మండల కేంద్రంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం రోజున అఖిల భారత యాదవ సంఘం మరియు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును కొందరు భక్తులు కృష్ణాష్టమి అని మరికొందరు గోకులాష్టమని, అష్టమి అని పిలుస్తారు, కృష్ణాష్టమి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను వివిధ ఆచారాలతో సంప్రదాయాలతో జరుపుకుంటారు, మండల కేంద్రం లోనీ గుల్లలో భక్తులు ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించి భవద్గీత సారాంశాన్ని భక్తులకు, ప్రజలకు పురోహితులు తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం నాయకులు వీధులలో ఉట్లు కొట్టడం, పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు కృష్ణుడు, గోపిక వేషధారణలు వేసి నృత్యాలను చేపించారు. కార్యక్రమంలోసందన వేన మహేందర్ నాథ్ యాదవ్ చల్ల ఓదెలు కన్నెబోయిన ఐలయ్య పరిషబోయిన నగేష్ యాదవ్ కాట్రేవుల నవీన్ పిడుగు బాపు సిద్ధిశంకర్ మరియు కుల సంఘాల నాయకులు పెద్దలు హాజరు కావడం జరిగింది
