నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన..

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామంలో పలు పంటలను వ్యవసాయ అధికారి వెంకటేశ్ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో నాణ్యమైన విత్తనాలు సంబంధించిన పెసర పంటను సందర్శించడం జరిగింది ప్రస్తుతం పెసర పంట 60 రోజుల దశ లో ఉంది దీనికి పోతదశలో ముఖ్యంగా పోషకాల లోపం లేకుండా 19:19:19 ఒక కిలో ఎకరానికి మరియు పత్తి. పంటను సందర్శించడం పంటల దిగుబడికి విడతల వారిగా కాంప్లెక్స్ ఎరువులు
మరియు ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించాలి నానో యూరియా స్ప్రే చేసుకోవాలి ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారి హరి కృష్ణ, రైతులు రమేష్, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల పుణ్యమా అంటూ లక్షల్లో నష్టపోయిన రైతన్న…

నకిలీ విత్తనాల పుణ్యమా అంటూ లక్షల్లో నష్టపోయిన రైతన్న…

నకిలీ విత్తనాలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతన్న…

నకిలీ మొక్కజొన్న విత్తనాలతో అన్నదాతకు నష్టాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-73.wav?_=1

నేటి ధాత్రి -మహబూబాబాద్ -బయ్యారం:-

అధిక దిగుబడి వస్తుందని,వ్యవసాయం లాభసాటిగా మారుతుందని భావించిన రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతూ మోసం చేస్తున్నారు.పంట ఏపుగా వస్తుందని భావించి దుకాణదారుడు విక్రయించిన విత్తనాలు 40 రోజులు దాటిన పంట ఎదుగుదలలో మార్పు రాకపోవడంతో రైతన్న ఆవేదన చెందుతున్నారు.పెరిగిన మొక్క ఒక్కొక్కటిగా కళ్ళముందే చనిపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.బాధిత రైతు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న ఏడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.మొక్కజొన్న పంట సాగు నిమిత్తం మదీనా ట్రేడర్స్ వద్ద నుండి పైనియర్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేశారు.

Fake corn seeds.

నాటిన విత్తనాలు 40 రోజులు దాటినప్పటికీ ఎదుగుదల రాకపోవడంతో రైతు కన్నీటి పర్యంతమైనారు.భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుకు మొక్కలు ఒక్కొక్కటిగా చనిపోవడంతో భార్య, భర్తలు పంట చేలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని రైతు వాపోయాడు.తనకు కాలం చెల్లిన నకిలీ విత్తనాలను విక్రయించి,మోసం చేసిన సదరు మదిన ట్రేడర్స్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కౌలు రైతు వెంకన్న డిమాండ్ చేశారు.నష్టపోయిన మొక్కజొన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తమకు చావే శరణ్యమని రైతు వాపోయాడు.నకిలీ విత్తనాలను అంటగడుతూ రైతును నిండా ముంచి, పంట నష్టానికి కారకుడైన సదరు వ్యాపారస్తుడిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు,రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి.

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

నేటి ధాత్రి గార్ల:

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల వెంకన్న మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కట్టేబోయిన పిచ్చయ్య, చౌకాల బిక్షం, కట్టెబోయిన శ్రీను, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

అమ్మిన సాగుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్ రకం పత్తి విత్తనాలను అమ్మిన సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు,రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు షాప్ యజమానులు నుంచి తీసుకోవాలి అని అన్నారు,ఈ తనిఖీ లో ఏడి ఏ రమేష్.వ్యవసాయశాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలి…

కల్తీ విత్తనాల బెడద రైతుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది…

రైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ 

 

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Seeds

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాబన్న, గౌని భద్రయ్య,వీరభద్రం, మాన్య తదితరులు పాల్గొన్నారు.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

#మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు.

#నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత విత్తనాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే దళారులు ఇష్ట రీతిన నిషేధిత విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిషేధిత బీ టీ 3 విత్తనాలు వేయడం వల్ల రైతులు అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన చేయకపోవడంలో విఫలమైనరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు మారుమూల గ్రామాలలో విత్తనాలను డంపింగ్ చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 చొప్పున విక్రయిస్తూ ఎకరాకు 2 ప్యాకెట్లకు గాని 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. అలాగే విడి విత్తనాలను కేజీకి 3500 ల చొప్పున రైతులకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

#కూలీల కలుపు ఖర్చు మిగులుతుందని.

