అలియాబాద్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం…

అలియాబాద్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

 

 

మండలంలోని అలియాబాద్ గ్రామంలో విద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ తో పాటు గ్రామ వీధుల్లో పర్యటిస్తూ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ విద్యుత్ వినియోగంపై బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. విద్యుత్‌ను సక్రమంగా వినియోగిస్తూ బిల్లులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని సూచించారు.అలాగే విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ…

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

గుండాల మండల నూతన తహసీల్దార్ గా ఖాసీం బుధవారం బాధ్యతలను స్వీకరించారు . నూతన తహసీల్దార్ ఖాసీం ను తహసీల్దార్ ఆఫీస్ స్థాఫ్ సన్మానించి, స్వాగతం పలికారు.

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్…

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు..,
కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు…!వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి, తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ ను చేర్చాడు‌. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు.
సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన, కష్టం .. తనను కదిలించిందని, తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ..పని చేసానని కానిస్టేబుల్ అలీమ్ తెలిపారు‌.
ఈ..రోజు ఉదయం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి, అతనిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు..
జిల్లా పోలీస్ బాస్ గా అనేక రకాల పనుల వత్తిడిలో ఉన్నప్పటికీ…, తన సిబ్బంది పనితీరును గుర్తించడం, వారిని ప్రశంసించి, ప్రోత్సహించడమే కాక, స్వయంగా తానే కానిస్టేబుల్ ను సత్కరించి అభినందించడం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పెద్దమనుసు కు ఒక ఉదాహరణ అని అక్కడ ఉన్న రైతులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రశంసించారు‌. ఉన్నతాధికారులు తీసకునే ఇలాంటి నిర్ణయాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనను కలిగిస్తాయని పలువురు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు కృతజ్ఞతలు తెలిపారు‌..
ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T162638.744.wav?_=1

 

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాను ఎగరవేసినారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకం
ఎగరవేసారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్
ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని
సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి
ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో
పాఠశాల
ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే..

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే-

డిఇఓ. వాసంతి

శాయంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. 25-7-2025 రోజున జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల పత్తిపాక కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధం గా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొం డ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ మన్మో హన్,మండలవిద్యాశాఖ అధి కారి భిక్షపతి, ఉన్నత పాఠ శాల ఇన్చార్జి ప్రధానోపా ధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్,ఆర్ పిలు అం జని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్, పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.

District Collector Dr. Satya Sarada.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం లో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కలెక్టర్ తో పాటు మిగతా అధికారులంతా మొక్కలు నాటారు.కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలని,ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రకృతిని,పచ్చని వాతావరణాన్ని పెంపొందించుకోవాలని,ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలని తెలియజేశారు.ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో పాటు డిఆర్ డిఓ కిషన్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,ఈసీ,టిఏ,పంచాయితీ కార్యదర్శి,ఈజీఎస్ సిబ్బంది,ఐకెపి సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది

రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి దాత్రి

 

shine junior college

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువల యందు
జిల్లా విద్యశాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేసముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మరియు జిల్లా విద్యశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.

