గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.