అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version