ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగూర్ల ఎన్నిక…

ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగూర్ల ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ తరఫున ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాప్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి నాగూర్ల వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం రైతు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలను గుర్తించి, పరిష్కార దిశగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫర్టిలైజర్ రంగంలో ఉన్న అనుభవం,సేవాభావం, నాయకత్వ లక్షణాలతో నాగూర్ల వెంకటేశ్వర్లు ఈ పదవికి పూర్తిగా న్యాయం చేస్తారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షుడు వరికేల కిషన్ రావు తెలిపారు.

వరంగల్‌లో వ్యవసాయ అధికారి చేతుల మీదుగా కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ

క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ అధికారి

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన క్యాలెండర్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, జిల్లా నాయకులు సుగుణ సుధాకర్,చౌల రామారావు, హింగే రవీందర్,అంబరి శ్రీనివాస్,సురావు బాబురావు, అలాగే నడికూడ,పరకాల, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు వంకే రాజు, బిక్షపతి,మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్ మాధవరావు,రైతు నాయకులు లోనే సతీష్ తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నూతన క్యాలెండర్ రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు.

రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి..

రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

 

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయించడం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రైతు రక్షణ సమితి వరికేల కిషన్ రావు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టి యూరియా బుకింగ్ చేయించడానికి తప్పనిసరి చేసింది.ఈ నిర్ణయం వల్ల మా జిల్లాలోని చాలా మంది రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రైతులకు కలుగుతున్న ఇబ్బందులు
స్మార్ట్ ఫోన్/ఇంటర్నెట్ లేకపోవడం చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల యాప్ లో బుకింగ్ చేయించడం సాధ్యం కావడం లేదు వృద్ధ వయస్సు రైతులకు ఇబ్బంది,చదువు తక్కువ ఉన్న రైతులు యాప్ ని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నారు.
సమయం,డబ్బు వృధా ప్రతి రైతు కు విడిగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండడం వల్ల సమయం, డబ్బు రెండూ వృథా అవుతాయి డీలర్ల నుండి ఎరువులు లభించకపోవడం యాప్ లో బుకింగ్ చేయించినా కొంతమంది డీలర్లు సరిగా ఎరువులు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వానికి కోరికలు
ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి కింది కోరికలు తెలియజేస్తున్నాము
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తప్పనిసరి నిబంధనను సడలించి,రైతులు ఆఫ్ లైన్ లో కూడా యూరియా బుకింగ్ చేయించే వీలు కల్పించాలి
ప్రతి గ్రామంలో ఒక స్థానిక సహాయకుడు (ఉదా: సర్పంచ్,వ్యవసాయ సహాయకుడు,గ్రామ సచివాలయ సిబ్బంది) ద్వారా యాప్ లో బుకింగ్ చేయించే వీలు కల్పించాలి.
యాప్ లో బుకింగ్ చేయించిన రైతులకు డీలర్లు సకాలంలో ఎరువులు ఇవ్వాలని బలమైన నియంత్రణ పెట్టాలి.
యాప్ ని సరళంగా, తెలుగులో ఉండేలా చేసి, రైతులకు శిక్షణ ఇవ్వాలి.
చివరి హెచ్చరిక
ఈ పరిస్థితి సాగితే రైతులు సకాలంలో యూరియా పొందలేకపోతారు,దీని వల్ల పంటలకు హాని చేకూరుతుంది.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సులభంగా,సురక్షితంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి….

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి

 

సోమవారం నాడు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సూపర్డెంట్ కి సోమవారంనాడు వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఈ కార్యక్రమంలో వీరి వెంట (ఏఐటియుసీ)కార్మిక సంఘం నాయకులు లంక దాసరి అశోక్,రైతునాయకులు సురావు బాబురావు,సురావు కిషన్ రావు,కోడం రవీందర్, రఘుపతి పలువురు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version