దీపక్ నగర్ 16వ వార్డులో కుప్పలు కుప్పలుగా చెత్త
ఖాళీ స్థలంలో చెత్త కుప్ప పిచ్చి మొక్కలు పాములు, పందులు, దోమలతో అపాయం.
చెత్త కుప్ప నుండి నివాసాలలోకి వస్తున్న పాములు, దోమలు.
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ దీపక్ నగర్ 16వ వార్డులో ఖాళీ స్థలం ప్రాంగణం లో అడ్డగోలుగా చెత్త పిచ్చి మొక్కలు ఉండడం వలన చేత ప్రక్కన నివాసం కలిగి ఉన్న ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. దీనివలన పాములు, పందులు, దోమలు వలన చుట్టుపక్కల ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. వర్షాకాలం అయితే మరి దుర్బలమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఈ కాళీ స్థలం చెత్త కుప్పగా మారడంతో. ప్రక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్త మురికి నీరు పేరుకపోయి.కాలువ ఇరు ప్రక్కల పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పట్టించుకోని అధికారులు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి. స్ట్రీట్ లైట్ వెలగకపోవడంతో. అంధకారంగా మారిన ప్రాంతం దీనితో ఈ చెత్త కుప్ప పక్కన ఉన్న నివాసాలలోకి చాలాసార్లు విషపూరితమైన సర్పాలు చొరబడ్డ సందర్భాలు ఉన్నాయి. దీనివలన అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకోవాలని అక్కడి ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.