ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ జన్మదిన వేడుకలు.

ఘనంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ జన్మదిన వేడుకలు

మెట్ పల్లి: మే 2 నేటిదాత్రి

 

టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, గౌరవ అధ్యక్షుడు ఆగ సురేష్,ఉపాధ్యక్షులు జంగo విజయ్, సాజిద్ పాషా,
కోశాధికారి ఎస్.కె మక్సుద్
సహాయ కార్యదర్శి
పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులు,మహమ్మద్ అఫ్రోజ్ ,పానిగంటి మహేందర్,
కుర్ర రాజేందర్ , కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి…

ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఆరెంద స్వామి(సిటీ కేబుల్),ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు (జనం సాక్షి), కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి(వుదయం )లకు పదవీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంగారపు గౌతమ్ ( ప్రజా పక్షం), ప్రచార కార్యదర్శి ఆరెల్లి గోపి కృష్ణ( మన సమాజం),ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య( నేటి ధాత్రి), ఎం వేణుగోపాల్ రెడ్డి( వాస్తవం), కొండ శ్రీనివాస్ ( మనతెలంగాణ),కార్యనిర్వాహణ కార్యదర్శి పి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం),సహాయ కార్యదర్శులు ఎన్ శ్రీనాథ్ (సూర్య ) పి గంగులు యాదవ్ (సామాజిక తెలంగాణ) లు నూతనంగా ఎన్నికయ్యారు. క్లబ్ సభ్యులుగా ఎం ప్రవీణ్, కె సదానందం, ఎం రవీందర్, డి స్వామి, డి వెంకటస్వామి లు ఉన్నారు. సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి లు మాట్లాడారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ని సమిష్టిగా కలిసి మెలిసి పని చేసి ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమనిబంధనలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటించాలని, నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version