 

cotton

బీటీ 3 పత్తి విత్తనాలతో ఆరోగ్యానికి హానికరం, భూమిలో భూసారం క్షీణించి పోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీటీ-3 విత్తనాల అమ్మకాలు నిషేధించింది. కానీ బీటీ-3 విత్తనాలు మొలకెత్తిన తర్వాత కలుపు నివారణకై గడ్డి మందు పిచికారి చేసిన కూడా పంటకు ఎలాంటి నష్టం జరగదని దళారులు చెప్పడంతో రైతులు ఆ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని పంట దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదని రైతులకు దళారులు నచ్చజెప్పడంతో మండలంలో అధిక మొత్తంలో బిటి-3 విత్తనాలు రైతులు విక్రయిస్తున్నారు. బీటీ -2 విత్తనాలపై గడ్డి మందు (గ్లైబో సెట్) పిచికార్ చేస్తే పత్తి పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులకు దళారులు అవగాహన చేస్తూ నిషేధిత విత్తనాల వైపు రైతులను మళ్లిస్తూ అదేవిధంగా నిషేధిత గడ్డి మందు (గ్లైబోసేట్) ల సైతం గ్రామాలలో డంపు చేసి రైతులకు విక్రయిస్తూ దళారులు లక్షల సైతం దండుకుంటున్నారు.

#తనిఖీలు చేపట్టని వ్యవసాయ అధికారులు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ మండలంలో బీటీ-3 విత్తనాలు విక్రయాలు జరుగుతున్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న సంబంధిత వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాలలో తనిఖీలు చేపట్టి బీటీ-3 విత్తనాల విక్రయాలను అడ్డుకట్ట వేసి నిషేధిత విత్తనాల వల్ల జరిగే అనర్థాలను రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం రైతు వేదిక యందు,నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, వరి మరియు పెసర మూల విత్తనాల కిట్లను, కేసముద్రం మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల రైతులకు, ప్రతి రెవిన్యూ గ్రామం నుంచి ముగ్గురు అభ్యుదయ రైతులకు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెండు వరి మరియు ఒక పెసర మిని కిట్లను, కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న అధ్యక్షతన, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్, గంటా సంజీవరెడ్డి మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంటా సంజీవరెడ్డి, మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, నాణ్యమైన వరి మరియు పెసర విత్తనాలను, అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి విత్తనాలను గ్రామస్థాయిలో అభ్యుదయ రైతులు శాస్త్రవేత్తల సలహా సూచనలతో ఉత్పత్తి చేసి గ్రామంలో ఉన్న రైతులకు పంపిణీ చేసి వచ్చే సీజన్లో తక్కువ ఖర్చుతో విత్తనాలను సరఫరా చేయాలని వారు సూచించారు దీనివలన విత్తన ఖర్చులు తగ్గి రైతుకు మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి,నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. అదేవిధంగా రైతులు విత్తన కంపెనీల మీద ఆధారపడకుండా వారి యొక్క విత్తనాలను వారి గ్రామంలోని స్వతహాగా తయారు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మండలానికి 15 రెవెన్యూ గ్రామాలకు గాను 30 వరి కిట్లను, 15 పెసర కిట్లను అభ్యుదయ రైతులకు పంపిణీ చేశామని తెలిపారు అదే విధంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విత్తనం వేసినప్పటినుంచి పంట చేతికి వచ్చే వరకు విత్తన ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేసముద్రం, ఉపాధ్యక్షులు, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు మహబూబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, మరియు సొల్లేటి జయపాల్ రెడ్డి , బండారు వెంకన్న , కదిరే సురేందర్ , గుగులోతు దశ్రు నాయక్ , వివిధ గ్రామాల అభ్యుద రైతులు, కేసముద్రం మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, డి రాజేందర్, శ్రీనివాస్, సాయిచరణ్ రవి వర్మ, లావణ్య లు పాల్గొన్నారు.

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ.

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి 
https://youtu.be/lZAh9MZCMGM?si=gwWCHvLV1oSiHtzR
     
  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం (ఎపిసోడ్-56) కార్యక్రమానికి శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గారు, శ్రీ.. నేరెళ్ళ రమేశ్, ADA, భూపాలపల్లి , శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త  మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక లో  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. బి. గోపి, డైరెక్టర్ ఒఫ్ అగ్రికల్చర్          శ్రీ.ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు ప్రసంగం చేయడం జరిగింది,  వానాకాలనికి అనువైన సన్న వరి ధాన్యం రకాల గురుంచి చర్చించడం జరిగింది, వాతావరణ ఆధారిత వానాకాల  వ్యవసాయం పై రైతులకు సలహా ఇవ్వడం జరిగింది, అలాగే “నాణ్యమైన విత్తనం” నిర్వహణపై చర్చించడం జరిగింది,  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆయా రైతు వేదికల ద్వారా “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగింది.   మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో  వరి రకం WGL-962 మరియు పెసర రకం MGG-385 అనే విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ” కార్యక్రమంలో శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి , శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి గారు, శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త, స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ.