ప్రభుత్వ బడులు సామాజిక వారసత్వ సంపదను పెంపొందిస్తాయని, పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ మరియు నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందని, తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అలాంటి ఊరుబడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందించే ఉచిత పథకాలను ఆదరించిన విధంగానే ప్రభుత్వ బడులను కూడా ఆదరించాలని, ప్రజలందరూ తమ పిల్లలను ఊరి పాఠశాలలోనూ చేర్పించాలని కోరారు. కలువల ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లవాణ్ణి చేర్పించిన యుపిఎస్ నరసింహుల గూడెం ఉపాధ్యాయులు ఎస్ కే సయ్యద్ను ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే తేజస్విని, వై వెన్నెల మరియు జి శివాని లను కూడా అభినందించారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించిన
వై వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, 3016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ను, మిగతా ఉపాధ్యాయులను డిఇఓ రవీందర్ రెడ్డి ,సంజీవరెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం, బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ కూడలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గిద్దె రాం నరసయ్య మరియు బండ వెంకన్నల బృందం ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు ఏకాంబరం, తండా సదానందం, ఎం యాకాంబరం, ఆర్ బిక్షపతి బాలషౌరెడ్డి , వి రాజేంద్ర చారి, కే రాములు, మార్గం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ ,
వి రాము, కే పార్వతి, ఎండి జుబేర్ అలీ,
జి నాగరాజు,ఏ లింగయ్య,.,గోపి ..స్వరూప, శ్రీదేవి, హరికృష్ణ, కృష్ణ, మోహనకృష్ణ సిఆర్పి ఉదయ్, రాధ..నవీన్ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మునికుంట్ల ఐలేష్, ఎం భరత్, పరమేష్, బి .యాద గిరి, డప్పు యుగంధర్, వంగూరి శ్రీనివాసరావు, దేశెట్టి ప్రవీణ్ కుమార్ , అశ్విని, అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం వేడుకలు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ రేంజ్ అధికారి రవి అన్నారు. గురువారం రోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ అటవీ శాఖ రేంజ్ తో పాటు డివిజనల్ అధికారులు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి రవి మాట్లాడుతూ, పచ్చదనం పర్యావరణ మానవ జీవనశైలిలో ఎంతో ప్రాముఖ్యత తో పాటు ఆరోగ్య రక్షణ కూడా కలిగిస్తుండని, పచ్చదనాన్ని కాపాడుటకు చెట్లు అడువులను రక్షించడం అటవీ శాఖ తోపాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, కుటీర పరిశ్రమల ద్వారా అందించే సంచులను వాడాలని సూచించారు. అడవుల్లో ప్లాస్టిక్ సంచులు,బాటిల్స్, అడవుల్లో వేయకూడదని, అడవుల్లో వృక్షాలను నరకకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పాటించాలని, అడవుల రక్షణ ప్రకృతి పరిరక్షణ మానవ మనుగడకు ముడిపడి ఉందన్న విషయం, ప్రజలంతా గుర్తుంచుకోవాలని అన్నారు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ రేంజ్ తో పాటు సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది, పర్యావరణం ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ నిషేధించాలని అటవీ శాఖ కార్యాలయం నుండి ,అటవీ శాఖ అందించిన ద్విచక్ర వాహనాలపై సిబ్బంది అధికారులు మండల కేంద్రమంతా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలు అటవీ శాఖ సిబ్బంది పచ్చని రంగు ద్విచక్ర వాహనాల ర్యాలీ ప్రదర్శన, ప్రకృతి అందంలా తలపించింది, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో,ఎఫ్ ఆర్ ఓ రవి , డిఆర్ఓ రాజేశ్వర్, ఎఫ్ ఎస్ ఓ,లు. వరుణ్,ఆనంద్,తిరుపతి సుమన్, హసన్ ఖాన్, ఫయాజ్ అహ్మద్, అఫ్జల్,ఎఫ్ బి ఓ లు సదానందం, దిలీప్, అంజయ్య, విటల్,సురేందర్ సంజీవ్ అనిల్ రాజశేఖర్, త్రివేణు తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

 

మేడిగడ్డ బ్యారేజ్ నేటి ధాత్రి:

 

 

 

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

 

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత.

మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజా మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజ,ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ,మనుషుల అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని ప్రజ్వల స్వచ్చంద సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో గీతానగర్ ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు శైలజా, పద్మజ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య. దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారు. సమాజంలో ప్రజలతో మరియు విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహనా కల్పించాలి, ముక్యంగా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్స్ లో వారికి అవగాహనా కల్పించాలి. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణలా తో పాటు, సామజిక కారణాలు దోహదం చేస్తాయి, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వాళ్ళను ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహలలో అమ్ముతున్నారు, కాబట్టి మన డిపార్ట్మెంట్ జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అందరు అవగాహనా కలిగి ఉండి, అప్రమతం చేయడం ద్వారా దీన్ని నిర్ములించవచ్చు.

