విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే…

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్ గురువారం జగిత్యాల లో జరిగిన ఇట్టి టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి బబ్బిలి అక్షయ్’గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గౌరవ కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T150357.474-2.wav?_=1

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ

సిరిసిల్ల టౌన్: ( నేదిధాత్రి)

 

సిరిసిల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా 2025- 26 సంవత్సరానికి గాను హిందీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మరియు ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణను అభినందించడం జరిగినది. గోలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంత మంచి అవార్డు ఎంపికైనందున ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాని మరియు ప్రభుత్వానికి గాని మరియు సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయులు,నాయకులు,అభినందించారు.

సీనియర్ ఫోటోగ్రాఫర్ కీ ఆత్మీయ సత్కారం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T151053.887.wav?_=2

 

సీనియర్ ఫోటోగ్రాఫర్ కీ ఆత్మీయ సత్కారం

మందమర్రి నేటి ధాత్రి

 

జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ వారి 15 వ వార్షికోత్సవం సందర్భంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో భాగంగా
జి ఆర్ మెమోరీయల్ వెల్ఫేర్ సొసైటీ
ఫౌండర్ చైర్మన్ నరేష్, సెక్రెటరీ శ్రీనివాస్ గుప్తా గార్లచే ఆత్మీయ సత్కారం. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ వడ్లకొండ కనకయ్య గౌడ్ కి
ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నిజాంబాద్ ఈ ఎక్స్ జెడ్పి చైర్మన్ విట్టల్ రావు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ సార్ రాష్ట్ర కోశాధికారి మాధవ రెడ్డి గారు, జగిత్యాల జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్ రామ్మోహన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అప్పసు రాము. ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి నస్పూర్ మండల అధ్యక్షులు అగ్గు సాగర్ గారు నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-35-5.wav?_=3

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో

డాక్టర్ పట్ట పొందిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

గ్లోబల్ అక్రిడే షన్ యునైటెడ్ నేషన్..నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పాండిచ్చేరిలో డాక్టర్ రేట్ పట్ట పొందారు25 సంవత్సరాలుగా వనపర్తి జిల్లా ప్రజల సమాజ సేవకు, ప్రజా సమస్యలపై 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని సతీష్ తెలిపారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కౌన్సిలర్,గా సేవలు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడం హరితహారం లో ఒకేసారి మూడు వేల చెట్లు నాటడం ప్లాస్టిక్ వ్యతిరేకంగా బట్ట సంచులు ఉచితంగా ప్రజలకు పంచడం.కరోనా సమయంలో పోలీసు శాఖకు , మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేయడం కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడం ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ప్రజా సమస్యలపై పోరాడడం అనేక సేవ లకు గురించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పారు.
శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పట్టా అందజేశారు
డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శ్రీ కృష్ణాష్టమి రోజున పట్ట అందుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు
గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు*

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-7.wav?_=4

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పై
ది కొండా రమేష్ కు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐకి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును
అందించారు.

గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం.

జర్నలిస్టు క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం

మందమర్రి నేటి ధాత్రి

తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేతృత్వంలో….

పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానోత్సవం

Journalist Kranti Kumar

అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లోని రామయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేకడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ మహానంది అవార్డు – 2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.

నారాయణగిరి వాసి “వక్కల వెంకటస్వామి”కి డాక్టరేట్ అవార్డు

నారాయణగిరి వాసి “వక్కల వెంకటస్వామి”కి డాక్టరేట్ అవార్డు.

చెన్నైలో అవార్డు ప్రధాన.

జర్నలిజంలో, సేవా కార్యక్రమంలో ముందు వరసలో “వెంకటస్వామి”.

వైస్ ఛాన్స్లర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం.

“వెంకటస్వామి” కి అభినందనలు తెలిపిన “వక్కల” శ్రేయోభిలాషులు.