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్ర:

ఝరాసంగం మండల పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి బర్దిపూర్ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం – రాజేంద్రనగర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ హాజరై ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పెసర రకం MGG-295 మరియు కంది WRGE-96 రకాల యొక్క లక్షణాలు మరియు పంట సాగు మెలకువలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమం కింద ఝరాసంగం మండలానికి MGG-295 అనే పెసర రకం 80 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) అలాగే WRGE -97అనే కంది రకం మన మండలానికి 50 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) కేటాయించడం జరిగింది అని తెలిపారు. పంట పూర్తి కాలంలో వివిధ దశల్లో క్షేత్ర సందర్శన నిర్వహిస్తామని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఝరాసంగం చైర్మన్ గౌస్ ఉద్దీన్ మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, మల్లన్న పటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, హరికృష్ణ, ఙ్ఞానం, రేణుక వేదవతి, భారతి మరియు రైతులు మల్ల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్.!

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

ముఖ్యఅతిథిగ హాజరైన నాగూర్ల

పరకాల నేటిధాత్రి:

ఎరువులు,పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫర్టిలైజర్స్ మాజీ అధ్యక్షులు సూర్యదేవర సదానందం అధ్యక్షతన స్వర్ణ గార్డెన్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

నూతన అధ్యక్షుడిగాఎన్నికైన అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ కోశాధికారి గా,మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఎన్నికైన కమిటీ సభ్యులను సదానందం ప్రమాణస్వీకారం చేయించారు.గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన డీలర్ మహాశయులకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని,బాధ్యతాయుతంగా నాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లా కమిటీకి పరకాల అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకి వ్యాపారస్తులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది.

జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు.

ఇది రైతులపై భారం పడుతుంది.

వ్యవసాయ అధికారుల దాడుల్లో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి, వాటిని కొనుగోలు చేసిన రైతులు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టి పంటలు పండక, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులను అధినేయంగా శిక్షించాలని, ధాన్యం సేకరించిన రైతులకు కింటాకు 500బోనస్, రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం సాయం అందించాలని అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.

కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సీటు ప్లస్ అదనంగా 50% మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల. వెంకన్న, మోడీ వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి.

జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ

 

House Officer Muralidhar Raj

 

డీలర్లు విత్తన చట్టం 1966 ప్రకారం వారి యొక్క క్రయవిక్రయాలు జరుపుకోవాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని వారు సూచించారు, రైతులకు కనిపించే విధంగా, లైసెన్సులు,స్టాక్ బోర్డు, మైంటైన్ చేయాలని వారు, సూచించారు, ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీధర్ రాజ్ మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్మేతే

కేసులు నమోదు చేయండి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి లో రైతులకు ప్రభుత్వ లై సేన్స్ లేకుండా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా స్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాలో షాపుల.వారు ఎక్కడ నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని అన్ని విత్తనాలు అమ్మే షాపులు, డీలర్ షాపులను తనిఖీ చేసి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉంటే కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు చాలా ఖరీదైనవి ఉండటం వల్ల నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ లో గాని రైతులకు బ్రోకర్ల ద్వారా అమ్మే ప్రమాదం ఉందన్నారు.
హ్యాషన్ హౌస్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు డీలర్ గింజల షాపులను తనిఖీ చేసి సీడ్ ప్యాకెట్ లను తనిఖీ చేయాలని, ప్యాకెట్ పై జి.ఈ.ఎ.సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని జి. ఈ. ఎ.సి నెంబర్ లేకున్నా, లూజ్ విత్తనాలు అమ్మకానికి పెట్టిన వెంటనే షాపు వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.లైసెన్స్ కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని ఇతరులు విత్తనాలు అమ్మడానికి వీలు లేదన్నారు. లైసెన్స్ లేని వారు విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా సీడ్ యాక్టు 1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983, ఈ. పి యాక్టు 1986 ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో రైతులు వరి పంట మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటల సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు దొడ్డు రకం కాకుండా సన్న రకం మాత్రమే సాగు చెస్ విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నకిలీ విత్తనాల పై అవగాహన కల్పించడమే కాకుండా పంట రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఏ.డి. ఎ చంద్ర శేఖర్, మున్నా, సి. ఐ లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

