ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే ందుకు ముందుకు రావాలి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండల కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు అసంక్రమణ వ్యాధులు అయినటువంటి(NCD) బిపి, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశా కార్యకర్తలు పాత్ర కీలకమైనదని ఆశా కార్యకర్తల సమావేశంలో తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేసి ప్రతి డిపార్ట్మెంటు లోని సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవి , ఎంపీడీఓ సురేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. రాజేంద్రప్రసాద్, మ్మెలహ్ప్ డాక్టర్స్, సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్, ఆస్పత్రి సిబ్బంది, Ann’s, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన వేణుగోపాలస్వామి ఉద్యోగ విరమణ సందర్భంగా శాయం పేట మండల తల్లి దివ్యాం గుల సేవా సమితి మండల అధ్యక్షుడు, ఎర్ర తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో స న్మానించారు ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ పాల్గొన్నారు.
ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్లో ఘనంగా అమ్మకు వందనం.
కోదాడ, నేటి ధాత్రి :
విద్యార్థు ల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని విశ్రాంత ఉపన్యాసకులు సాహితీవేత్త శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్ లో అమ్మకు వందనం కార్యక్రమం సందర్భంగా పాఠశాల చైర్మన్ యం.డి షేర్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థుల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే అమ్మ కు వందనం కార్య క్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నైతిక విలువలకు పునాది పాఠశాల అని , నైతిక విలువలు విద్యార్ధుల్లో పెంపొందించేందు కు ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ చేస్తున్న కృషి ప్రశంస నీయం అన్నారు. ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయుల తో సమానం అన్నారు.తల్లి దండ్రులు దైవం తో సమానం అన్నారు. మరో ముఖ్య అతిథి రచయిత సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణ మూర్తి మాట్లాడుతూ అమ్మ విలువ అందనంత దూరంలో వున్నప్పుడే అర్ధం అవుతుందన్నారు. తల్లి దండ్రుల ను మరవద్దన్నారు. తల్లి దండ్రుల ను చూసే బాధ్యత పిల్లల దే అన్నారు. తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేని దన్నారు. అనంతరం తల్లి దండ్రులకు విద్యార్ధులు పాద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గూడెం హై స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సత్తార్, పీఎం శ్రీ జిల్లా పరిషత్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శ్రీమతి షేక్ రెహానా బేగం విద్యార్ధుల తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
*మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు సంతోషం వ్యక్తo చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మొగుళ్లపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం అందించడం పట్ల మొగుళ్లపల్లి మండలకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని వారు తెలిపారు.ప్రజలకు సకాలంలో అవసరమైన ఆహార భద్రత కల్పించడంలో ఇది కీలక నిర్ణయమని పేర్కొన్నారు.ఈ సందర్బంగా నడిగోటి రాము మాట్లాడుతూ,మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించడం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని,ముఖ్యంగా కూలీ వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్‌ను పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్
రైతుల పరామర్శకు వెళ్తున్న సమయంలో అరెస్ట్ అన్యాయం
భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్
ప్రతిపక్షాలను అణచివేయడం అప్రజాస్వామికం
హరీష్ రావు అరెస్టు పట్ల పెద్ది సుదర్శన్ రెడ్డి ఖండన
నర్సంపేట, నేటిధాత్రి:
భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ లు చేస్తారా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది తీవ్రంగా ఖండించారు. పరిగి నియోజకవర్గంలోని కళాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో హరీష్ రావును అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న మైనింగ్ మరియు భూముల దందాలను అసెంబ్లీలోనూ, బయట మీడియాలోనూ ప్రశ్నిస్తున్న హరీష్ రావును కోకాపేటలోని నివాసంలో గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల భూములను కబ్జా చేస్తోందని ఆరోపించారు.కబ్జాలు, అక్రమ మైనింగ్ దందాలను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇటీవల అదిలాబాద్‌లో అక్రమ అరెస్టులు చేయమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించడం పిరికిపాందా చర్యగా అభివర్ణించారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందకపోవడం, రుణమాఫీ అమలు కాకపోవడం, ఎరువులు సకాలంలో అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు.ప్రజల పక్షాన పోరాటం చేస్తే కేసులు, అరెస్టులు చేయడం కొత్త కాదని, పోలీసుల బలంతో ప్రతిపక్షాలను అణచివేయాలనే ప్రయత్నాలు అప్రజాస్వామికమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి బెదిరింపులకు భయపడరని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. [4:03 pm, 7/4/2026] +91 99087 62239: ఈ వార్త లింక్ రాలేదు..
