దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి…

దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి

రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయ్

తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-5 ఎల్ఎంసి డిసి-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ, నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కి.మీ మేర కెనాల్ నిర్మాణం చేపట్టి దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో కెనాల్ పూర్తికాక సాగునీరు అందక ఈ సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందలేదని పేర్కొన్నారు.రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వేసవిలోనే పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.

తూముల్లో తుమ్మ పొదలు..

తూముల్లో తుమ్మ పొదలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రతీ ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో సమృద్ధిగా నిండిపోతున్నాయి. కానీ, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వ్యాప్తంగా ఏడాకులపల్లి కొత్తూరు వాగు, రాళ్ల వాగు చెరువులు, మేదపల్లి శివారులో గుండం చెరువు, ఏనుగుల చెరువు, ఈదులపల్లిలో కప్పలగ వాగు చెరువు, రాచన్న వాగు చెరువు, గంగాపూర్లో చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల కింద దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు సూచిస్తున్నాయి. కానీ వాటి తూములు, సీసీ కాలువలు శిథిలావస్థకు చేరి 10 ఏళ్లు గడిచిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. 200 ఎకరాలకు కూడా నీరు చేరడం లేదు. దీంతో పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు పండించే వివిధ రకాల పంటలకు నీరు అందకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో తూములు, కాలువలు..

ఝరాసంగం మండల వ్యాప్తంగా 7 పెద్ద చెరువులు ఉండగా, పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్కపల్లి, చిలేపల్లి, ఎల్గోయి తదితర గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వాటి తూములు శిథిలావస్థకు చేరుకోగా, మట్టి కాలువలు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరడం లేదు. చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తున్నారు. మరి కొంతమంది రైతులు చెరువుకు సమీపంలో ఉన్న రైతులు మోటర్లు బిగించుకొని పంటలు పండిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న రైతులు వర్షాధార పంటల పైనే ఆధారపడి ఉన్నారు. ఆయా గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు,గ్రామస్తులు పలుమార్లు చెరువుల మరమ్మత్తులు చేయాలని అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువులకు సంబంధించిన కాలువలు, మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సర్పంచుల.ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్.కి.వినతిపత్రం…..

సర్పంచుల.ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్.కి.వినతిపత్రం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో .కలెక్టర్కు వినతిపత్రవినతి. ఇట్టి విషయమై తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఉన్న .కాలేశ్వరం 11.వ .ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి .చేయనందున. కాలేశ్వరo .ప్రాజెక్టు ఎల్ ఎం సి.11/6.11/5.11/4. సంబంధించిన కాలువ పనులపై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవనీయులైన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చొరవ తీసుకొని అసంతృప్తిగా ఉన్నకాలేశ్వరం.ప్రాజెక్టు కాలువ .పనులను పూర్తి చేసి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు .కాలేశ్వరం ప్యాకేజీ పనులు పూర్తిచేసి కాలువ నీటి ద్వారా. రైతులను ఆదుకోవాలని. దయచేసి వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ . తీసుకొనికాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ కాలువల ద్వారా రైతులకు నీరు అందించే విధంగా పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో చర్చ జరిపి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామాల రైతుల తరఫున సర్పంచులు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల. సర్పంచుల .ఫోరం అధ్యక్షులు పూర్మాని రాజశేఖర్ రెడ్డి. బస్వాపూర్. రామన్న పల్లె సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి. అనిల్. అంకుసాపూర్ సర్పంచి అంచ శ్రీనివాస్ రెడ్డి.లక్ష్మీపూర్ సర్పంచ్ నాయిని సాయి కృష్ణ గౌడ్. పాపాయిపల్లి. సర్పంచ్ చెన్నవేనీ.పరశురాములు. ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్. రామనపల్లె యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version