బలరామ కృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చు, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు. ముక్యంగా యువత, పిల్లలు ఆకర్షణకు గురి అయి, పట్టణాలకు వచ్చి వ్యభిచార గృహలలో అమ్మబడుతున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలను మహిళలను కాపాడడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సైబర్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అక్రమ రవాణా చాలా పెరిగి పోయింది, ముక్యంగా విద్యార్థులు అనవసరం అయినా అప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారు. మీరు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న మన సిబ్బంది ఈ విషయాలపై అవగాహనా పొంది ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు.

ఈ శిక్షణలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం ఎలా జరుగుతుంది, బాధితురాలి పైన ఉండే ప్రభావాలు, సైబర్ అదారిత అక్రమ రవాణా, చట్టాలు BNS, ITPA, POCSO, PCMA, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 ల గురించి చెప్పడం జరిగినది.ఈ శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు శైలజా , పద్మజ, ప్రజ్వల ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ ప్రజ్వల సిబ్బంది అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్ సింగ్,మరియు రాజన్న సిరిసిల్ల నుండి kGBV,Model school, ఊరు,TREIS స్కూల్ నుండి school assistant teacher పాల్గొన్నారు.

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి.

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన శంకర్ సిరిసిల్ల టౌన్ ప్రస్తుతం, లక్పతి వేములవాడ రూరల్ మోతీరం,బోయినపల్లి లను ఎస్పీ మహేష్ బి గితే అభినందించినారు.ఈసందర్భంగా ఎస్పి మహేష్ బి గితే మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలనిఅన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయనిఅన్నారు.

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజు..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

 

బాల్యవివాహాలను అరిక ట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్టెట్స్ ఫర్ చిల్డ్రన్స్ విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగరీ కైలాస్ ఆదేశానుసారం బాల్య వివాహాలపై జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రా ల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Coordinator Raju.

 

ఈ సం దర్భంగా రాజు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యా చారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రూ. లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

Coordinator Raju.

ఈ సందర్భంగా ఆలయాలు, చర్చిలు మజీద్ లలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.
ప్రతిజ్ఞ చేస్తున్న భక్తులు, పూజారులు.
వంగరీ కైలాస్
విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి

సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి:-

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ :-

హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా, ఒక వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తి సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. ఆ తరువాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయితే 2023వ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు.

Community

ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం భార్యాభర్తల మధ్య ఈగో లు వారి మధ్య వివాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయని వీటిని సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానాలలో కేసులు ఉంటే, ఇరుపక్షాలలో ఒకరు గెలిస్తే మరొకరు పైకోర్టుకు వెళ్తారని కానీ కమ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిష్కారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని ఇటువంటి గురుతర బాధ్యతను పెద్దలు తమ భుజస్కంధాల మీద వేసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో ఒక విశ్రాంత వైస్ ఛాన్స్లర్ కమ్యూనిటీ మీడియేటర్ గా సాధించిన విజయాలను వివరించారు. కలహిస్తున్న భార్య భర్తలకు ఒక తండ్రి లాగా తాత లాగ నచ్చచెప్పి వారిని కలిపినట్లు ఆయన చెప్పారన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ ఏడవ తారీకున కామారెడ్డి లో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, సి.హెచ్. రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమా దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన.!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునికి ఉంది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు…
ములుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి నేతృత్వంలో కొత్తగూడ మండలంలోని బుధవారం రోజు తాటి వారి వేంపల్లి.
మాసంపల్లి తండా.
గోపాలపురం కార్లయి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు
అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యచరణ రూపొందించిందని బిజెపి తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల ఇన్చార్జి బానోత్ రూఫ్ సింగ్ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారు
ప్రతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
చల్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు.
బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కాడబోయిన జంపయ్య వైస్ఎంపీపీ.
బొల్లు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
కాయితోజు ఉపేంద్ర చారి బ్లాక్ కమిటీ నాయకులు. నోముల ప్రశాంత్ జిల్లా యూత్ నాయకులు. కే దాసు ప్రసాద్ క్లస్టర్. తాటి వారి వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షురాలు తాటి వసంత.
కార్లయి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇర్ఫ వెంకన్న.మాసంపల్లి తండా గూగుల్ భీమా. గోపాలపురం అధ్యక్షులు సుధాకర్ శ్రీను. తాటి వారి వేంపల్లి సోలం వెంకన్న కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version