కవిత పార్టీ వచ్చేస్తోంది!

`జన జాగృతి కోసం కవిత పార్టీ రూపకల్పన జరిగింది

`జాగృతి.. సామాజిక తెలంగాణకు నాంది !

`జాగృతి.. బలహీన వర్గాల ఆశాజ్యోతి

`విజయదశమి నాడు కవిత ప్రకటన

`తెలంగాణ రాజకీయాలలో ప్రభంజనం కానున్నది

`దసరా ముహూర్తం కుదరింది!

`విజయదశమి నాడు ప్రకటన వెలువడనుంది

`స్థానిక సంస్థల ఎన్నికలతో బరిలోకి దిగనుంది

`రంగమంతా సిద్దమైంది

`జెండా, ఎజెండా ఖరారైంది

`సామాజిక తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేయనుంది

`బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రానుంది

`బీసీల రాజ్యాధికారం సాకారం చేయనుంది

`గ్రామ స్థాయి నుంచి బిసిల నాయకత్వం బలపడనుంది

`కవిత రాజకీయ వ్యూహం మామూలుగా వుండదు

`తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా వుంటుంది

`తెలంగాణ ఆత్మ గౌరవం రెపరెపలాడుతుంది

`సామాజిక తెలంగాణ స్థాపన జరిగేలా వుంటుంది

`సర్పంచ్‌ ఎన్నికలలో జనరల్‌ స్థానాలలో 90 శాతం బిసిలకే

`మహిళా రిజర్వేషన్లీ బిసి మహిళలకే

`పార్టీ ప్రకటన జరిగిన వెంటనే కవిత పాదయాత్ర

`రెండు సంవత్సరాల పాటు సాగనున్న పాదయాత్ర

`పాదయాత్రలోనే పార్టీ కమిటీల ప్రకటన

`పెద్ద ఎత్తున యువత సహకారంతో కవిత పార్టీకి ఉత్తేజం

`అన్ని వర్గాల యువతకు పార్టీలో ప్రాధాన్యం

హైదరాబాద్‌,నేటిధాత్రి:                         

తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ కెరటం దూసుకువస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కొత్త పార్టీ త్వరలో పెట్టబోతున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ అంతా చకచకా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే కవిత పార్టీ వచ్చేస్తోంది. తెలంగాణ జన జాగృతి కోసం ఆమె కంకణం కట్టుకున్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. కవిత తెలంగాణలో బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలవాలనుకుంటున్నారు. ఇందిరాగాంధీ లాగా తన పేరు చిరస్ధాయిగా నిలిచిపోయేలా తన రాజకీయ జీవితం వుండాలని, తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి జరగే వరకు విశ్రమించేది లేదని నిర్ణయించుకున్నారు. అందుకే వచ్చే దసరా పండున వేడుకను పార్టీ పండుగ చేయాలని చూస్తున్నారు. బలమైన ముహూర్తం దొరికింది. పార్టీ ఏర్పాటుకు రంగమంతా సిద్దమైంది. జెండా, ఎజెండాలు కూడా రూపకల్పనలు జరిగాయి. పార్టీ ప్రకటనే తరువాయి. పార్టీకి చెందినటు వంటి అన్ని కమిటీలు కూడా చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ముందుగా జిల్లా స్ధాయి నియామాకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. పాత, కొత్త తరం కలయితో, నూతన తరం, యువతరంతో కలిసి పార్టీ నిర్మాణం జరగనున్నది. ముఖ్యంగా బిసిలతోనే పార్టీ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు. అన్ని స్ధాయిలలో బిసిలకే పెద్ద పీట వేస్తూ కమిటీల ప్రకటనలు చేస్తున్నారు. వాటిని నిశితంగా చూస్తే మెజార్టీ కమిటీలో మెజార్టీ పదవులు బిసిలకే కేటాయిస్తున్నారు. సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంలో భాగంగానే కమిటీ నిర్మాణం జోరుగా సాగుతోంది. తాజాగా ఆమె కొన్ని రోజులు అమెరికా పర్యటన చేస్తున్నారు. తన చిన్న కొడుకును అమెరికాలో ఉన్నత చదువులకు కోసం తీసుకెళ్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరింత స్పీడ్‌గా పార్టీ నిర్మాణపనులు చూసుకోనున్నారు. పిల్లలు అమెరికాలో వెళ్లడంతో ఇక ఆమె పూర్తి స్ధాయి సమయం పార్టీ కోసమే కేటాయించాలన్న ఆలోచనతో వున్నారు. బిసిలకు రాజ్యాధికారం అనేది సాదించి చూపించాలని అనుకుంటున్నారు. కట్టెల మోపు ఎంత పెద్దదైనా సరే వాటికి తాడు లేకుండా మోపు కట్టలేము. ఇక్కడ అదే ఫార్ములాను ఆమె అనుసరిస్తున్నారు. బిసిలను ఏకం చేయడం బిసిల వల్ల సాద్యం కావడం లేదు. అదే జరిగేదివుంటే ఎప్పుడో బిసిలకు రాజ్యాధికారం వచ్చేది. ముందు బిసిల ఐక్యతను సాధించే పని కవిత చేస్తున్నారు. గ్రామస్ధాయి నుంచి బిసిల నాయకత్వం బలపడాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ వ్యూహం ఎవరూ చేపట్టలేదు. రాజకీయంగా ముందుకు వెళ్లలేదు. అందుకే కవిత కొత్త తరహా రాజకీయం పరిచయం చేయనున్నది. అటు సామాజిక తెలంగాణ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కవిత పార్టీ పెట్టనున్నది. మొత్తంగా బిసిలకు రాజ్యాదికారం అనే ఆలోచనలను నిజం చేయాలనుకుంటున్నది. కేసిఆర్‌ తెలంగాణ కల నెరవేర్చారు. కవిత సామాజిక తెలంగాణ నిజరూప ఆవిష్కరణ చేయనున్నారు. గ్రామ స్ధాయి నుంచి బడుగుల నాయకత్వం బపడితేనే రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్దాయికి చేరుకుంటుందని కవిత బలంగా నమ్ముతున్నారు. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలావుంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టేలా వుంటుంది. సామాజిక తెలంగాణస్ధాపన జరిగేలా వుంటుంది. బిసిలకు మొత్తం జనరల్‌ కేటగిరీ సీట్లలో 90శాతం అమలు చేసేలా ప్రణాళికులు రూపొందిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లలో కూడా బిసిలకు పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. కవిత పార్టీ ప్రకటన తర్వాత రెండు సంవత్సరాల పాటు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపటనున్నారు. అటు పాదయాత్ర, ఇటు కమిటీల ప్రకటనలతో తెలంగాణలో రాజకీయ భూకంపం తెస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా బిఆర్‌ఎస్‌తో అనవసరమైన పేచీ వద్దనకుంటున్నారు. తానే ఓ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు బిఆర్‌ఎస్‌ రాజకీయాల్లో రాద్దాంతం సృష్టించడం వల్ల , లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముందని అర్దం చేసుకున్నట్లున్నారు. ఇంకా ఆలస్యం చేయడం వల్ల అనేక రకాల రాజకీయ విమర్శలు ఎదుర్కొనే అవకాశం వుంటుంది. తన దారి తాను చూసుకొని, తన సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కవిత సంకల్పించింది. బిఆర్‌ఎస్‌లో వుంటూ సామాజిక