రమణన్న బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఆకుదారివాడ, ఫకీర్ గడ్డలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మున్సిపాలిటీ విషయానికి వస్తే మనం అక్కడ కేవలం మాటలకే పరిమితం కాలేదు.
మున్సిపాలిటీని తీసుకురావడం మాత్రమే కాదు 30వార్డులో అన్ని రోడ్లు, సైడ్రైన్ లు, సెంట్రల్ లైటింగ్ వంటి మెరుగైన వసతులు, ప్రతి ఇంటికి మంచినీటి వసతి తో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది.
కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మేడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, విద్యుత్, రహదారులు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి ఇలా ప్రతి రంగంలో తెలంగాణను ముందుకు నడిపించిన ఘనత కేసీఆర్ దే.
“కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అందుకే నాకు ఓటు వేయండి” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
టిడిపి పార్టీ నుండి వచ్చి అడ్డదారులో పదవులు చేపట్టిన రేవంత్ రెడ్డి కి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
నిన్నటివరకు టీడీపీ పార్టీలో ఉండి, అక్కడి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన ఉందా లేదా అనేది గుర్తేరగాలే.
తెలంగాణ ఉద్యమ సమయంలో రమణారెడ్డి కాంగ్రెస్‌లో ఉండగానే తెలంగాణ వస్తుందని, ప్రజల మధ్య తిరుగుతూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాటం చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇది దురదృష్టకరం.
తెలంగాణ ప్రజలు ఎవరు రాష్ట్రం కోసం నిజంగా త్యాగాలు చేశారో, ఎవరు అధికారానికి కోసం మాటలు మార్చుకుంటున్నారో బాగా తెలుసు. ప్రజలను మోసగించే రాజకీయాలను ఇకనైనా ఆపాలి.
రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలపైన ప్రేమ లేదు ఆయన కుర్చీ మీద అపారమైన ప్రేమ ఉంది.
అందుకే అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం, అబ్బద్దాల పునాదులపై నిలిచిన కాంగ్రెస్ పార్టీని పునాదులు కదిలించాలి అంటే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి మీ అందరి కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
