ఉత్తమ విద్యార్థి కి హోప్ ఫౌండేషన్ ప్రోత్సాహాం …..
హోప్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-
సేవే లక్ష్యంగా 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు కాబడ్డ హోప్ ఫౌండేషన్ సేవలు నిరంతరం కొనసాగడం పట్ల భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్ పేర్కోన్నారు . శనివారం చందానగర్ హోప్ ఫౌండేషన్ కార్యాలయం లో 7 వ తరగతికి చెందిన కార్తీక్ చదువులో రాణించడంతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉంటునందుకు హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 20 వేల రూపాయలు నగదును చైర్మెన్ కొండ విజయ్ కుమార్ బ్యాంక్ అధికారుల చేతుల మీదుగా అందజేశారు . హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం వేలాది మంది కీ భోజనాలు తో పాటు.క్రీడరంగంలో , వీద్యాలో రాణిస్తున్నా విద్యార్థులకు సహాయం అందచేయడంతో పాటు వైద్య ఖర్చుల విషయంలో సహాయం చేయడం తదితర సేవలను బ్యాంక్ అధికారులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు అశోక్ , అన్నె సందీప్ తదిఅన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న 2000 మంది…..
హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద భోజన కార్యక్రమం 145 పూర్తి చేసుకుంది. 145 వ శనివారం అన్మదాన కార్యక్రమంలో సుమారు 2000 వేల మంది పాల్గొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం చేపడుతున్న అన్నదానం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం పనులు చేసుకుంటూ జీవనం గడిపే తమకు ప్రతి వారం ఉచిత భోజనం అందజేయడం పట్ల హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు .
తరులు పాల్గొన్నారు.