శ్రీపురంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రంగనాయక స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి సరిత రాజేష్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు శ్రీపురం గ్రామ సర్పంచ్ గీతా నర్సింహారెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్…

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ఏరియా దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి దగ్గర కరెంటు కోతలపై వార్డును పర్యటిoచి ప్రజల నుండీ కరెంటు కోత సమస్యలు తెలుసుకున్నామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు కరెంటు కొత్త
సమస్యలపై ఫోన్ ద్వారా విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు వార్డులో లో వోల్టేజీ సమస్య మురుగు కాలువలో ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పా టు చేయాలని కోరారు శ్రీ వెంకటేశ్వర దేవాలయం ముందు రోడ్డు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని కోరారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్ జోన్ లో ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు 33 వార్డును కరెంటు సమస్యల పై చూపించామని చెప్పారు వార్డు పర్యటన లో
విద్యుత్ ఎస్సి డి ఇ ఏ ఇ లైన్ మెన్ లు పాల్గొన్నారని తిరుమల్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version