లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవం.

కన్నుల పండువగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు డింగరి సత్యనారాయణ చార్యులు, కిరణాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈకళ్యాణోత్సవంలో మోర బద్రేశం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, దాసరి బాబు అనురాధ దంపతులు స్వామివారికి పుస్తె మట్టలను అందజేశారు. వెంకటేశ్వర ఆలయం నుండి స్వామి వారిని ఎదుర్కొని ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కన్నుల పండుగగా, అంగరంగా శ్రీలక్ష్మినరసింహస్వామి కళ్యాణం కొనసాగింది. కళ్యాణ ఉత్సవం అనంతరం భక్తులు మహిళలు కొబ్బరికాయలు కొట్టి పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకళ్యాణోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తిరుపతి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, మాల స్వాములు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు ఆహ్వానం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యందు బ్రహ్మోత్సవాలు మార్చి 09 తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుని ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో మహేష్,చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో అందించి జాతర వేడుకలు పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version