ఈనాడు” దినపత్రిక పోటీల్లో విజేతలుగా చాలా మంది పోటీ చేశారు,సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో “ఈనాడు” ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభ పాటవ పోటీల్లో ప్రచోదన విద్యార్థి మొదటి బహుమతి విజయం సాధించి నిలిచింది, మరియు ఇటీవల జహీరాబాద్ లోని పరమిత డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల మొదటి బహుమతి అవార్డును గెలుచుకుంది, దీనిని డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల చైర్మన్ రామలింగా లక్ష్మారెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కవిత పలువురు ఉపాధ్యాయులు బహుమతి అందుకున్న ప్రచోదన విద్యార్థిని శుభాకాంక్షలు తెలియజేశారు, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పూజారి తన కూతురు ప్రచోదన మొదటి బహుమతి సాధించిందని గర్వంగా ఆనందం పడ్డారు, తన కూతురు మరిన్ని బహుమతులు అందుకోవాలని దేవునితో ప్రార్థిస్తా అన్నారు,
ఝరాసంగం ఎంఈఓ శ్రీనివాస్ గురువారం రోజు ,ఎం పి పి ఎస్, నర్సాపూర్, యుపిఎస్, గుంత మార్పల్లి కమలపల్లి,పాఠశాల లు తనిఖీ చేయడం జరిగింది విద్యార్థులకి చదివిపించడం, గుణింతాలు, చేపించడం జరిగింది, ఎఫ్ఎల్ఎన్, కార్యక్రమం అమలు, డిఎస్ఇ ఎఫ్ ఆర్ ఎస్, ఆన్లైన్ అటెండన్స్, పిటిఎం,పాఠశాలలోని ఉపాధ్యాయులు టిఎల్ఎం, తప్పకుండ ఉపయోగించాలి అని,విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం, మెనూ ప్రకారం అందించాలి, పాఠశాల చుట్టపక్కల పరిశుభ్రత పాటించడం, నాణ్యమైన విద్యాబోధన అందించాలి అని చూసించడం జరిగింది ఈ కార్యక్రమం లో, సి ఆర్ పి, చిరంజీవి, ఉపాధ్యాయులు ఈశ్వరమ్మ, సుస్మిత, సంగమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు
పూర్వ విద్యార్థుల కృషిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి
పరకాల,నేటిధాత్రి
చదువుకున్న పాఠశాలను కాపాడుకోవడం కోసం పూర్వ విద్యార్థులంతా ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమా జ్యోతి అన్నారు.సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం సిఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి అధ్యక్షతన సోమవారం పూర్వ విద్యార్థులు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్ కు లోబడి పాఠశాల అభివృద్ధి కార్యచరణ రూపొందించడం కోసం పూర్వ విద్యార్థుల నుంచి తాత్కలిక అడహక్ కమిటీని వేయడం జరిగింది. అడ హక్ కమిటీ చైర్మన్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎబ్బి,ముఖ్య సలహాదారులుగా కే.జే థామస్,జేమ్స్,సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్కు ఎక్స్ అఫీషి యో ( ప్రత్యేక హోదా )గా పరిగణంలోకి తీసుకుంటూ ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా ఒంటేరు ప్రభాకర్,కోకన్వీనర్ గాకాజీపేట రవీందర్,సెక్రటరీగా చొల్లేటి సునేందర్,కోశాధికారిగా బి.అశోక్, సలహాదారుడుగా ఒంటేరు చక్రి,కన్స్ట్రక్షన్స్ కన్వీనర్స్ గా బొచ్చు కళ్యాణ్, పాలకుర్తి తిరుపతిలను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఒంటేరు ప్రభాకర్ మాట్లాడుతూ 1948 సంవత్సరంలో స్థాపించి 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా ద్వారా తోడ్పాటు అందించిన సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల పూర్వవైభవమే పూర్వ విద్యార్థులు కృషి చేయాలని ఐక్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది అన్నారు.2026 -27 విద్యా సంవత్సరంలోపు సి ఎస్ ఐ మిషన్ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ జరగాలంటే ప్రతి ఎస్ఎస్సి బ్యాచ్ వారందరినీ వాట్సప్ గ్రూపులో యాడ్ చేస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పనులను తెలియజేస్తూ నిధులను సేకరించడం జరుగుతుందన్నారు.ఆయా నిధులను బ్యాంకు అకౌంట్ తీసి అందులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి సిఎస్ఐ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఎంతటి హోదాలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా వచ్చే నెల డిసెంబర్ 7న 11 గంటలకు అడహక్ కమిటీ సమావేశమై పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఒంటేరు చంద్రశేకర్,బొచ్చు అనంతరావు,ఒంటేరు మధు, బొచ్చు శ్రీనివాస్,పాస్టర్ బొచ్చు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
కేజీవీపీ ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.