తెలంగాణ నినాదం చేయడం వల్ల ఆ పార్టీకి కూడా కొంత నష్టం జరగొచ్చు. ప్రజలు కూడా నమ్మకపోవచ్చు. ఇప్పటికే పదేళ్లు కవిత ఏం చేసినట్లు అనే ప్రశ్నలు కూడా రాజకీయ పార్టీలు,సామాజిక సంస్ధల నుంచి వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు పుల్‌స్టాప్‌ పెట్టాలంటే సొంత పార్టీ ఏర్పాటే సమాధానమౌతుంది. బిఆర్‌ఎస్‌లో నా మాట చెల్లుబాటు కావాలని ఏమీ లేదు. ఎందుకంటే అందులో అన్ని రకాల వాదనలు, వర్గాలు వున్నాయి. కాని కవిత పెట్టే పార్టీలో ఏకైక ఎజెండాగా సామాజిక తెలంగాణ నిర్మాణం అనేది వుంటుంది. అప్పుడు కవిత విమర్శలకు దూరమౌతుంది. తానే ఇతర పార్టీలను ప్రశ్నించే అవకాశం దొరుకుతుంది. అందుకే విజయదశమి నాడు పార్టీ ప్రకటన చేయాలని చూస్తున్నారు. విజయదశమి చెడు మీద విజయానికి చిహ్నం. పైగా రాక్షసుడైన మహిషాసురుడిని అంతం చేసిన సందర్భం. దుర్గగా ప్రజలను కాపాడిన దేవతగా విజయ దశమి జరుపుకునే సందర్భం. ఆ సమయంలో రాక్షస రాజకీయాలను అంతం చేయాలనే లక్ష్యంతో ఆమె దసరా పండుగ నాడు పార్టీని ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె బిఆర్‌ఎస్‌ ఎంత నాదని చెప్పుకుంటున్నా, ఆమెది కాదని తేటతెల్లమౌతూనే వుంది. పైగా బిఆర్‌ఎస్‌ నాయకులను ఆమె టార్గెట్‌ చేస్తున్న విధానంలోనే అర్ధమౌతుంది. ఇటీవల కొందరు సీనియర్‌ నాయకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు బిఆర్‌ఎస్‌కు ఆమెను చాలా దూరం చేసినట్లే లెక్క. కవిత అమెరికా వెళ్లడం, ఆ సమయంలో ఆమె రాసిన లేఖ లీక్‌ కావడమే కవితను దూరం చేయడానికి బీజం పడిరదని చెప్పుకోవచ్చు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలలో ఆమెకు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. అంటే పార్టీ పెద్దలే ఆమెను దూరం పెడుతున్నట్లు సంకేతాలు పంపినట్లైంది. ఈ విషయం కవితకు తెలియంది కాదు. అయినా సర్ధుకుపోవాలనే ఆమె చూసింది. కాని అడుగడుగునా ఆమెను రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీలకన్నా,సొంత పార్టీనేతలే వ్యవహించడం జరుగుతోంది. ఇలా తాను, తన అనుచరులు ఇబ్బందులు ఎదుర్కొవడం కన్నా, దూరం కావడమే మేలని అర్దం చేసుకున్నారు. పార్టీని నడిపే శక్తి యుక్తులు ఆమెకు పుష్కలంగా వున్నాయి. ఎందుకంటే ఒక దశంలో బిఆర్‌ఎస్‌కు సమాంతరంగా జాగృతిని నడిపిన అనుభవం ఆమెకు వుంది. ఇప్పుడు పార్టీ పెట్టినా నడిపించే శక్తి ఆమెకు వుంది. అందుకే ఒక మహిళలా తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక స్ధానం వుండాలని, ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం సొంత పార్టీ వల్లనే దక్కుతుందని తెలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనుకు తాను ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే తప్ప నిలబడలేనని కవిత గుర్తించినట్లున్నారు. పార్టీ కోసం త్యాగం చేసుకుంటూ పోతే రాజకీయంగా వెనుకబడిపోయే ప్రమాదాన్ని ఆమె గమనించారు. తనకు తన సొంతపార్టీలో అడుగుడునా ఎదురౌతున్న అవమానాలు దిగమింగుకుంటూ వుండడం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇష్టం లేదు. అందుకే ఆమె దూకుడు పెంచింది. నిజం చెప్పాలంటే ఆమె 2014కు ముందు బిఆర్‌ఎస్‌ నాయకురాలు కాదు. కార్యకర్త అసలే కాదు. అలా తన సొంత బలాన్ని, బలగాన్ని నమ్ముకొని ఆది నుంచి తనకంటూ ఒక ఇమేజ్‌ను బిల్డప్‌ చేసుకన్న నాయకురాలు కవిత. తండ్రి చాటున బిడ్డే అయినా కేసిఆర్‌ రాజకీయంలో ఓనమాలు నేర్చుకోలేదు. కొన్ని లక్షల మంది తెలంగాణ వాదులలో ఆమె ఒకరుగా నిలబడ్డారు. చెట్టు పేరు చెప్పుకొని ఆయన ఎప్పుడూ రాజకీయం చేయలేదు. తనను కేసిఆర్‌ కూతురుగా గుర్తింపు కన్నా, జాగృతి కవితగానే గుర్తించాలని కోరుకున్నారు. తెలంగాణ బతుకమ్మ అంటే కవిత అనేంతగా ఆమె తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారు. కేసిఆర్‌ నీడలో ఆమె రాజకీయాలు చేయాలనుకోలేదు. తెలంగాణ ఉద్యమానికి ఆమె చేసిన సేవను గుర్తించి, 2014లో బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది ఇతర పార్టీల నుంచి చేరారు. కాని కవిత తెలంగాణ వచ్చే వరకు ఆమె ఏ పార్టీకి చెందిన నాయకురాలు కాదు. స్వతంత్ర బావాలున్న నాయకురాలు. అందుకే కేసిఆర్‌ కూతురైనా సరే ఆమె పార్టీ పేరు ఏనాడు చెప్పుకోలేదు. ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్‌ కండువా ఎక్కడా కప్పుకోలేదు. కేసిఆర్‌ జేఏసి ఏర్పాటు చేసిన తర్వాత ఆమె జేఏసి కండువాతో ఉద్యమం చేశారే గాని, బిఆర్‌ఎస్‌ కండువాతో రాజకీయం చేయలేదు. తెలంగాణలోని బడుగుల రాజ్యాధికారం కోసం మరోసారి రాజకీయ, సామాజిక బాద్యతను ఎత్తుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version