యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు. సృజనాత్మకత. న్యాయకత్వ. లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికి తీసే కార్యక్రమం ద్వారా. అగ్రి యూత్ ఫెస్ట్. (యువజన ఉత్సవాలు) ఈనెల .18.వ తేదీ నుండి .21.వ. తేదీ వరకు మూడు రోజులపాటు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన. వారిని. గ్రీన్ ఎక్స్కో. స్టోరీ టెల్లింగ్. జానపద గీతాలు. ఒగ్గు కథ. డ్యాన్స్. బీట్ లైవ్ పోటీలలో. ప్రథమ స్థానంలో. నిలవగా. ఉపన్యాసం వ్యాసరచన. దేశభక్తి గీతరచన. స్పెల్ బి. ఏకో రంగోలి. లవ్ పెయింటింగ్ పోటీలలో. ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద .నృత ప్రదర్శనలో. తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు సృజనాత్మకతకు. ఈ యువజన ఉత్సవాలలో. ఓవరాల్ ఛాంపియన్షిప్ లను. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలు సొంతం చేసుకుంది. వీటిని.PJTAU. యువజన ఉత్సవాలలో.BJR. అగ్రికల్చర్ కాలేజీ .ఓవరా ల్. ఛాంపియన్షిప్ గా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ . డా. కె. బి. శ్వేతా దేవి. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు.ఇటువంటి కార్యక్రమాలు. నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తమ కళాశాలకు మంచి పేరు తీసుకోవడానికి కృషిచేసిన విద్యార్థులకు బోధన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు…

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

మంచిర్యాల మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

యువ విజేతలకు సత్కారం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్ లక్డీకాపూర్ లోని రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేశారు.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డులు ఒలంపియాడ్ టాపర్ల విశేషమైన విజయాలను సాధించిన విద్యార్థులకు 20, గోల్డ్,40 స్టేట్,400 డిస్ట్రిక్ట్,20 గురుబ్రహ్మ&చిత్రాలయ యువ విజేతలకు సత్కారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా గంట శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,అధ్యక్షులు చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,ప్రత్యేక అతిధి సినిమా భారతీయ నటుడు శ్రీకాంత్, భారతీయ నటుడు శివాజీ రాజా,లయన్ డాక్టర్ వై.కిరణ్, చైర్మన్-సూచిరిండియా గ్రూప్ కాన్సుల్ జనరల్ -బల్గేరియా రిపబ్లిక్ టి.జి & ఏ.పి , సైకాలజిస్ట్, పాల్గొన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యార్థులు 1లక్షకు పైగా విద్యార్థిని,విద్యార్థులకు ఏర్పాటు చేసిన టాలెంట్ టెస్టులలో మంచిర్యాల నస్పూర్ మండలంలోని మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు 8 మంది పోటీలో పాల్గొనగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బైరం కాంక్షిత మొదటి స్థానంలో గెలిచారని మిగతా విద్యార్థులు వివిధ స్థానంలో గెలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబిహ సుల్తానా తెలిపారు.ఈ సందర్భంగా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సాధించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని రంగాలలో విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా గెలుపొంది తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.

కరాటేలో ఐరిస్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ ప్లే స్కూల్, తూముకుంట విద్యార్థులు ప్రతిభ..

కరాటేలో ఐరిస్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ ప్లే స్కూల్, తూముకుంట విద్యార్థులు ప్రతిభ
* విద్యార్థులను అభినంధించిన ఐరిస్ ఫ్లోరెట్స్ డైరెక్టర్ బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్, ప్రిన్సిపల్ అపర్ణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 17 :

 

విద్యార్థులకు చదువుతో పాటు ఆత్మ రక్షణ శిక్షణ అవసరమనని ఐరిస్ ఫ్లోరెట్స్ డైరెక్టర్ రవీందర్, ప్రిన్సిపల్ అపర్ణ అన్నారు. ఈ పోటీలు స్కైలైన్ షోటోకాన్ స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఆదివారం నిర్వహించిన 5వ అంతర్జాతీయ హుయాన్ చుంగ్ ఇండియా – జాతీయ స్థాయి కుంగ్-ఫూ & కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ 2025–26లో తుంకుంట లోని ఐరిస్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ ప్లే స్కూల్ విద్యార్థులు కరాటే పోటీల్లో విశేష విజయాలు సాధించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో అందరి ప్రశంసలు పొందారన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావం, కఠిన శ్రమ ఈ విజయానికి కారణమయ్యాయి. పతకాలు సాధించిన శ్రీవల్లి – (బంగారు), మాన్‌విత్ – (వెండి), సుమిత్ర – (వెండి), చార్విక్ – (వెండి), జశ్వంత్ –( కాంస్య), రోహిత్ – (కాంస్య), రితిక్– (కాంస్య) పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో కోచ్ ఏ. హరిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version