 

 

“నేటిధాత్రి”,హనుమకొండ:
హనుమకొండ జిల్లాలోని నారాయణగిరి గ్రామానికి చెందిన వక్కల వెంకటస్వామికి విశిష్ట గౌరవంగా డాక్టరేట్ అవార్డు లభించింది. గత రెండు దశాబ్దాలకు పైగా ప్రజల సమస్యలను సమర్థవంతంగా వెలికి తీసే నిబద్ధతతో జర్నలిస్టుగా, సంపాదకునిగా పనిచేస్తూ సామాజిక హితాన్ని లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తున్నారు.

 

 

 

వెంకటస్వామి అనేక సంవత్సరాలుగా తనకు అందిన సమాచారాన్ని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, అవినీతి, అక్రమాలపై స్పష్టమైన వైఖరితో శబ్దం లేని వేదనకు స్వరం లాంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న పత్రిక, వార్తా వ్యవస్థలు నిస్వార్థంగా ప్రజల తరపున నిలబడి ధైర్యంగా సమస్యలను వెలికి తీయడంలో ముందుండుతున్నాయి.

 

 

కేవలం జర్నలిజంతోనే కాక, “నా వివేకం” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాధలు, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు తనవంతుగా సేవలందిస్తూ, తన సామర్థ్యాన్ని మానవత్వ సేవకే అంకితం చేశారు. విద్యా సామగ్రి, దుస్తులు, ఆహార సరఫరా సహా ఇతర అవసరాల విషయాల్లో సహకారం అందిస్తూ నిస్వార్థ సేవా మార్గంలో పయనిస్తున్నారు. యువతలో సామాజిక చైతన్యం కలిగించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వారి మాటలు, ఆచరణలు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

 

 

 

ఈ సేవలను గుర్తించి, అమెరికాలోని డెలివేర్ రాష్ట్రానికి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు వక్కల వెంకటస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన అతిథుల సమక్షంలో వైస్ ఛాన్సలర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందించారు.

 

 

 

వెంకటస్వామి చేసిన సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక పక్షపాత రహిత ప్రజాప్రతినిధిగా, సామాజిక సేవా పథంలో అగ్రగామిగా ఆయన చేసిన కృషికి గౌరవంగా లభించిన ఈ పురస్కారం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందించారు.

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము.

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం 2025 గాను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవనంలో గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తిడాక్టర్ రాధా రాణి, తెలంగాణ కళా రత్న బిక్కి కృష్ణ, గిడుగురామా మూర్తి సంస్థ ఫౌండేషన్ దివాకర్ బాబు,కాంతి కృష్ణ అధ్యక్షుడు, సినిమా రచయిత డాక్టర్ సరళ సినిమా రచయిత విశ్వపుత్రిక గజల్ డాక్టర్ విజయలక్ష్మి పండిత్, వారి చేతుల మీదుగా మారుపాక కృష్ణ కు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.

శంకర్ కు ఉత్తమ అవార్డు.

శంకర్ కు ఉత్తమ అవార్డు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఎంఈఓ శంకర్ కు మల్టీ జోనల్-2లో ఉత్తమ పర్యవేక్షణ విద్య అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాదులో ఎస్సిఆర్టి డైరెక్టర్ రమేశ్, ఆర్జేడి విజయలక్ష్మి చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న శంకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు రావడంతో ఉపాధ్యాయులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ కు పనితీరు అవార్డు

ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ కు ఉత్తమ పనితీరు అవార్డు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ),మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గా పనిచేస్తున్న గోగు సురేష్ కుమార్ గురువారం ఆ సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని టీజీ ఎఫ్ డీసీ డివిజన్ కేంద్ర కార్యాలయమైన కాగజ్ నగర్ లో గురువారం జరిగిన కార్యక్రమం లో ఈ అవార్డు అందుకున్నారు.టీ జీ ఎఫ్ డీసీ ఏర్పడి దశాబ్ది కాలం పూర్తి అయిన సందర్బంగా ప్లాంటేషన్ ల నిర్వహణ లో ఉత్తమ పనితీరు కు గాను ప్రోత్సాహకంగా ఈ అవార్డు అందజేసినట్లు ప్లాంటేషన్ గోగు మేనేజర్ సురేష్ తెలిపారు.

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్.

