ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల్ వెల్దండ గ్రామపంచాయతీ జోగు రవి కుమార్ s/o యాదయ్య గారు,రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మాణం కోసం సిమెంట్ పంపించారు. మంగళవారం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా సిమెంట్, ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారుసిద్ధగొని రమేష్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి, జోగు రవి కుమార్, ప్రభాకర్ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్

మంగపేట నేటిధాత్రి:

 

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అకినేపల్లి మాల్లారం గ్రామానికి చెందిన ఆవిరి.సూరిరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంవల్ల వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలమ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ చంద్ తెలుసుకొని వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యం,ఐదు కేజీల ఆయిల్ క్యాన్ ను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్ట్ మండలం అధ్యక్షులు:నూతులకంటి.ఈశ్వర్ చంద్, ట్రస్ట్ సభ్యులు నన్ను బోయిన. సాంబయ్య,నూతులకంటి.గౌరీ శంకర్,జై భీమ్ రామ్మోహన్,రవి తదితరులు పాల్గొన్నారు

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌

 

 

 

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌…

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సోమవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ముఖ్యంగా ప్రభాస్‌ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి.

మారుతి టేకింగ్‌ ప్రధానాకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్‌ పిలుస్తున్నారు అని చెప్పారు.

ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా.

‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలేభలే మగాడివోయ్‌’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి.

సినిమా చేద్దాం’ అని అన్నారు.

‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు.

అయినా నాపై నమ్మకంతో ప్రభాస్‌ ఈ సినిమాను చేశారు.

ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా. 

 

షూటింగ్‌ మొదలయ్యాక కూడా ‘ఈ టైమ్‌లో ప్రభా్‌సకు మారుతితో సినిమా అవసరమా’..
‘అయినా ప్రభాస్‌ కామెడీ చేయడమేంటి’ వంటి సందేహాలు వినిపించాయి.
అన్ని సవాళ్లనూ స్వీకరిస్తూ ఈ సినిమాను మరింత పట్టుదలతో కొనసాగించా.
అభిమానులు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే.
అంతకు వెయ్యిరెట్లు ఆయన వారిని ప్రేమిస్తారు’’ అని అన్నారు.
టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మీ అందర్నీ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా ఎంటర్టైన్‌ చేస్తుంది.
40 నిమిషాల క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు.
నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం మొదలైనప్పుడు ఓ నిర్మాత దీనిపై నెగెటివ్‌గా మాట్లాడారు.
సినిమా విడుదలయ్యాక ఆయనే పొగుడుతారు’’ అని తెలిపారు.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహ బహుమతులు.

వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహ బహుమతులు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు..నగదు ప్రోత్సాహక బహుమతి.పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు వాసవి సేవా ట్రస్ట్ కల్వకుర్తి ఆద్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5 వేలు, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 3 వేలు నగదు ను వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్ ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ లో ప్రథమ బహుమతి బిల్లకంటి వర్షిత్ కు 5 వేలు,ద్వితీయ బహుమతి గంధం భరద్వాజ్ 3 వేలు, పదవతరగతి లో ఆకుతోట ప్రశాంత్ 5 వేలు, ద్వితీయ బహుమతి చంధన 3 వేలు నగదు ను విద్యార్థులకు శాలువా కప్పి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దేవాలయం చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించడం అభినందనీయం, ఆదే విధంగా ప్రథమ ద్వితీయ తోపాటు తృతీయ ప్రోత్సాహకం అందించాలని, ఇంటర్మీడియట్, పదవతరగతి తోపాటు డిగ్రీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించాలని, సేవా ట్రస్ట్ సేవాకార్యక్రమాలు నిర్వహించడానికి నిధులు పెంచుకునేందకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, సేవా ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు, కోశాధికారి గుబ్బ ప్రభాకర్, మహాసభ మండలం సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు కృష్ణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సంబు ముత్యాలు,సేవా ట్రస్ట్ సభ్యులు,ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు ప్రతిభ కనబరిచి ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

జికె నామ్ ఎడ్యుకేషనల్.!

జికె నామ్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్ లీగల్ సహకరం.

ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు

నర్సంపేట,నేటిధాత్రి:

 

జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్, లీగల్ సహకారం అందించబడునని
ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు తెలిపారు. నర్సంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్
ప్రాజెక్ట్ చైర్మన్ సుప్రియా రత్న కుమార్ గౌడి పేరు మాట్లడుతూ నిరాదరణకు గురైన ప్రజలకు మెడికల్, లీగల్ సర్వీస్ అందించడం కోసం ఈ ట్రస్ట్ ఎర్పాటు చేశామని దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ ప్రాజెక్ట్ సమాజంలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి మరియు వైద్య సేవల ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.
ప్రాజెక్ట్ ప్రాన్ పబ్లిక్ రీడ్రెస్సల్ అసోసియేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఉచిత వైద్య సేవలు,చట్టపరమైన అవగాహన శిబిరాలు అలాగే హన్మకోండలోని చక్రవర్తీ నెట్‌వర్క్ హాస్పిటల్ సహకారంతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు లండన్,ఎమ్మార్సి,యూఎస్ఏ లోని న్యూజెర్సీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఎన్జీఓ 13 రాష్ట్రాల్లో న్యూ ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయంతో వివిధ ప్రాజెక్టులతో పనిచేస్తుంది.రి.నం.725,అలాగే తెలంగాణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ట్రస్ట్ ఆరోగ్య కార్డుతో లభించే సేవలు:

ఉచిత ఓపిడి కన్సల్టేషన్లు,
డయాగ్నస్టిక్ పరీక్షలపై డిస్కౌంట్లు 50 శాతం,చికిత్స ఖర్చులపై రాయితీలు 50 శాతం,ఉచిత ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

సంస్థ ద్వారా అత్యవసర వైద్య సహాయానికి మార్గనిర్దేశం:

డాక్టర్ తారున్ కుమార్ రెడ్డి (క్రిటికల్ కేర్),డాక్టర్ ఏ.వి మోహన్ రెడ్డి (MS జనరల్ సర్జన్)డాక్టర్ ఎ. చంద్రికారెడ్డి (ఎంఎస్ జనరల్ సర్జన్),డాక్టర్ రామకృష్ణ (ఎండి జనరల్ మెడిసిన్),డాక్టర్ పాద్మాజా (క్రిటికల్ కేర్)

మా కార్డు పొందడానికి అర్హులు:

1. వికలాంగులు
2. అనాథలు
3. అన్ని బిపిఎల్ హోల్డర్లు
4. ఒంటరి మహిళలు
5. డెస్టిట్యూట్స్
6. తక్కువ ఆదాయ కుటుంబాలు
7. క్రమమైన ఆరోగ్య సంరక్షణకు నోచుకోలేని వ్యక్తులు

గుర్తింపు మరియు ఆదాయ పత్రాలు (అవసరమైతే)

కార్డుకు ఎలా…ఎలా దరఖాస్తు చేయాలి:

మే 15 వ తేదీ నుండి – ఆగస్టు 15, 2025 మధ్య అన్ని మండలాలలో పంచాయతీ కార్యాలయం మా నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
తద్వారా అవసరమైన పత్రాలు (గుర్తింపు కార్డు,ఆదాయ ధ్రువీకరణ మొదలైనవి) తీసుకురావాలి.

మా సంస్థ లక్ష్యం:

ఆర్థిక సమస్యల కారణంగా ఎవ్వరూ మౌలిక ఆరోగ్య సేవలకు, మరియు చట్టపరమైన సేవలు దూరంగా ఉండకూడదు అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.మనమంతా కలిసి ఆరోగ్యవంతమైన, చట్టపరమైన సమానత్వమున్న సమాజాన్ని నిర్మించుకుందాం.
మరిన్ని వివరాల కోసం: సంప్రదించండి.
: 7207024416/9581226703
ఇమెయిల్: gktrustnaam@gmail.com
వెబ్‌సైట్: www.gktrustnaam.org

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

బైక్ మెకానిక్ వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మిత్ర బైక్ మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పని చేసే సాగర్ కి ఆదివారం యాక్సిడెంట్ అయ్యి త్రీవ గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గాయపడిన సాగర్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రవేట్ హాస్పిటల్ చేర్పించారు.హాస్పటల్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో,ఆర్థిక స్తోమత లేని కుటుంబం కావడంతో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సాగర్ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆత్మీయ చారిటబుల్ ట్రస్టును సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, అధ్యక్షుడు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, సభ్యులు బి.సంపత్,జె.సతీష్, కే.మోహన్,బి.లక్ష్మణరావు,ఈ. వెంకటేష్,జై.నాగరాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

బొమ్మెర గ్రామానికి చెందిన బెల్లంకొండ సోమయ్య కరెంట్ షాక్ తో మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి, దాత కాటబత్తిని లలిత జన్మదినం సందర్భంగా 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు కూరగాయలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, సభ్యులు తాళ్లపల్లి రత్నాకర్, పెండ్లి భాస్కర్, మృతుడి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ఎస్సీ కాలనీకి చెందిన గాయాల మధు (మానసిక వికలాంగుడు) అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ట్రస్ట్ తరుపున పూర్తి సహకారంగా ఉంటామని ధైర్యం చెప్పి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ సభ్యులు పెండ్లి భాస్కర్, తాళ్లపెళ్లి రత్నాకర్, ఈ కార్యక్రమంలో గాదేపాక భాస్కర్, మృతుడి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version