టెస్కో ద్వారానే వస్త్రా లను కొనుగోలు చేయాలని ధర్నా
ప్రైవేటు టెండర్ విధా నాన్ని రద్దు చేయాలని డిమాండ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ కార్మికులు టెండర్ విధానాన్ని రద్దుచేసి టెస్కో ద్వారానే కొనుగోలు చేయా లని ధర్నా చేశారు. అలాగే ప్రైవేటు టెండర్ల విధానాన్ని రద్దుచేసి ఇప్పటికి ఏప్రిల్ ఒక్కటే తారీకు నుండి వస్త్రా లు టెస్కో నుండి కొనలేమని ప్రభుత్వం ఖరీదు చేయమని చెప్పడంతో చేనేత సొసైటీలు నూలుకోనడం ఆపేశారు చేనేత కార్మికులకు ఇకనుంచి పని ఉండదని అన్నారు .ప్రై వేటు వ్యక్తులకు ఇచ్చారు అని చెప్పడంతో చేనేత కార్మికులు అయోమయంలో పడ్డారు అయ్యో మాకు ఉపాధి కోల్పోతే మేము ఎక్క డికి పోవాలని ఆందోళనలో పడ్డారు.ప్రభుత్వం తొందరగా స్పందించి ఆర్డర్ అన్ని టెస్కో కి ఇవ్వాలని చేనేత కార్మికుల ధర్నాకు దిగారు. ఇప్పటికైనా మండలంలోని చేనేత సహ కార కేంద్రంలో సరైన పని లేక ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం సైతం నుంచి వచ్చే ఆర్డర్లు రాకపోవడంతో దార మని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి టెస్కో కు ఆర్డర్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని , ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లు చేనేత సంఘాలకు అప్పగించి వారి ఆర్థిక పురోగాభివృద్ధికి సహక రించాలని కోరారు.ఈ కార్య క్రమంలో దిడ్డీ రమేష్ బూర లక్మినారాయణ, బాసని నవీ న్ ,దుబాసి రవి దాసరి రమేష్ వడ్డేపెళ్లిశ్రీను వనం దేవ రాజ్ సామల భిక్షపతి కుసుమశ రత్, తుమ్మ ప్రభాకర్ చేనేత కార్మికుల పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు.
కోదాడ, నేటి ధాత్రి:
https://youtu.be/ooGYBXQUVCQ?si=jFfBx1SsO_kmQKBp
మండల పరిధిలోని గణపవరం గ్రామంలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేడుకలను దేవాలయ నూతన చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని దంపతులు పీటల మీద కూర్చొని వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులకు భక్తితో పాటు గ్రామ యువకులలో ఉన్న ప్రతిభను గుర్తించటానికి రెండు రోజులపాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలచే బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల అనంతరం దేవాలయం నందు సాంస్కృతిక కార్యక్రమాలు, రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాన్ని గ్రామమునందు కనుల పండుగగా నిర్వహించారు.
