భూముల కబ్జాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్
రైతుల పరామర్శకు వెళ్తున్న సమయంలో అరెస్ట్ అన్యాయం
భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్
ప్రతిపక్షాలను అణచివేయడం అప్రజాస్వామికం
హరీష్ రావు అరెస్టు పట్ల పెద్ది సుదర్శన్ రెడ్డి ఖండన
నర్సంపేట, నేటిధాత్రి:
భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ లు చేస్తారా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది తీవ్రంగా ఖండించారు. పరిగి నియోజకవర్గంలోని కళాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో హరీష్ రావును అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న మైనింగ్ మరియు భూముల దందాలను అసెంబ్లీలోనూ, బయట మీడియాలోనూ ప్రశ్నిస్తున్న హరీష్ రావును కోకాపేటలోని నివాసంలో గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల భూములను కబ్జా చేస్తోందని ఆరోపించారు.కబ్జాలు, అక్రమ మైనింగ్ దందాలను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇటీవల అదిలాబాద్‌లో అక్రమ అరెస్టులు చేయమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించడం పిరికిపాందా చర్యగా అభివర్ణించారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందకపోవడం, రుణమాఫీ అమలు కాకపోవడం, ఎరువులు సకాలంలో అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు.ప్రజల పక్షాన పోరాటం చేస్తే కేసులు, అరెస్టులు చేయడం కొత్త కాదని, పోలీసుల బలంతో ప్రతిపక్షాలను అణచివేయాలనే ప్రయత్నాలు అప్రజాస్వామికమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి బెదిరింపులకు భయపడరని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
[4:03 pm, 7/4/2026] +91 99087 62239: ఈ వార్త లింక్ రాలేదు..
