శ్రీకృష్ణుని కృప అందరిపై ఉండాలని కోరుకున్నా..
*ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
తిరుపతి(నేటిధాత్రి(ఆగస్టు 16:
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ సమేత అష్టసతులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం దర్శించుకున్నారు.ఆలయ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మున్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రతినిధుల తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు.తిరుపతి నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరణి జగన్, రాజా రెడ్డి, జీవకోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మునస్వామి, పురుషోత్తం, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.