్న సమయం నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించారు. నిజామాబాద్ ఎంపిగా వున్న సమయంలో నిజామాబాద్‌తోపాటు , జగిత్యాల అభివృద్దికి కవిత ఎంతో కృషి చేశారు. అయినా కన్న కూతురు కవితను కాదని సంజయ్‌కు టికెట్ ఇస్తే గెలిచి, పార్టీ మారడం అనేది ఏమాత్రం నైతికత కాదని అంటున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసిఆర్ ఎంతో ప్రాదాన్యతనిచ్చారు. ఉన్నత విద్యావంతుడు. పరిపాలనపై పట్టున్న నాయకుడు అని ఎంతో కేసిఆర్ నమ్మారు. 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపిగా గెలిచిన కడియం శ్రీహరిని, ఉన్న ఫలంగా ఎమ్మెల్సీని చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో ఓ మీడియాలో ఇంతకన్నా నాకు వేరే ఆశలు లేవు. రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి కావడం నా అదృష్టం. ఇక నా జీవితం బిఆర్‌ఎస్‌లోనే పరిసమాప్తమని చెప్పారు. అలా నమ్మిన కడియం శ్రీహరి, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆఖరుకు గత ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అయినా కడియం శ్రీహరి మూడు నెలలు కూడా బిఆర్‌ఎస్‌లో లేరు. ఇంకా విచిత్రమేమిటంటే ప్రభుత్వం పడిపోకుండా చూసుకో అని ఒక దశలో రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో సూచించిన కడియం శ్రీహరి, పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కాని రాజకీయ అనుభవం నేర్పిన పాఠంతో ఆయన చూపించిన రాజకీయ చాణక్యం నిగూడమైంది. కేసిఆర్ మరింత నమ్మకంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపి. టికెట్ కూడా ఇచ్చారు. ఆ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా వారికి కాదని కడియం శ్రీహరికి ప్రాదాన్యతనిచ్చారు. అటు బిఆర్‌ఎస్ భీఫామ్ ఇచ్చిందో లేదో, ఇటు డిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ బిఫామ్ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కాని ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో వుండాలో ఆ పార్టీలోనే వున్నానంటూ సమాదానం దాట వేశారు. వరంగల్ రాజకీయాల్లోనే టాలెస్టు పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం భహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్‌లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పించుకునే పరిస్ధితి అసలే లేదు. ఎందుకుంటే ఆయన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా వుంటూనే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరుపున సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్ కు అందరికంటే ముందుపదవిపోక తప్పదు. కాని ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమౌతుందో దానం నాగేందర్‌కు గతంలోనే ఓ అనుభవం వుంది. 1999లో మొదటి సారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్‌కు 2004కు కాంగ్రెస్‌పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి టిడిపి పార్టీ టికెట్ తెచ్చుకొని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కాని కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకొన్న అనుభవం దానంకు వుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం వుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయం పట్టుకున్నది. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి అయితే రాజీనామా చేయాలి. లేకుంటే వేటుకు సిద్దపడాలి. రెండిరటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాలలో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారరు.
పలమనేరు మార్కెట్ యార్డ్ లో దళారుల చేతిలో మోసపోతున్న రైతులు !కానరాని అధికారులు
పలమనేరు(నేటి ధాత్రి)సెప్టెంబర్ 13:
పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులను దళారీ వ్యవస్థ పూర్తిగా మోసం చేస్తుంది అనడంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి అన్నం పెట్టే రైతును దళారీ వ్యవస్థ ఏకమై పూర్తిగా రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా పూర్తిగా మోసం చేస్తున్నారు, చాలీచాలని ధరలు కు ఎంతో కష్టంతో పండించిన కూరగాయలను వదులుకొని వెళ్తున్నారు, రైతులు అదేవిధంగా రైతులకు కనీ సౌకర్యాలు కూడా లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు, అధికారులు ఎన్నోమార్లు వార్త కథనాల రూపంలో ఈ సమస్యలను గుర్తించిన కనీసం రైతులను కనికరించడంలో అటు యంత్రాంగం ఇటు అధికారి యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని విమర్శ కూడా ఉంది, ఏఎంసీకి ఎన్నికైన చైర్మన్ లు తమకు ఎంత లాభం వస్తుంది తీసుకుందామా వెళ్లిపోయామని ఉన్నారే కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, పలమనేరు మార్కెట్ యాడ్ కోసం ఎంపిక చేసిన 40 ఎకరాల స్థలం శంకుస్థాపనకే పరిమితమైంది కానీ రైతులకు సౌకర్యాలు అందించడంలో విఫలమైందని అర్థమవుతుంది అటు కర్ణాటక రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించుకుంటూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంటే పక్కనే ఉన్న పలమనేరు మార్కెట్ యార్డులో అధికారులు దళారులు చేతుల్లో రైతుల్ని పెట్టి ముప్పతిప్పలు పెడుతున్నారు ఇందులో దళాలు చేతునుంచి అధికారులు ఎంత తీసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా అసౌకర్యంగా ఉన్న పలమనేరు మార్కెట్ యార్డ్ ను నూతనంగా కేటాయించిన స్థలానికి మార్చి దళారుల వ్యవస్థను దూరం చేసి పూర్తిగా రైతులను ఆదుకోకుంటే రాబోవు రోజుల్లో పలమనేరు మార్కెట్ యార్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైతులు మక్కువ చూపాల్చి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై పై జిల్లా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని పలమనేరు నియోజకవర్గం ప్రజలను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్టీసీయాత్రాధానం..మానవసంబంధాలకు వారధి…మానవత్వపు బహుమతి అని దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యాత్రాదానం అనే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ కోరారు.ఈ కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశం పొందుతారు అని అన్నారు.సంతోషకరమైన రోజుల్లో ఈ యాత్ర ద్వారా ఇతరులలోనూ ఆనందాన్ని పంచుకోవ చ్చు.సమాజహితానికి ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్టీవోలు ఈ యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు.ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించిందన్నారు. యాత్రాదానం బస్సుల బుకింగ్ కోసం నర్సంపేట డిపో 9959226052, 9866314253 నెంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ తెలిపినారు.
రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పరిధిలోని కొణెంగల (కొండముచ్చు) దాడిలో శనివారం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాంనగర్ కు చెందిన రాజ్ కుమార్, శరణమ్మ అనేవారు ఈ దాడిలో గాయపడినట్లు సమాచారం. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, గాయపడిన ఇరువురు క్షేమంగానే ఉన్నారు.
బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.అలాగే పట్టణంలోని అక్షర ద స్కూల్, ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర ద స్కూల్ లో బాలాజీ వివిధ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణ ఎనిమిదవ షెడ్యూల్లో హిందిభాషను కేంద్రప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందని తెలియజేశారు.బాలాజీ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హిందీ భాషా దినోత్సవ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.భారత జాతీయ ఉద్యమంలో అప్పటినుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.అనంతరం హిందీ భాషో పాధ్యాయుడు ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీ, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఆయా పాఠశాలల్లో విద్యార్థులందరూ హిందీ భాషలో కవితలు ,గేయాలను చార్ట్ పై రాసి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో విష్ణులత, నరసింహస్వామి, లలిత, ఎస్ .రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Hindi Language Day
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర ద స్కూల్ లో…
బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవం ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ, అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని, ఏ.ఓ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న పాటించుకొని ప్రభుత్వం
పంటలకు సరిపడా యూరియ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతుని రాజుల చేసిన కేసిఆర్- సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి ఆగిన చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈసందర్భంగా రైతులు రవిశంకర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాస్ బుక్ మీద ఒక్క యూరియా బస్తానే ఇస్తాం అంటున్నారు మాకు ఐదు ఎకరాలు వ్యవసాయానికి ఒక్క బస్తా ఏం సరిపోతుంది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్య విన్న రవిశంకర్ వెంటనే సంబంధింత అధికారికి ఫోన్ చేసి యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం గురించి వివరించారు. వెంటనే వారికి యూరియా తెప్పించి రైతులకు అందించాలని కోరారు. అనంతరం రైతులతో ముచ్చటిస్తూ పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులను లైన్‌లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు. అన్నదాతలు గత పదిరోజులుగా యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకం, ఆధార్‌కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో ఐదెకరాలు, పదెకరాల భూమి ఉన్న రైతులకు అది ఏమూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎకరాకు సుమారు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఇబ్బందిలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈఅవస్థ అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే, మరోసారి రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం…?
గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, కొద్ది మొత్తంలో వచ్చిన యూరియా పంపిణీలో పూర్తిగా సహకరిస్తున్న మహబూబాబాద్, కేసముద్రం పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియచేసిన కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్.ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ… కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి పూనుకొని రైతులకు లేనిపోని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఒక అవగాహన లేకుండా బదనం చేస్తున్నారని కావున రైతులందరూ ఎవరు ఈ యూరియా కొరతకు కారణం ఏ ప్రభుత్వం అనేది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్రానికి సరిపడా యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నా చేసిన ఏ ఒక్కరు రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోగా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారని, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు సగం మంది ఉన్నారని వారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎవరు ఎందుకు అడగట్లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రం గురించి రాష్ట్ర రైతుల గురించి అడగకపోవడం శోచనీయం..? రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా బిజెపి ఎంపీలు ప్రజా ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుఅవుతుంది ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అవగాహన లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు
ఈనెల 15న తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి
మడిపల్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి
అంబాల చంద్రమౌళి మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ విహెచ్ పేస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం ఎంఆర్పిఎస్ భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మడిపల్లి శ్యాంబాబు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగలు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల తాసిల్దార్ కార్యాలయాల ముట్టడించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రతి గ్రామం నుండి వచ్చి ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు వృద్ధులు విత్తంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దరులందరూ పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బొల్లి బాబు మాదిగ నోముల శ్రీనివాస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేంద్ర మాదిగ దూడపాక శ్రీనివాస్ మాదిగ టౌన్ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ మిరపటి అశోక్ మాదిగ రేణిగుంట్ల రవి మాదిగ మంద తిరుపతి మాదిగ ఎర్ర భద్రయ్య మాదిగ చంటి మాదిగ నూనెపాకుల కుమారు మాదిగ మంద కిరణ్ మాదిగ మంచినీళ్ల వైకుంఠం మాదిగ బోడికల శ్రీకాంత్ మాదిగ ఒంటెరి రాజేష్ మాదిగ కుమ్మరి అనిల్ మాదిగ బోడికల సమయ మాదిగ సునీల్ మాదిగ మంగళ రవి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**
* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..
రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు. రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.
పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో నుండి బయటపడాలని జడ్జి తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ క్షమా గుణాన్ని కలిగివుండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరభావంతో మెలగాలని వారు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ లేబర్ కమీషనర్ వినోద గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు బెంచి మెంబర్లు ఎం.డి. లతీఫ్ అబ్దుల్ కలాం మంగళపల్లి రాజ్ కుమార్ రావుల రమేష్ కనపర్తి కవిత మొయినుద్దీన్ సంధ్య నాగవత్ తిరుమల పోలీసు అధికారులు పి.కుమార్ ఏ.నరేష్ కుమార్ కర్ణాకర్ రావు వెంకటేశ్వర్లు బ్యాంకు ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’
సంగారెడ్డి: జహీరాబాద్లోని రాయిపల్లి(డి) గ్రామ చౌరస్తా వద్ద డెక్కన్ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్( బిటిపిఎల్ ) సంస్థ హైమాస్ లైట్లను ఏర్పాటు చేసింది. ఈ లైట్ల ఏర్పాటు వల్ల రాత్రి సమయాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు డీటీపీఎల్ ప్రతినిధులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ కాశీనాథ్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు.
సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ
కంపేటి రాజయ్య, బంద్ సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు. ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ కార్యాలయంలో సురేష్ షట్కర్ ఎన్ హెచ్ ఆర్ సి, సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొగుడంపల్లి మండలంలో వివిధ గ్రామంలో మూలిక సమస్యలు పైన చర్చించి రోడ్లు , డ్రైనేజీ కలవట్లు, విద్యుత్ స్తంభాలు ,షీట్ లైట్స్ , మంజూరు చేయాలని కోరడం జరిగింది ఎంపీ వెంటనే స్పందించి అతి త్వరలో సాంక్షన్ చేయించి సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ జిల్లా యువ ప్రతినిధి గోపాల్ పాల్గొన్నారు,
హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రములో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వర్డన్ వెంటనే సస్పెండ్ చేయాలి మహిళా వార్డెన్ సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామేర కిరణ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మేస్ కాస్మోటిక్స్. స్కాలర్ షిప్స్ & ఫిజురియంబర్స్ వెంటనే విడుదల చేయాలీ జిల్లా కేంద్రములో విద్యార్థులు సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్వరం ప్రధాన కార్యదర్శి కుమార్ రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది
పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన రాజా రమేష్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గడ్డం రాజు_ విజయలక్ష్మి ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. వారి తల్లి భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, నాయకులు బొమ్మ భూమయ్య గౌడ్, జక్కన బోయిన కుమార్, నందిపేట సదానందం, రామిడి లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, చంద్రమౌళి, పైథార్ ఓదెలు, కొండ కుమార్ ,మణి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.