ఘనంగా శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు.

ఘనంగా శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు.

కోదాడ, నేటి ధాత్రి:

మండల పరిధిలోని గణపవరం గ్రామంలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేడుకలను దేవాలయ నూతన చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని దంపతులు పీటల మీద కూర్చొని వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులకు భక్తితో పాటు గ్రామ యువకులలో ఉన్న ప్రతిభను గుర్తించటానికి రెండు రోజులపాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలచే బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల అనంతరం దేవాలయం నందు సాంస్కృతిక కార్యక్రమాలు, రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాన్ని గ్రామమునందు కనుల పండుగగా నిర్వహించారు.

చివరి రోజు గ్రామం నందు బండి ఎడ్ల పందెం వేడుకలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతిని దేవాలయ కమిటీ చైర్మన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ. శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల వేడుకలను నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి స్వామివారి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలను ఇంత పెద్ద బాధ్యతను మా పై నమ్మకంతో కమిటీని ఏర్పాటు చేసి పదవి బాధ్యతలను చేపట్టడానికి సహకరించిన రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి లకు కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు సహకరించిన దాతలకు పెద్దలకు ఏ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వహణ కమిటీ నూతన చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, కమిటీ సభ్యులు కంపసాటి ఐతం రాజు, పిరమర్తి తిరుపమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు పెద్ద వీరయ్య, బాలే బోయిన వెంకటేశ్వర్లు, ఆత్కూరి నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, దేవదాయ శాఖ నల్గొండ సహాయ కమిషనర్ కోదాటి భాస్కర్, దేవదాయ శాఖ మిర్యాలగూడ డివిజన్ పరిశీలకులు ఎన్. సంతోష్ రెడ్డి, దేవాలయాల కార్య నిర్వాణ అధికారి తుమ్మల వెంకట చలపతి, గైన్ ఫార్ములేషన్ కొంపల్లి హైదరాబాద్ సాని కొమ్ము తరుణ్ కుమార్ రెడ్డి, గ్రామ వార్డు కౌన్సిలర్లు, బండి చిన్నకోటయ్య,సింగారెడ్డి, కాసాని శ్రీనివాసరావు, పెడమర్తి ప్రసాద్, గ్రామ పెద్దలు, నాయకులు యువకులు, తదితరులు మహిళలు భక్తులు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version