చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు…

చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు

వరుసగా రెండుసార్ల విజయం సాధించిన ఆరెళ్ళ

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు కోర్టు ఆవరణ లో జరిగినవి హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో ఆరేళ్ల వీర మల్లయ్య విజయం సాధించారు ఉపాధ్యక్షుడిగా కాటం సురేందర్ ప్రధాన కార్యదర్శిగా మెరుగు రమేష్ ఎన్నిక అయినారు ఎన్నికల అధికారులుగా బి యాదగిరి గౌడ్ ఎన్ . సంతోష్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ జడ్జ్ నియామకానికి నేను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ కృష్ణ గుస్క వెంకటేష్ శ్రీధర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల దృశ్య మున్సిపాలిటీ పరిధిలోని నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మహేశ్వరం వద్ద సంబంధిత ఎన్నికల అధికారి, నెక్కొండ పిఆర్ ఏఈ రాజ్ కుమార్ స్థానిక హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ కాజం అలీ తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుగాను వస్తువులు,డబ్బు,మద్యం లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా అని వాహనాలల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.

కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 నిర్వహణ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలు స్వీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా యంత్రాంగానికి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలోపు పరిష్కరించి, వాటి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.
ఈ హెల్ప్‌డెస్క్‌కు సంబంధించిన సెల్ నంబర్: 9030632608 కాగా, ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హెల్ప్‌డెస్క్ నిర్వహణకు కింది సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఎస్.కే. అమ్జద్ అహ్మద్ అబ్బాస్, నాయబ్ తహసీల్దార్ (ఎన్నికలు) & హెచ్ సూపరింటెండెంట్
ఎస్. సువర్ణ – ఐటీ సెల్ (ఎన్నికలు)
పి. నవీన్ – సీనియర్ అసిస్టెంట్,
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తయ్యింది

సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఏర్పాటు చేసిన 265 పోలింగ్ కేంద్రాలకు గాను 265 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది రిజర్వ్ పి. ఓ.లు,265 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది ఎ.పి.ఓ.లు,795 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 159 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఏర్పాటు చేసిన 68 పోలింగ్ కేంద్రాలకు గాను 68 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది రిజర్వ్ పి. ఓ.లు,68 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది ఎ.పి.ఓ.లు,204 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 41 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో ఏర్పాటు చేసిన 36 పోలింగ్ కేంద్రాలకు గాను 36 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది రిజర్వ్ పి. ఓ.లు,36 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది ఎ.పి.ఓ.లు,108 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 22 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో ఏర్పాటు చేసిన 45 పోలింగ్ కేంద్రాలకు గాను 45 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది రిజర్వ్ పి. ఓ.లు,45 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది ఎ.పి.ఓ.లు,135 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 27 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాలకు గాను 30 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది రిజర్వ్ పి. ఓ.లు,30 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది ఎ.పి.ఓ.లు,90 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 18 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ…

ఝరాసంగంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం లోని ఝరాసంగం రైతు వేదికలో శనివారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 కోసం ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో MPO స్వాతి, మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో TOT, MOT లుగా సురేష్, క్రిష్ణ, శంకర స్వామి లు ఎన్నికల అధికారులకు విధులు బాధ్యతలు, ఎన్నికల చట్టాలు పలు అంశాలపై శిక్షణ అందించారు. శిక్షణ కార్యక్రమంలో 100 మంది ఎన్నికల్లో విధులు నిర్వహించబోయే అధికారులు, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version