చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శ…

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం సర్పంచ్ మోయిజ్ తండ్రి యూనిస్ అనారోగ్యంతో మృతి చెందగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి, యూనిస్ భౌతిక గాయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకట్ రెడ్డి, పూడూరీ మల్లేశం, వీర్ల రవీందర్ రావు, జూపాక మునిందర్, పంజాల జగన్ మోహన్ గౌడ్, నాగి శేఖర్, గునుగొండ అశోక్ కుమార్, లంక మల్లేశం, మోహన్ రావు, అబ్దుల్ అజీజ్, పెసరి రాజమౌళి, నర్సయ్య, లచ్చయ్య, ఉప్పల గంగన్న, కరభూజ తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

పార్ధీవ దేహానికి నివాళులర్పించిన మాలహల్ రావు

 

పార్ధీవ దేహానికి నివాళులర్పించిన మాలహల్ రావు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల దామోదర్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి,వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి,ఘన నివాళ్లులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి కుడ్ల మలహాల్ రావు వెంట నడికూడ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు,ఎఎమ్సి డైరెక్టర్ భోగం కమల,పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,చౌటుపర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు ఓదేలా రవి,ముస్తలపల్లి గ్రామా కమిటీ ఎస్సి సెల్ అధ్యక్షులు బోట్ల అనిల్,నార్లపూర్ గ్రామ బూత్ కమిటీ సభ్యులు శనిగరపు రవీందర్, ముస్తాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల రవి, రాజేందర్(రమాకాంత్),రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి నీరటి రాములు, సీనియర్ నాయకులు బందెల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version