#ప్రతి సబ్జెక్టులో ప్రతిభను ప్రతి విద్యార్థి పెంపొందించుకోవాలి.
#మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి.
#విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి వారితో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సమాజంలో నిలదోక్కోవాలంటే చదువు చాలా ముఖ్యం.
దానికోసం ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో ఇష్టం ఏర్పరచుకొని విజయం సాధించే దిశగా ప్రయాణం కొనసాగించాలని. అలాగే విద్యతో పాటు తమకు నచ్చిన వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొదించుకునే విధంగా విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ లేవని అదనపు కలెక్టర్ కు తెలియజేయడంతో స్పందించిన ఆమె త్వరలోనే డైనింగ్ టేబుల్ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్ ను, వంటశాల గది లోని కూరగాయలను, మెనూ ప్రకారం భోజనాన్ని పరిశీలించి కుళ్ళిపోయిన కూరగాయలు, ఉల్లిపాయలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఇలాంటి నాణ్యతలేని కూరగాయలను వెంటనే తీసివేయాలని పాఠశాల వంట మనుషులను ఆదేశించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని అన్నారు. అలాగే విద్యార్థినిలతోకలిసి భోజన సమయంలో భోజనం చేస్తూ వారితో మాటా మంతి చేశారు. ఆమె వెంట ఎంపీడీవో శుభ నివాస్, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, జ్యోతి, ఉపాధ్యా బృందం, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే సర్కార్ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ వడ్డించనున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారని అని ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామ మజీ కాంగ్రెస్ పార్టీ ఉప్పు సర్పంచ్ గోపాల్ అన్నారు. త్వరలోనే సీఎంతో చర్చించి పథకాన్ని అమలు చేస్తామన్నారని. నర్సాపూర్ గ్రామ మజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహించడం అభినందనీయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, రాజమండ్రి కందుకూరి వీరేశలింగం తియాటిక్ కళాశాల, సంయుక్తంగా ఈడుమెంట్ యు ఎడ్యుకేషనల్ ప్రో. వెంకట్స్ .టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే వర్క్ షాప్ పోస్టర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను చీఫ్ పాట్రన్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 100 శాతం అడ్మిషన్లు సాధించినందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తీసుకున్న చొరవ,ప్రణాళికలను మరింత పెంపొందించాలన్నారు. కళాశాలకు అవసరమైన అభివృద్ధిలో ముందుండి నడుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నవీన్ తో పాటు, అధ్యాపకులు ఎం ఎం కె రహీముద్దీన్,డాక్టర్ కందాల సత్యనారాయణ, ఎస్ కమలాకర్, డాక్టర్ రాంబాబు,డాక్టర్ సోమయ్య, ఎస్ రజిత పాల్గొన్నారు.
