పాడైపోయిన బోరు మోటర్ పున ప్రారంభం….

పాడైపోయిన బోరు మోటర్ పున ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గత కొన్ని నెలలుగా బోరు మోటర్ పనిచేయకపోవడంతో. గ్రామంలోని ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు గురవుతుండగా స్థానిక సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద 15 నెలలుగా పాడైపోయిన బోరు మోటర్ ను పున ప్రారంభించి గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని రోజులుగా గ్రామంలో నీటి బోరు పనిచేయకపోవడంతో గ్రామంలోని ప్రజలు నీ రు లేక ఇబ్బందులు గురవుతుండగా. సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి కష్టాలు లేకుండా ప్రజలకు మళ్లీ బోరు బాగు చేయించి ప్రజలకు నీటి కష్టాలు తొలగించే విధంగా బోరును పున ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారుఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ. ముందాటి శారద. నాయకులు రచ్చ మల్ల సుదర్శన్. గాలి వీరేశం. అలువాలప్రశాంత్.దిండిగాల లక్ష్మి.నాగిళ్ల.సత్యవతి.రాచర్ల వాణి. పుష్పలత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేపట్టి ప్రజల తాగునీటి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవలే డీఫ్లోరేడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రాజెక్టును పునరుద్దించేందుకు కావాల్సిన నిధులు సుమారు రూ. 12 కోట్ల నుండి 25 కోట్ల వరకు నిధులు అవసరం కాగా నిధులు మంజూరు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అవి త్వరలోనే నిధులను మంజూరు చేయించి ప్రాజెక్టును పునరుద్దించి నర్సంపేట తాగునీటి సమస్య తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రాజెక్టు కేటాయించిన భూమి అక్రమానికి గురికాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.ప్రాజెక్ట్ నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు దూ సముద్రం చెరువు నుండి, అదే విధంగా ఎగువన ఫారెస్ట్ లో కురిసే వర్షపు నీటిని కాలువల ద్వారా నీటిని ప్రాజెక్టు చేర్చి నీటి సామర్థ్యం పెంచి నిత్యం నర్సంపేట ప్రజలకు నీరు అందించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version