ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.
గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.