టెస్కో ఆర్డర్లురద్దు ..చేనేత కార్మికులపై ప్రభావం
టెస్కో ద్వారానే వస్త్రా లను కొనుగోలు చేయాలని ధర్నా
ప్రైవేటు టెండర్ విధా నాన్ని రద్దు చేయాలని డిమాండ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ కార్మికులు టెండర్ విధానాన్ని రద్దుచేసి టెస్కో ద్వారానే కొనుగోలు చేయా లని ధర్నా చేశారు. అలాగే ప్రైవేటు టెండర్ల విధానాన్ని రద్దుచేసి ఇప్పటికి ఏప్రిల్ ఒక్కటే తారీకు నుండి వస్త్రా లు టెస్కో నుండి కొనలేమని ప్రభుత్వం ఖరీదు చేయమని చెప్పడంతో చేనేత సొసైటీలు నూలుకోనడం ఆపేశారు చేనేత కార్మికులకు ఇకనుంచి పని ఉండదని అన్నారు .ప్రై వేటు వ్యక్తులకు ఇచ్చారు అని చెప్పడంతో చేనేత కార్మికులు అయోమయంలో పడ్డారు అయ్యో మాకు ఉపాధి కోల్పోతే మేము ఎక్క డికి పోవాలని ఆందోళనలో పడ్డారు.ప్రభుత్వం తొందరగా స్పందించి ఆర్డర్ అన్ని టెస్కో కి ఇవ్వాలని చేనేత కార్మికుల ధర్నాకు దిగారు. ఇప్పటికైనా మండలంలోని చేనేత సహ కార కేంద్రంలో సరైన పని లేక ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం సైతం నుంచి వచ్చే ఆర్డర్లు రాకపోవడంతో దార మని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి టెస్కో కు ఆర్డర్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని , ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లు చేనేత సంఘాలకు అప్పగించి వారి ఆర్థిక పురోగాభివృద్ధికి సహక రించాలని కోరారు.ఈ కార్య క్రమంలో దిడ్డీ రమేష్ బూర లక్మినారాయణ, బాసని నవీ న్ ,దుబాసి రవి దాసరి రమేష్ వడ్డేపెళ్లిశ్రీను వనం దేవ రాజ్ సామల భిక్షపతి కుసుమశ రత్, తుమ్మ ప్రభాకర్ చేనేత కార్మికుల పాల్గొన్నారు.