చివరి రోజు గ్రామం నందు బండి ఎడ్ల పందెం వేడుకలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతిని దేవాలయ కమిటీ చైర్మన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ. శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల వేడుకలను నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి స్వామివారి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలను ఇంత పెద్ద బాధ్యతను మా పై నమ్మకంతో కమిటీని ఏర్పాటు చేసి పదవి బాధ్యతలను చేపట్టడానికి సహకరించిన రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి లకు కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు సహకరించిన దాతలకు పెద్దలకు ఏ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వహణ కమిటీ నూతన చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, కమిటీ సభ్యులు కంపసాటి ఐతం రాజు, పిరమర్తి తిరుపమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు పెద్ద వీరయ్య, బాలే బోయిన వెంకటేశ్వర్లు, ఆత్కూరి నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, దేవదాయ శాఖ నల్గొండ సహాయ కమిషనర్ కోదాటి భాస్కర్, దేవదాయ శాఖ మిర్యాలగూడ డివిజన్ పరిశీలకులు ఎన్. సంతోష్ రెడ్డి, దేవాలయాల కార్య నిర్వాణ అధికారి తుమ్మల వెంకట చలపతి, గైన్ ఫార్ములేషన్ కొంపల్లి హైదరాబాద్ సాని కొమ్ము తరుణ్ కుమార్ రెడ్డి, గ్రామ వార్డు కౌన్సిలర్లు, బండి చిన్నకోటయ్య,సింగారెడ్డి, కాసాని శ్రీనివాసరావు, పెడమర్తి ప్రసాద్, గ్రామ పెద్దలు, నాయకులు యువకులు, తదితరులు మహిళలు భక్తులు
తంగళ్ళపల్లి మండలం .రామచంద్రపూర్ గ్రామంలో. హెల్త్ క్యాంపు నిర్వహించారు. సందర్భంగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు 99 వ రోజుల్లో భాగంగా రామచంద్రపూ ర్ గ్రామంలో నేరెళ్ల .పి .ఎస్. సి ఆధ్వర్యంలో.NCD.(హెల్త్).Non -Communicable.Diseases. 30 సంవత్సరాలు దాటిన వారందరికీ హెల్త్ క్యాంపులో. స్క్రీనింగ్. అలాగే.టెస్టులుచేయడం. జరిగిందని తెలియజేస్తూ పెట్టి హెల్త్ క్యాంపు గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి.హెల్త్ క్యాంపులో. రామచంద్ర పూర్ గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్. ఉప సర్పంచ్ పొన్నాల నరసింహులు. వార్డు సభ్యులు. పద్యం శేఖర్. పొన్నాల అమృత. గ్రామ పంచాయతీ సెక్రెటరీ. లక్ష్మి. వైద్య బృందం. నేరెళ్ల మెడికల్ ఆఫీసర్. డాక్టర్ .E.చంద్రక రెడ్డి. హెల్త్ సూపర్వైజర్. రాంబాబు. సి హెచ్ ఓ. కృష్ణమూర్తి. ఏ.ఎన్.ఎం. కర్ణ శ్రీ. ఆశ వర్కర్లు. పద్మ. లావణ్య. శంక రవ్వ. గ్రామ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని తల్లి శిశు ఆరోగ్య టీకాలు పారిశుభ్రత పై దృష్టి అవసరమని ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన ఇచ్చారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులో సేవలు తెచ్చిందని వ్యాధి నివారణకు అవగాహన కీలకమని ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఏ వ్యాధి కైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ హాస్పిటల్ స్టాప్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు
శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు అశోక్ నూతన రేషన్ దుకాణంను ఎమ్మెల్యే గండ్ర సత్యనార యణరావు ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకు లను సమయానికి, పారద ర్శకంగా ప్రభుత్వంఅందిస్తుంది గ్రామస్థాయిలో రేషన్ దుకా ణాల ఏర్పాటు ద్వారా ప్రజల కు సులభంగా సరుకులుఅందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందా రిపేట గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వి నియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ ,శాయంపేట మండలం ఎమ్మార్వో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.
అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా మెట్ పల్లి ఏప్రిల్ 7 నేటి దాత్రి
మెట్పల్లి పట్టణంలోని వెల్లుల రోడ్డు హనుమాన్ నగర్ కాలనీ బచ్పన్ స్కూల్ దగ్గర వివరాలకు వెళ్తే మెట్పల్లిలోనే కళానగర్ ఎలా అభివృద్ధి చెందిందో హనుమాన్ నగర్ కాలనీ ఏడవ వార్డు దినదిన అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ బిల్డర్ల వాళ్లకు అడ్డగా మారి ప్లాట్స్ కొంటూ అమ్ముతూ ఇండ్లు కొంటూ అమ్ముతూ డ్రైనేజీలు లేక డ్రైనేజీలు ఇష్టం వచ్చినట్టు వాళ్ల ఇస్తాను సారం చేసుకుంటూ పోతున్నారు సామాన్య జనాలకు ఇబ్బందిగా మారి అధికారులు చూచి చూడనట్టు వదిలేయడం వల్ల హనుమాన్ నగర్ బచ్పన్ స్కూల్ దగ్గర మున్సిపల్ అధికారులు డ్రైనేజీ తవ్వి పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది అయి అనారోగ్యం పాలవుతున్నారు ఎండాకాలం కాలనీవాసులకు చెరువులు తలపిస్తున్నాయి దోమలు మురుగునీరు వాసన భరించలేక
సతమతమవుతున్నారు ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలం ఏ విధంగా ఉంటదో అని కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వచ్చి ఏదో చేసిన మా అంటే చేసినాము అనే విధంగా చేసి వెళ్తున్నారు ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ వెంట తిరుగుతున్నారు, ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించుకుంటున్నాం.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చెల్పూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్సార్ దిలీప్ కుమార్ నాయక్ ప్రజలు డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ప్రజలు పాల్గొనడం జరిగింది
మొగుళ్లపల్లి గ్రామంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సుమారు 24 సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయకుండా వృథాగా ఉండటం గమనించబడింది. ఈ కారణంగా గ్రామంలో భద్రతా వ్యవస్థ కొంత మేర బలహీనపడిన పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితిని గమనించిన మొగుళ్లపల్లి ఎస్సై ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకుని, ప్రత్యేక శ్రద్ధతో ముందుండి కెమెరాల మరమ్మతు పనులు చేపట్టించి, అన్ని సీసీ కెమెరాలు తిరిగి సక్రమంగా పనిచేసేలా చేశారు. ఆయన పట్టుదలతో చేసిన ఈ చర్య గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. సీసీ కెమెరాల పునరుద్ధరణతో గ్రామంలో నేరాల నియంత్రణకు దోహదపడటమే కాకుండా, అనుమానాస్పద సంఘటనలను పర్యవేక్షించేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసులకు సహకారం లభిస్తోంది. దీంతో గ్రామ ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగి, పోలీసులపై విశ్వాసం మరింత బలపడింది.
దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి
రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయ్
తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-5 ఎల్ఎంసి డిసి-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ, నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కి.మీ మేర కెనాల్ నిర్మాణం చేపట్టి దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో కెనాల్ పూర్తికాక సాగునీరు అందక ఈ సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందలేదని పేర్కొన్నారు.రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వేసవిలోనే పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు ఎస్ జి వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ కెవి సత్యనారాయణ,టిఆర్ఏ ఎస్ఎంఎ జిల్లా కార్యదర్శి కోరల్ల శ్యాంసుందర్,టిఆర్ఏ ఎస్ఎంఎ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సమీర్,సి ఆర్ పి పుప్పాల ప్రవీణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నవోదయ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.అనంతరం ఎంఈఓ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అలాగే నవోదయలో ఆరవ ర్యాంక్ సాధించిన చిలువేరు శ్రీహసన్ ను ప్రత్యేకంగా అభినందించారు.
నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ తెలిపారు. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, స్థానిక కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, ఇటీవల రూ.90 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.జయశ్రీ థియేటర్ నుంచి పెద్ద కాలువ వరకు, భవాని టెంట్ హౌస్ నుంచి పెద్ద కాలువ వరకు, సెంట్రల్ బ్యాంక్ నుంచి పెద్ద కాలువ వరకు సీసీ రోడ్లు, కాలువలు నిర్మించడంతో పాటు ఇతర కాలనీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పెద్ద కాలువపై డబుల్ సీసీ రోడ్డు, సంజీవని అనాథ ఆశ్రమం వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వార్డులో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని, పారిశుద్ధ్యం, సానిటేషన్ పనులను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్,స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం సర్పంచ్ మోయిజ్ తండ్రి యూనిస్ అనారోగ్యంతో మృతి చెందగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి, యూనిస్ భౌతిక గాయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకట్ రెడ్డి, పూడూరీ మల్లేశం, వీర్ల రవీందర్ రావు, జూపాక మునిందర్, పంజాల జగన్ మోహన్ గౌడ్, నాగి శేఖర్, గునుగొండ అశోక్ కుమార్, లంక మల్లేశం, మోహన్ రావు, అబ్దుల్ అజీజ్, పెసరి రాజమౌళి, నర్సయ్య, లచ్చయ్య, ఉప్పల గంగన్న, కరభూజ తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
క్యాతన్ పల్లి అభివృద్ధికి అధికార కాంగ్రెస్ పార్టీ సహకరించేనా…?