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి *డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి*
నర్సంపేట,నేటిధాత్రి:
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దానికి ప్రభుత్వం చొరవచూపి ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పేదలకు అందని విధంగా తయారు కావడం జరిగిందన్నారు. పాలకులు కేటాయించవలసిన నిధుల కేటాయింపులో పక్షపాతం చూపడం తో విద్యారంగం ముందుకు పోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మానవనరుల అభివృద్ధిలో భాగంగా కాకుండా లాభనష్టాల కోణంలో చూపడంతో నేడు విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు అందరికీ విద్య అందాలనే కొఠారి కమిషన్ ను అమలు పరచకుండా వ్యాపారంగా చూడడంతో నేడు విద్యారంగం వెనుకబడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతా బడుగు బలహీన వర్గాల చదువు కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ విద్యారంగంలో మార్పు లేదన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాగిత యాకయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.ఈ జిల్లా సదస్సులో అధ్యాపక జ్వాలా సంపాదకుడు డాక్టర్ గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు గుంటి రామచందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి. ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ల సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్ రాష్ట్ర కౌన్సిలర్ కొమ్మాలు జిల్లా ఉమా శంకర్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ మండలాల బాధ్యులు ఎస్కే సర్దార్ కొర్ర రమేష్ మాలోతు జగన్ ఈదుల వెంకటేశ్వర్లు రావుల దేవేందర్ శ్యాంప్రసాద్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్.పిఓ డి.రమేష్ ఆధ్వర్యంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోబేగ్లూర్ గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ఎన్ఎస్ఎస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖులందరూ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పౌరులుగా మంచి విద్యా వేతలుగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎస్ ఎస్ఎస్పీఓ ఏడు రోజులు ఈ గ్రామంలో హరితహారం మెడికల్ క్యాంపు స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే సర్వే ఓటర్స్ డే ర్యాలీ పలు రకాలైనటువంటి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈ ఏడు రోజుల శిబిరంనీ ఉద్దేశిస్తూ వాలంటరీస్ కి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటిరోజులో భాగంగా మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య కోపరేటివ్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ రాణి బాయి మహాదేవపూర్ ఎంఈఓ ప్రకాష్ కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం రెడ్డి మాజీ ఎంపిటిసి పద్మ ఓదెలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు సమ్మయ్య కర్ణ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లాల సమ్మిరెడ్డి ఆర్థిక సహాయంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు మడక మధు ఆధ్వర్యంలో స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కలిపి 120 స్టీల్ వాటర్ బాటిల్ల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటు వంటి కాటారం డి.ఎస్.పి సూర్యనారాయణ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య ఉండాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని దానికోసం నిరంతరం కృషి చేయాలని, ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు వ్యక్తిత్వ నిర్మాణం సేవాభావం, నైతిక విలువలు నేర్పాలని మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వివరించారు. మడక మధు మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన జరిగే అనర్దాలను వివరిస్తూ పాఠశాలలో వాటర్ బెల్ పెట్టి ప్రతి రోజు కనీసం 4 లీటర్ల నీరు స్టీల్ బాటిల్ లో పట్టుకొని అందరు కూడా తాగి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి, అధ్యక్షత వహించగా ఎంఈఓ ప్రకాష్ బాబు, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్, జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హెచ్ఎం శ్రీనివాస రెడ్డి మరియు గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులు కటకం అశోక్, చల్ల ఓదెలు, శివరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, సాయి కుమార్, ప్రవీణ్, మౌనిక, లక్ష్మి మరియు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన
మోహన్ నాయక్ కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ముందు నిరసన.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బిట్స్ స్కూల్ లోనే విద్యార్థి నీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మెసేజ్లు పంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ ముందు నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా టౌన్ అధ్యక్ష కార్యదర్శులు నందకిషోర్ వికాస్ మాట్లాడుతూ. జిల్లా బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తక్షణమే వారిని విధుల్లో నుంచి తొలగించాలని దాంతోపాటు విద్యార్థినిలను మెసేజ్లు పెట్టి ఇబ్బందికి గురి చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ గా డిమాండ్ చేస్తున్నాము.తాము చదువు చెప్పే విద్యార్థినీల పట్ల విద్యార్థులను టార్గెట్ చేసుకొని వారిని సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టి ఇబ్బంది గురి చేసిన వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా చూడాలని కోరారు..
జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా లక్షెట్టిపేట (బాలికల) గురుకుల విద్యాలయంలో దరఖాస్తులు సమమర్పించాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్, ర్యాంకు ధ్రువీకరణ పత్రాల నకలు ప్రతులు జత పరచాలని సూచించారు. లక్షెట్టిపేట, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి (బాలికలు), బెల్లంపల్లి, కాసిపేట, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్ (బాలుర) సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 18న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి, భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. బాలికల గురుకులాలలోని 6వ తరగతిలో ఎస్ సి 6, ఎస్టి 2, బీసీ 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు ఉన్నాయని, 7వ తరగతిలో బీ సి 5 సీట్లు, 8 వ తరగతిలో ఎస్ సి 4, ఎస్టి 1, బీసీ 10, జనరల్ 6, మైనారిటీ 5, 9వ తరగతి లో ఎస్ సి 3, ఎస్టి 4, బీసీ 4, జనరల్ 5, మైనారిటీ 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బాలుర గురుకులాలలో 5వ తరగతిలో, ఎస్టి 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు, 6వ తరగతిలో ఎస్ సి 9, ఎస్టి 5, జనరల్ 1, మైనారిటీ 6 సీట్లు, 7వ తరగతిలో ఎస్ సి 5 సీట్లు, 8వ తరగతిలో ఎస్ సి 8, బీసీ 8, జనరల్ 6, మైనారిటీ 8, 9వ తరగతి లో ఎస్ సి 11, బీసీ 4, ఓసీ 7, మైనారిటీ 5 సీట్లు ఉన్నాయని తెలిపారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది
ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు-జ్యోతిబాపూలే ప్రిన్సిపల్ ప్రిసిల్ల
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: ఆడపిల్లల చదువు ప్రతి ఇంటికి, దేశానికి వెలుగునిస్తుందని, బాల్య వివాహాలు చేయకుండా బాలికలను ఉన్నత చదువులు చదివించాలని సంగారెడ్డి జిల్లా కోహీర్(ఝరాసంగం) మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిసిల్ల అన్నారు.శనివారం పాఠశాల, కళాశాలలో అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఆడపిల్లను చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు. బాలికల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనివ్వడం అభినందనీయమని చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల ఎన్కెపల్లిలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఇదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి. కమల మనోహర్ బాబు దంపతులు శుక్రవారం మండల విద్యాధికారి ఎల్.పురన్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి మునీర్ పాషా చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి పురందాస్ మాట్లాడుతూ దాతలు పేద విద్యార్థులకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించినప్పుడు ఇదే తరహాలో పేదవారికి సహాయం చేయాలని అన్నారు. ధనం చాలామంది దగ్గర ఉన్నప్పటికీ దానగుణం కొందరిలోనే ఉంటుందని,అలాంటి వారిలో కమల టీచర్ దంపతులు ఒకరని అభినదించారు. వారు చేసిన మంచి ఎప్పటికీ వారి వెంట ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా దాత మనోహర్ బాబు మాట్లాడుతూ భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత విద్యార్థులతో పంచుకుంటున్నాను అని అన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తదుపరి పాఠశాల పక్షాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కలసి దాతను విద్యాధికారి సమక్షంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రేణు అంగన్వాడి కార్యకర్త స్వరూప ,ఆశ కార్యకర్త సుజాత విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ గారి అల్లుడు ,ఆనంద్ గారి కుమారుడు హర్షిత్ క్వాలిఫై అయ్యి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల, కొనింటి మాణిక్‌రావు విద్యార్థి ని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,నాయకులు తదితరులు..
— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు • చదువుతోపాటు క్రీడలు అవసరమే.. సీఐ వెంకట రాజ గౌడ్
నిజాంపేట: నేటి ధాత్రి
విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
సత్ఫలితాలనిస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్-2025లో సత్తాచాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్గోల్, బూచినెల్లి క్యాంపస్ల నుంచి 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు పదేండ్లలో డాక్టర్లుగా 1200 మందికి పైగా గురుకుల విద్యార్థులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
జహీరాబాద్, మాజీ ముఖ్యముతై కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.. దీంటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు విరునామాగా నిలుస్తు న్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక లోని అల్గోర్ బూచి బూచిపెట్టె గ్రామ గ్రామ శివారులో (టెర్రెస్) మైనార్డ్ గురుకుల క్యాంపస్ విదర్శనం. ఈ రెండు బ్యాండ ల నుండి ఈ ఏడాద్ 18 మందికి పైగా విద్యార్థులు ఎంటి బీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్య వన్దకే గర్వకారణం. ఇఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యా భ్యాసమనేది మీద, మధ్యతరగతి విద్యార్థులకు అందన్ డ్రాక్ష ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే
పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, విరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కల లను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతో పాటు నాణ్యమైన విద్యను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వ ర్యంలో 66. మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (ప్రతిభా కళాశాలలు) గా తీర్చిదిద్దింది.
ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యా ర్థులను ఎంపిక చేసి ఐఐటీ, తేవారు, వీటి పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవి ధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్స్ను ఉచి తంగా అందించింది. ఫలితంగా గత పదేం లో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థా యిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశం వారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థ ల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సీవోఈలు గిలిచాయంటే అతి శయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోధుల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యా ర్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది..
మైనార్టి గురుకులాల నుంచే 10 మందికి ఎంబీబీఎస్ సీట్లు
కేసీఆర్ దార్శనికతడు సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నియోజకవర్గంలోని అల్గో అల్గోల్, బూరె వెళ్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయాకళా శాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు జేఈఈ, నీటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.
దీంతో ఇక్కడి విద్యా ర్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కు లతోపాటు జిల్లా, రాష్ట్రాస్థాయిలో ర్యాంకులు సాదిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందు తున్నారు. 2020 సంవత్సరానికిగాను నిర్వ హించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచి వెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు హాజర య్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలి తాల్లో ఆయా కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలే జిల్లా సీట్లు సాదించి సత్తా చాటారు.
అంటే ఇక్కడ చదివిన ప్రతి బదుగురిలో ఒక్కరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుధ గురు కుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిరోస్, ధర్మ తేజ, సిద్ధి రమేశ్, ఎస్వీ ఆయాన్, ఎండీ ఓబెడ్, గౌతమిఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచి వెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా పాతిమా షేక్ సమీనా మర్దార్ గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీర్, తస్లీం, సరేఖ మర్డాన్, ఫిరోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.
గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగా లను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదుని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యా పకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ దూరదృష్టికి
◆:- తార్కాణం గురుకులాలు గురుకుల
◆:- విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషం
◆:- ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదగడం గర్వకారణం
మాజీ మంత్రి హరీశ్ రావు
కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతో ద్యోగులుగా సేవలందించడం గర్వకార ణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచిపల్లి మైచార్జీ గురుకులం ప్రారంభం సంద ర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యూచర్లో ఏం అవు తావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్ష ర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిస్టోన్ అనే విద్యార్థిని మాట నిలబెట్టు కున్నది.
కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిరోసోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎని మిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంచి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. లీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకు చాల ప్రిన్సిపాళ్లు, ఉపాద్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైం దని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నీరు పేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.
జహీరాబాద్: మధ్యాహ్న భోజనం పై ప్రత్యేక దృష్టి సారించండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై ఏంఈవోలు తనిఖీలు చేయాలని సూచించారు. స్థలం ఉన్న పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోపు విద్యార్థుల హాజరును మొబైల్ యాప్ లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు.
అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు
8వ తేదీన దరఖాస్తులు స్వీకరణ,9వ తేదీన ఇంటర్యూ నిర్వహణ
పరకాల నేటిధాత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025,26 విద్యా సంవత్సరానికి గాను ఆతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ తెలిపారు.విద్యాశాఖా కమీషనర్ ఆదేశాల మేరకు బోటనీ విభాగంలో 1,మరియు మాథెమాటిక్స్ విభాగంలో 1కి గాను ఆతిధి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని,సంబందిత సబ్జెక్టులో 55శాతం మార్కులు (ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు)కలిగి ఉంటే ధరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.పిహెచ్డి,నెట్,సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది తెలిపారు.దరఖాస్తులు ఈ నెల 08వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని,ఇంటర్వ్యూలు 09వ తేదీ ఉదయం నిర్వహించడం జరుగుతుందని అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు.సమాచారం కోసం 9951535357 గల నెంబర్ ను సంప్రదించాలని కోరారు.
స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించే వెబ్ ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన ప్రధానోపాధ్యాయులు http://transfer.de.telangana.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడతాయి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.