కేసముద్రం నేటి ధాత్రి:

కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు ఏవో బి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వ్యవసాయ శాఖ 50% సబ్సిడీ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, రైతులకు అందజేసిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు, కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఏవో వెంకన్న మాట్లాడుతూ మండలం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సగం ధరకే అందిస్తుందని రైతులు యొక్క పంట పాస్ పుస్తకాల జిరాక్స్ మరియు ఆధార్ కార్డు లను జతపరచి రైతు సేవ కేంద్రంలో సమర్పించి సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలను సగం ధరకే కొనుగోలు చేసుకోవాలని ఈ అవకాశం రైతులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.పచ్చి రొట్ట విత్తనాలను వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు పల్చగా వెదజల్లాలని అప్పుడే భూమి సాంద్రత పెరిగి మంచి పంట దిగుబడులను ఇచ్చి రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాలలో పచ్చి రొట్ట విత్తనాలు 800 బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,ఆగ్రోస్ నిర్వాహకులు గోపాల వెంకట్ రెడ్డి, రాజు, అగ్రికల్చర్ విస్తరణ అధికారులు రాజేందర్, రవి వర్మ, సాయి చరణ్,లావణ్య, ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు వర్షాకాలం పంట కు లఘు ఏర్పడడానికి జీలుగు విత్తనాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రనీకి 200 క్వింటల్ల జీలుగు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులు కూపన్స్ జారీ చేస్తారని ఆ కూపన్స్ ఆగ్రోస్ మరియు డిసిఎంఎస్ సెంటర్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 30 కేజీల జీలుగు ధర రూ,, 2137. 50 ఉందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున మండల అగ్రికల్చర్ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులు పంట సీజన్ కాలం ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలను సంబంధిత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట పద్ధతులు పాటించాలని, మండల కేంద్రంలోని కొన్ని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారు నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రైతుల ముఖ్యంగా విత్తనాలను మరియు పురుగుల మందులు కొనేటప్పుడు షాపు యొక్క బిల్లును తప్పకుండా తీసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్డు కోసం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు తమ ఆధార్ కార్డు ను పట్టా పాస్ బుక్కులు తీసుకొని సంబంధిత ఫోన్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా,రవాణా, ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు,రైతులకు జిల్లా ఎస్పీ సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని నకిలీ విత్తనాల సరఫరా,ఉత్పత్తి,అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ,జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తరచు తనిఖీలు చెప్పట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్,వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారియెక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మిన,రవాణా చేసే వ్యక్తుల పై క్రిమినల్ కేసులు,పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ, పోలీసు అధికారులు పై ఉంటుందని,
జిల్లా పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ షాప్, సీడ్స్ షాప్స్ లపై నిఘా ఉంచి ఆకస్మిక తనికిలు చేస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను,రవాణాను అడ్డుకట్ట వేయడం జరుగుతుందని,రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం.

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం

వీణవంక (కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి :వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విత్తనాలు, ఎరువుల దుకాణాదారులతో ట్రైనీ ఎస్సై, ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారి తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జమ్మికుంట రూరల్ సీఐ గారి సూచనల మేరకు, వ్యవసాయ అధికారితో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సూచనల మేరకు నకిలీ విత్తనాలు అమ్మకానికి పాల్పడకూడదు.
గుర్తు తెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమి కీటకాల మందులు అమ్మకూడదు క్రిమి సహాక మందులు అమ్మేటప్పుడు రైతు ఆధార్, పాస్‌బుక్, జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకొని రిజిస్టర్‌లో నమోదు చేయాలి అని తెలిపారు అంతేకాకుండా
లాట్ నంబర్, పీసీ నంబర్ సరిగా ఉండాలి.
సరైన లైసెన్సు ఉన్నవారే అమ్మకాలు నిర్వహించాలి.
దుకాణదారులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బంది హెచ్చరించారు
ఈ సమావేశంలో పలు గ్రామాల ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణదారులు పాల్గొన్నారు.

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.. రైతన్నాజర భద్రం!

జహీరాబాద్ నేటి ధాత్రి:

నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?

