కారుణ్య జ్యోతిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి స్కూల్లో వేడుకలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి ఆధ్వర్యంలో చిన్నారులకు కృష్ణుని, గోపికల వేషాధారణతో అలంకరించి అలనాటి కృష్ణ గోపికల మధ్య జరిగిన మధురమైన ఆట పాటలను ఆనంద కేరింతల మధ్య చిన్నారులతో నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టగా విద్యార్థులతో పాటు పలువురు ఆసక్తిగా తిలకించారు. అనంతరం కృష్ణాష్టమి కార్యక్రమంలో అత్యంత సన్నివేశం ఉట్టి కొట్టే సందర్భాన్ని కృష్ణుని వేషాధారణలో ఉన్న చిన్ని కృష్ణులతో ఉట్టిని పగలగొట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను ఎల్లవేళలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రియా స్వయసేవక్ సంఘ ప్రతినిధులు మార్త మార్కండేయ, సుదగాని ప్రమోద్ గౌడ్, మురికి మనోహర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.