ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు…

ఘనంగా అభ్యాస కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

నర్సాపూర్ ప్రాంతంలోని అభ్యాస కిడ్స్ స్కూల్ లో శనివారం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యా భూషణ్ డాక్టర్ సుధతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ద్వారా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.పాఠశాలలు విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి వేదికలుగా నిలవాలని తెలిపారు.అనంతరం విద్యా,క్రీడా, ఇతర కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కవితా బాపురెడ్డి అభ్యాస కిడ్స్ ప్రిన్సిపల్ కవిత బాపిరెడ్డి,గౌరవ అతిథి రమణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠశాల స్థాయి నుండే వినయ విధేయతలు అవసరం: మంత్రి వివేక్

పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు వినయ, విధేయతలు కలిగి ఉండాలి…

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

విద్యార్థులు తమ పాఠశాల స్థాయి నుండే వినయ విధేయతలు కలిగి ఉండాలని, విజ్ఞత తో కూడిన విద్యను అవలంబిస్తూ పాఠశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బిఎల్ అల్ఫో న్సా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.ముఖ్య అతిథులుగా జోషప్ తచాపరంభాత్, బినోయ్ మ్యాథ్యూ , ఎంఈఓ రమేష్ రాథోడ్, సిస్టర్ నోబుల్ లు హాజరవ్వగా పాఠశాల హెడ్ మిస్ట్రెస్ బ్లేస్సి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు.

ఆల్ఫోన్స లాంటి పాఠశాల రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం అని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో కష్టపడాలని సూచించారు.ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించినపుడు తల్లిదండ్రులు విజ్ఞతతో మెలగాలని తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు కనబర్చిన సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులను అబ్బురపరచాయి. పాఠశాలలో ప్రతీ రోజూ,ప్రతీ కార్యక్రమంలో నిర్వహించే అంశాలను వీడియో ఆల్బమ్ రూపంలో చక్కగా చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్య అతిథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version