◆ రైతుల‌ను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు

◆ అన్న‌దాత‌ల‌కు న‌కిలీ విత్త‌నాలు అంట‌గ‌ట్టే కుట్ర

◆ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్న వ్య‌వ‌సాయాధికారులు

◆ ఏటా రూ. కోట్ల‌లో న‌కిలీ దందా.. నిండా మోస‌పోతున్న రైతులు

◆ రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా అనేక చ‌ట్టాలు.. అవ‌గాహ‌న లేక అన్యాయం

ఖ‌రీఫ్ సీజ‌న్ స‌మీపిస్తున్న‌ది. దీంతో రైతుల‌ను నిలువునా ముంచేందుకు న‌కిలీ కేటు గాళ్లు సిద్ధ‌మైపోతున్నారు. ప్ర‌తి ఏడాది రైతుల‌కు న‌కిలీ విత్త‌నాల‌ను అంట‌గ‌ట్ట‌డం.. వారిని నిండా ముంచ‌డం న‌కిలీ వ్యాపారుల‌కు ప‌రిపాటిగా మారింది. స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతంగా నకిలీ విత్తనాలను తయారుచేస్తున్నారు. దీంతో రైతులు నకిలీ విత్తనాలు నాటి నిండా మునిగిపోతున్నారు. ఆ తర్వాత పరిహారం కూడా పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది రూ. కోట్లల్లో రైతులు నష్టపోతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి.. ఆశించిన దిగుబడి రాక అగచాట్లు పడుతున్నారు. అయితే విత్తన రక్షణకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే మోసాలకు గురవుతున్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ రైతులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తన పత్తిని సాగు చేస్తుంటారు. ఈ విత్తనపత్తిని సాగుచేసిన అనంతరం విత్తనాలను కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని విత్తనాలు విఫలమవుతాయి. మధ్య దళారులు వీటిని రైతుల నుంచి సేకరించి అక్రమదందాకు తెరలేపుతున్నారు. కంపెనీల లేబుళ్లు వేసి అచ్చం అసలు విత్తనాలలాగే ఈ కంపెనీలు విత్తనాలను తయారు చేస్తున్నాయి.

Fake seeds

విజిలెన్స్ తనిఖీలు అంతంతే..

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు సైతం అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి విత్తనాలు సేకరించిన కంపెనీలు విఫలమైన విత్తనాల వివరాలను రైతుల పేరుతో సహా వ్యవసాయశాఖకు అందించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదని తెలుస్తున్నది. విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ తనిఖీలు సక్రమంగా లేకపోవటంతో నకిలీ విత్తనాలు నామమాత్రంగానే పట్టుబడుతున్నాయి. ఒకవేళ రైతులు నకిలీ విత్తనాలు సాగు చేసి మోసపోతే ఏం చేయాలి.. వారికి రక్షణగా ఉన్న చట్టాలేమిటిఝ.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ క‌మిష‌న్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ రైతులకు కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.

నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే ?

నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు.విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?

అమలులో ఉన్న విత్తన చట్టాలు –

– అభివృద్ధి చేసిన విత్తనాలు & మొలకల చట్టం, 1951
– విత్తనాల చట్టం, 1966
– కొత్త వంగడాల రక్షణ & రైతు హక్కుల చట్టం, 2001
– పత్తి విత్తనాల చట్టం, 2007

పరిహారం పొందే మార్గాలు..

నాణ్యత లేని విత్తనాలు సాగు చేసి రైతులు మోసపోతే వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయొచ్చు. సివిల్ కోర్టులోనూ కేసులు దాఖలు చేయొచ్చు. పత్తి విత్తనాల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయినా కొత్త వంగడాల్లో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. విత్తనాలు మొలకెత్తకపోయినా.. దిగుబడి ఏమాత్రం రాకపోయినా పరిహారం పొందే అవకాశం ఉంది. విత్తనాల కోసం చెల్లించిన ధరను, సాగు ఖర్చు, దిగుబడి విలువ, రైతుకు కలిగిన మానసిక క్షోభకు సైతం పరిహారం పొందే అవకాశం ఉంది.

రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి.

విత్తనాలు ఉంచిన డబ్బా/సంచి దాచి ఉంచాలి.

విత్తనాల గురించి సమాచారం తెలుపుతు ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలి

వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపరచాలి

పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్/కంపెనీ ప్రతినిధికి తెలియజేయాలి.

నష్ట పరిహారం కోసం కేసు వెయ్యాలి / దరఖాస్తు చేసుకోవాలి.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

పోలీస్,వ్యవసాయ శాఖల ఉమ్మడి తనిఖీలు.

నర్సంపేట నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.

Fertilizer

ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version