చైర్మెన్ పీఠం కైవసం చేసుకున్న బిఆర్ఎస్, సిపిఐ కూటమికి పెద్ద సవాలేనా…?
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపధ్యంలో ఎట్టకేలకు మున్సిపాలిటీ లో నూతనంగా బిఆర్ఎస్ సీపీఐ కూటమి పదవి బాధ్యతలు చేపట్టింది.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మునిసిపాలిటీ అభివృద్ధి పెద్ద సవాలు గానే నిలిచే అవకాశం లేకపోలేదు.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తో జత కలిస్తే అందుకు భిన్నంగా క్యాతన పల్లి మునిసిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తో జతకట్టి విజయం సాధించి 50 రోజుల నిరీక్షణానంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజక వర్గంలో ఈ మున్సిపాలిటీ ఉండటంతో అభివృద్ధికి మంత్రి వివేక్ సహకరించి నిధులు కేటాయిస్తారా..? లేదా అని వేచి చూడాల్సిందే. అందుకు నిదర్శనమే ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నప్పటికీ పోటీ చేసి ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు సైతం తమ వార్డుల్లో తామే కౌన్సిలర్లుగా భావించి అభివృద్ధి పనుల్లో కలుగచేసుకుంటు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో వారే ఆధిపత్యం కొనసాగిస్తారేమో అనే సందేహాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పెద్దలు చైర్మన్ పీఠం దక్కించుకున్న కౌన్సిలర్లకు డ్రైనేజ్ కాలువలు తీయించే పని తప్ప అభివృద్ధి పనుల్లో వారికి పనేం ఉండదు అంటూ ఎద్దేవా చేస్తూ మునిసిపాలిటీలో ప్రచారం చేస్తుండడం అందుకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే కింది స్థాయిలో ఉన్న నాయకులు మంత్రిని తప్పుదోవ పట్టించకుండా ఉంటే మంత్రి వివేక్ వెంకటస్వామి సైతం మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తారనే ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
మాదకద్రవ్యాలు,గంజాయి లాంటి పదార్థాలను కనిపెట్టే నాట్కోటిక్ డాగ్స్ చే తనిఖీలు
అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
సరైన పత్రాలు లేని 23ద్విచక్ర వాహనాలు,15 లీటర్ల మద్యం స్వాధీనం
సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిక్ వాడలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు,నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్విర్ సింగ్ చందర్ సింగ్‌లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు..ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పట్టణ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు శ్రీకాంత్,ఉపేందర్ ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గత కొన్ని నెలలుగా బోరు మోటర్ పనిచేయకపోవడంతో. గ్రామంలోని ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు గురవుతుండగా స్థానిక సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద 15 నెలలుగా పాడైపోయిన బోరు మోటర్ ను పున ప్రారంభించి గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని రోజులుగా గ్రామంలో నీటి బోరు పనిచేయకపోవడంతో గ్రామంలోని ప్రజలు నీ రు లేక ఇబ్బందులు గురవుతుండగా. సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి కష్టాలు లేకుండా ప్రజలకు మళ్లీ బోరు బాగు చేయించి ప్రజలకు నీటి కష్టాలు తొలగించే విధంగా బోరును పున ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారుఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ. ముందాటి శారద. నాయకులు రచ్చ మల్ల సుదర్శన్. గాలి వీరేశం. అలువాలప్రశాంత్.దిండిగాల లక్ష్మి.నాగిళ్ల.సత్యవతి.రాచర్ల వాణి. పుష్పలత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.