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల సునీత-మహేందర్ గౌడ్ దంపతుల కుమారుడు వేముల సాయి చరణ్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) హన్మకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవార్డుకు వేముల సాయి చరణ్ గౌడ్ ఎంపికైనాడు. కాగా ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ లో నిర్వహించిన గౌడ ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు..కాకతీయ యూనివర్సిటీ ఈసీ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ దంపతులు, మరియు హన్మకొండ గోపా గౌరవ అధ్యక్షులు..గౌడ ప్రతిభా పురస్కార్ ప్రోగ్రాం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు, మెమొంటో ఇచ్చి, ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సాయి చరణ్ గౌడ్ మాట్లాడారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు కష్టపడి చదువుతానన్నారు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు.

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బస్వ రాజుపల్లి గ్రామానికి చెందిన కుక్క ముడి పోచమ్మ పోశయ్య కుమారుడు కుక్క ముడి సంపత్ వైద్య రీత్యా కొత్తగూడెం లో నివసిస్తున్నారు ఈయన గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి కుక్కమూడి సంపత్ ను రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక రాజు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు కు సుపరిచితులుగా ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తూ పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు డయాబెటిస్ రోగులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఏర్పాటు చేస్తున్నారు సంపత్ కు ఈ అవార్డు దక్కడం పట్ల బస్వ రాజు పల్లి కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు దక్కిన పురస్కారం గా అభివర్ణించారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని కోరుకున్నారు

దళిత రత్న అవార్డు ప్రధానం.

‘దళిత రత్న అవార్డు ప్రధానం’

బాలానగర్ నేటి ధాత్రి:

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా.. హైదరాబాదులోని సికింద్రాబాద్ బల్మర్ క్లాసిక్ గార్డెన్ లో సోమవారం దళిత రత్న అవార్డుల ప్రధానం చేశారు. బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కళ్లెం యాదయ్యకు దళితరత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు ఉత్సవాల సందర్భంగా తనకు దళిత రత్న అవార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ గ్రహీత.

ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ గ్రహీత

పత్తిపాక గ్రామ నివాసి రామాంజనేయులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ నివాసికి ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డు లభించింది.హైదరాబాద్‌లోని ఎఫ్ టిసిసిఐ హాల్‌లో జరిగిన సమావేశంలో ఇంపాక్ట్ ఇంటర్నే షనల్ రీజియన్ 11-పాత మహబూబునగర్, కర్నూ ల్ ,అనంతపూర్, కర్ణాటక నుండి ఇంఫాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణం.

International

ఈ గుర్తింపు నా జీవిత ప్రయాణంలోఒక టీచర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రతిభావంత మైన మోటివేషనల్ స్పీకర్‌గా ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇది కేవలం ప్రారంభ మాత్రమే అని నేను నమ్ముతు న్నాను. అవార్డు గ్రహీతకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గంపా నాగేశ్వర్ రావు ఫౌండర్, ఇంపాక్ట్ ఇంట ర్నేషనల్ నూనే సుదర్శన్, మాధవి, రవీంద్ర ధీర రీజినల్ ప్రెసిడెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి గోవింద శ్రీనివాస్, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ కుమార్, ఉప్పు ఆంజనేయులు, బాదం రాఘవేందర్, చెదిరే శ్రీనివాస్, నీలా కోటి, మాచిపెద్దిరవి తదితరులున్నారు.

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం.!

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా అవార్డును బహూకరించారు.భారతీయ భాషలు, సాహిత్యంలో కృషి చేసిన యువ పరిశోధకులు, రచయితలను సత్కరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ అనురాధ లోహియా మాట్లాడుతూ, “ఈ యువ అవార్డు గ్రహీతలు భావి సమాజ చైతన్యానికి మార్గదర్శకులు. వీరి సాహిత్య కృషి భారతీయ భాషల సంరక్షణ, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (పార్ట్‌టైమ్)గా సేవలందిస్తున్నారు. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దళిత ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తిచేశారు. ‘నానీల సుగుంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించిన ఆయన, యుజిసి కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.తెలుగు భాష, సాహిత్యంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డు వారి పరిశోధన, సాహిత్య సేవలకు గుర్తింపు గా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version